అనంతపురం జిల్లాలో రాజీవ్ గాంధీ విగ్రహాల ధ్వంసం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అనంతపురం జిల్లాలో రాజీవ్ గాంధీ విగ్రహాల ధ్వంసం

విభజన తదనంతర పరిణామాల్లో భాగంగా ప్రకటించిన బంద్ రాయలసీమ జిల్లాల్లో తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. అనంతపురం జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమకారులు స్థానిక సప్తగిరి సర్కిల్ లోని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అటు మడకశిరలోనూ రాజీవ్ విగ్రహన్ని పగులకొట్టి, సోనియా దిష్టిబొమ్మ దహనం చేశారు. బీజేపీ సిటీ కార్యాలయంపై రాళ్లు రువ్వారు. జిల్లాలోని గోరంట్లలో ఎంపీ నిమ్మల కిష్టప్ప ఇంటిని ముట్టడించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రాజీనామా చేయాలని డిమాండు చేశారు.

More Telugu News