జగన్, సీబీఐ, కాంగ్రెస్ పార్టీకి టీడీపీ ప్రశ్నాస్త్రాలు

25-09-2013 Wed 14:00
సబిత, ధర్మానలు మీడియా సమావేశం పెట్టినప్పుడు వారు సాక్షులను ప్రభావితం చేస్తారని చెప్పి వీడియోలను కోర్టు ముందు ప్రవేశ పెట్టిన సీబీఐ.. జగన్ పై మాత్రం ఎందుకు నమ్మకముంచిందని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు. హైదరాబాదులోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మాట్లాడుతూ, జగన్ కు ప్రభుత్వ లాంఛనాలతో ఊరేగింపు చేస్తూ స్వాగతం పలికినప్పుడు సాక్షులకు భయం వేయదా? అని అన్నారు. అక్రమాలు జరిగాయని పలు రకాలుగా చెప్పిన సీబీఐ ఇప్పుడు 9 కంపెనీల్లో అవకతవకలు జరగలేదని ఎలా చెప్పిందని అడిగారు. సీబీఐ హడావుడిగా ఎందుకు మెమో ఫైల్ చేసిందని ప్రశ్నించారు. అసలు సీబీఐకి ఎవరు మెమో ఫైల్ చేయాలని సూచించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

సీబీఐ కి మెమో నమోదు చేయాలని జడ్జి ఆదేశించారా? లేక కేంద్రం చెప్పిందా? తెలపాలన్నారు. ప్రతిపక్షాలు వ్యతిరేకిస్తున్నా నేరస్తులను రక్షించేందుకు ఆర్డినెన్స్ తెచ్చిన కేంద్రం.. నేరస్తులను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. సోనియా కనుసన్నల్లో ఉండే కిరణ్ ప్రభుత్వం జగన్ విషయంలో సహకరించిన తీరే కాంగ్రెస్ వైఖరి తెలియజేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. సీబీఐ మెమోను ఫైల్ చేసిన తీరు, జగన్ కు పోలీసులు స్వాగతం పలికిన తీరు దేశంలోని ఆర్థిక నేరాలకు కేస్ స్టడీగా ఉపయోగపడే అవకాశం ఉందని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

ఈ కేసు న్యాయవాదులకు ఉపయోగపడే అవకాశం ఉందని అన్నారు. తాము జగన్ ను విమర్శించడం లేదని, సీబీఐని ప్రశ్నిస్తున్నామని అన్నారు. పదేళ్ల వ్యవధిలో వేల కోట్లు సంపాదించడం ఎలా సాధ్యమైందో సీబీఐ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. గతంలో న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నలు సీబీఐకి గుర్తు రాలేదా? అని ప్రశ్నించారు. సమాజ విశాల ప్రయోజనాలు ముఖ్యమని, అందుకే బెయిల్ ఇవ్వడం కుదరదని గతంలో న్యాయమూర్తి సముద్రాల పేర్కొన్న విషయాన్ని సీబీఐ మర్చిపోయిందా? అని నిలదీశారు.

బెయిల్ వచ్చిన రోజు రాత్రి విజయమ్మ ఏఐసీసీ ప్రతినిధి చాకోకి థాంక్స్ ఎలా చెప్పిందో గుండెలమీద చెయ్యి వేసుకుని వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చాకో మాట్లాడుతూ జగన్ బయటున్నా లోపలున్నా కాంగ్రెస్ కు మద్దతివ్వడం తప్పదని చెప్పడం దేన్ని సూచిస్తుందని సోమిరెడ్డి అడిగారు. రాహుల్ గాంధీ చేతకానివాడు, అసమర్థుడు కావడంతో.. ప్రధాని పదవి తనవల్ల కాదని అతడే అంటున్నా, భయమేస్తుందని పారిపోయినా ప్రధానిని చేసేందుకు సోనియానే స్వయంగా ప్రయత్నిస్తోందని విమర్శించారు.

పెళ్లికి, ప్రధాని పదవికి రాహుల్ అర్హుడా? కాదా? అనే దానిపై ఎన్నిసార్లు పరీక్షచేస్తారని కాంగ్రెస్ అధిష్ఠానాన్ని సోమిరెడ్డి ప్రశ్నించారు. తన భర్తను చంపించారని, కడప తడాఖా చూపిస్తామని సవాళ్లు విసిరిన వ్యక్తులు ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకుని బెయిల్ తెచ్చుకున్నారని అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే అంతు చూస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు. లంచాలు తీసుకుంటున్నోళ్లకి బయట ఘనస్వాగతాలు లభిస్తుంటే, లంచాలు ఇచ్చిన వాళ్లు జైలులో ఊచలు లెక్కబెడుతున్నారని ఆరోపించారు. నిన్నటి వరకు సునీల్ బెయిల్ అడగలేదని అలాంటి వ్యక్తి బెయిల్ కి అర్జీ పెట్టుకున్నాడని గుర్తు చేశారు.

రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిన వ్యక్తికి ఊరేగింపులు చేస్తే మిగిలిన వారు బెయిల్ కు ఎందుకు ప్రయత్నించరూ..? అని ప్రశ్నించారు. ప్రజాధనం వసూలు చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని వారే న్యాయం చెబుతారని అన్నారు. కేసీఆర్ ఆరేడు నెలల క్రితమే తామంతా ఒకటేనని చెప్పాడని అన్నారు. ముగ్గురు మూర్ఖులు ఒకటయ్యారని సోమిరెడ్డి ఆరోపించారు. కేసీఆర్ కుటుంబానికి పదవికావాలి, జగన్ కు అధికారం కావాలి, కాంగ్రెస్ కి రాహుల్ ప్రధాని అవడం కావాలి.. అందుకే ఈ ముగ్గురూ కుమ్మక్కయ్యారని సోమిరెడ్డి మండిపడ్డారు.

More Telugu News

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13
..more