Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

2016లో రిటైర్ అవ్వాలనుకుంటున్న సోనియా..!

భర్త రాజీవ్ గాంధీ మరణానంతరం కొన్నాళ్ళకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అధినేత్రి సోనియాగాంధీ 2016లో బాధ్యతల నుంచి తప్పుకోవాలకుంటున్నారట. అప్పటికి తనకు డెబ్భై ఏళ్లు నిండుతాయి. అప్పుడు పార్టీని నడిపించే బాధ్యతను కుమారుడు రాహుల్ గాంధీ చేతిలో పెట్టాలని సోనియా నిర్ణయించుకున్నట్లు జర్నలిస్ట్, రచయిత రషీద్ కిద్వాయ్ రాసిన '24 అక్బర్ రోడ్' పుస్తకంలో పేర్కొన్నారు. గతేడాది డిసెంబర్ 9న జరిగిన పుట్టినరోజు వేడుకల సమయంలో సోనియా ఈ విషయాలను పార్టీ సీనియర్ నేతలతో పంచుకున్నట్లు తెలిపారు. ఈ మాటలు విన్న వెంటనే ఆశ్చర్యపోయిన పార్టీ నేతలు.. ఆ బాధ్యతలను రాహుల్ కు అప్పగించాలని మేడమ్ కు విజ్ఞప్తి చేశారట. ఈ నేపథ్యంలోనే రాహుల్ ను ఈ ఏడాది జనవరి 19న జైపూర్ లో జరిగిన 'చింతన్ శివిర్' లో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు పుస్తకంలో వివరించారు.

More Telugu News