గర్భంతో ఉన్నవారు సెల్లుకు దూరంగా ఉండాలిట
గర్భంతో ఉన్న మహిళలు సాధ్యమైనంతవరకూ సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంటే మేలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఎక్కువసేపు సెల్ఫోన్లో మాట్లాడడం వల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యపరంగా పలు ఇబ్బందులను ఎదుర్కొనాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఎవరి చేతలో చూసినా సెల్లు గల్లుమంటూ మోగుతుంటుంది. దూరంగా ఉన్న దంపతుల మధ్య సెల్లే వారధిగా ఉంటోంది. అందునా గర్భిణులైతే మరీ ఎక్కువగా సెల్ఫోన్లో మాట్లాడేస్తున్నారట. ఇలా మాట్లాడుతున్న వారిపై అధ్యయనం చేయగా ఈ విషయాలన్నీ తేలాయట.
కాలిఫోర్నియా, దక్షిణ కాలిఫోర్నియాకు చెందిన శాస్త్రవేత్తల బృందం గర్భంతో ఉన్న సమయంలో ఎక్కువసేపు సెల్ఫోన్లో మాట్లాడిన తల్లులకు పుట్టిన 30 వేలమంది చిన్నారులపై వివిధ రకాల పరీక్షలను జరిపినప్పుడు ఈ పరీక్షల్లో వారిలో యాభై శాతం మందికి పైగా రేడియేషన్ ప్రభావానికి గురైనట్టు తేల్చారు. దీనికి కారణం తల్లులు గర్భిణులుగా ఉన్న సమయంలో ఎక్కువసేపు సెల్ఫోన్లో మాట్లాడడమే కారణమని నిపుణులు తేల్చారు. రేడియేషన్ ప్రభావం పుట్టిన వెంటనే కనిపించకపోయినా, బిడ్డ పెరుగుతున్న కొద్దీ అవలక్షణాలు బయటపడుతున్నట్టు తాము గుర్తించామని శాస్త్రవేత్తల బృందం చెబుతోంది.
తల్లి గర్భంతో ఉన్న సమయంలో రేడియేషన్ ప్రభావానికి గురయ్యే చిన్నారులు ముఫ్పైశాతంగా నమోదుకాగా, చిన్నారుల ముద్దు మాటలకు ముచ్చటపడి వారిచేత సెల్ఫోన్లో మాట్లాడించడం వల్ల ఇరవై శాతం మంది రేడియేషన్ ప్రభావానికి గురవుతున్నారని నిపుణుల అధ్యయనంలో తేలింది. కాబట్టి గర్భంతో ఉన్న మహిళలు అవసరం మేరకు మాట్లాడితే పరవాలేదుగానీ, అతిగా మాట్లాడితే దానివల్ల గర్భంలో ఉన్న బిడ్డకు ప్రమాదమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.