Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

విభజన వల్ల నష్టపోయేది మేమే: రాయలసీమ వాసులు

రాష్ట్ర విభజన వల్ల ఎక్కువగా నష్టపోయేది తామేనని కర్నూలు జిల్లా వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలులో సమైక్యాంధ్ర జేఏసీ నేతలు తమ ఆందోళనను మీడియా ముందు వెలిబుచ్చారు. రాయలసీమ ప్రాంత వాసుల జీవనావసరాలకు కావలిసిన సహజ వనరులు ఎక్కడివంటూ ప్రశ్నించారు. నదులన్నీ తెలంగాణ నుంచే రావాలన్నారు. ఏ ఒక్క నేతా రాయలసీమ అభివృద్ధిని పట్టించుకోలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర రాజధానిగా కర్నూలు ఉండగా.. తీసుకెళ్లి తెలంగాణ ప్రాంతంతో కలిపి, రాజధానిని హైదరాబాద్ కు తరలించారని, ఇప్పుడేమో మళ్లీ విభజించాలనుకోవడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. విభజిస్తే కర్నూలునే రాజధానిగా చేయాలని మరికొందరు డిమాండ్ చేశారు.

More Telugu News