మోటరోలా moto g54 5G ను ప్రవేశపెట్టింది: భారతదేశపు శక్తివంతమైన 5జి స్మార్ట్‎ఫోన్ కేవలం రూ. 17,499* కు అందుబాటులో ఉంది

అద్భుతమైన moto g54 5G ఇన్-బిల్ట్ 12జిబి RAM మరియు 256 జిబి స్టోరేజ్ తో వస్తున్న భారతదేశపు మొదటి ఫోన్ కేవలం రూ. 17,499* కు అందుబాటులో ఉంది. ఇది అత్యంత శక్తివంతమైన మీడియాటెక్™ డైమెన్సిటి 7020 ఆక్టో-కోర్ ప్రాసెసర్ కలిగిన భారతదేశములోనే మొట్టమొదటి స్మార్ట్̦ఫోన్ కూడా.
భారతదేశములోనే ఉత్తమ 5జి స్మార్ట్‎ఫోన్ బ్రాండ్ నుండి ఈ పరికరము 14 5జి బాండ్స్ కు సహకారము, 3 క్యారియర్ సంకలనం, మరియు VoNR కొరకు మద్ధతుతో సూపర్ ఫాస్ట్ 5జి పనితీరును పెంచుతుంది, తద్వారా అత్యంత ఆధునిక 5జి కవరేజ్ మరియు వేగాన్ని అందిస్తుంది.
ఈ పరికరము 8జిబి RAM 128జిబి స్టోరేజ్ వేరియంట్ లో కేవలం రూ. 14.499*ల ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది.
moto g54 5జి లో ఓఐఎస్ సాంకేతికతతో ఈ విభాగపు మొదటి 50ఎంపి షేక్ ఫ్రీ కెమెరా ఉంది మరియు విభాగములో ప్రముఖ భారీ 6000 mAH బ్యాటరీ కూడా ఉంది.
ఈ ఉత్పత్తి సెప్టెంబరు 13, మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్కార్ట్, Motorola.in పై మరియు ప్రముఖ రీటెయిల్ దుకాణాలలో అందుబాటులో ఉంటుంది
వినియోగదారులు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై రూ. 1,500 తక్షణ డిస్కౌంట్ ను లేదా వారి పాత పరికరము మార్పిడిపై రూ. 1,500 తగ్గింపును అందుకోవచ్చు. అంతేకాకుండా, రిలయన్స్ జియో నుండి రూ. 5,000 విలువగల అదనపు ప్రయోజనాలను కూడా అందుకోవచ్చు.
 2023 కొత్త ఢిల్లీ, సెప్టెంబరు 07 2023 – భారతదేశములోని ఉత్తమ 5జి స్మార్ట్‎ఫోన్స్ బ్రాండ్ అయిన మోటరోలా, ఈరోజు తన విభాగములో అత్యంత శక్తివంతమైన 5జి స్మార్ట్‎ఫోన్ అయిన moto g54 5జి ప్రారంభముతో 5జి స్మార్ట్‎ఫోన్ మార్కెట్ లో సంచలనం సృష్టించింది. ఈ moto g54, భారీ బిల్ట్-ఇన్ 12జిబి RAM 256జిబి 5జి స్టోరేజ్, అత్యంత శక్తివంతమైన మీడియాటెక్™ డైమెన్సిటి 7020 ఆక్టో-కోర్ ప్రాసెసర్, విభాగములో ప్రముఖ భారీ 6000 mAH బ్యాటరీని కేవలం 18,999 (రూ.17,499 ఆఫర్స్ తో) మరియు విభాగములో మొదటి 50ఎంపి షేక్ ఫ్రీ కెమెరాతో ఒక 8జిబి 128జిబ్ వేరియంట్ ను కేవలం 15,999 (రూ.14,499 ఆఫర్స్ తో) తీసుకొనివచ్చి సబ్-20కే విభాగములోని అన్ని నిబంధనలను ఛేదించింది.

moto g54 5జిలో విభాగములో అత్యంత శక్తివంతమైన మీడియాటెక్™ డైమెన్సిటి 7020 ఆక్టా-కోర్ ప్రాసెసర్ తో వస్తుంది, ఇది భారతదేశములో మొదటిసారిగా moto g54 5జిపై ప్రారంభించబడింది. ఈ అద్భుతమైన ప్రాసెసర్ గేమింగ్ మరియు మల్టీ-టాస్కింగ్ లో అల్ట్రా-ఫాస్ట్ పనితీరును అందించడమే కాకుండా, ఉత్తమ కెమెరా పనితీరు కొరకు కెమెరా ఐఎస్‎పి లు మరియు ఏఐ సామర్థ్యాలు మరియు మెరుగైన బ్యాటరీ సర్వోత్తమీకరణలతో కూడా వస్తుంది. 14 5జి బాండ్స్ మరియు 3 క్యారియర్ సంకలనము యొక్క మద్ధతుతో మరియు శక్తివంతమైన మీడియాటెక్™ డైమెన్సిటి 7020 ప్రాసెసర్ తో VoNR లతో moto g54 5జి విభాగములోనే ఉత్తమ 5జి పనితీరును అందిస్తుంది

అత్యధిక వినియోగము ఉన్నప్పటికీ కొన్ని రోజుల వరకు పవర్ తో విభాగములో ప్రముఖ భారీ 6000 mAH బ్యాటరీ ఉన్న కారణంగా ఈ పరికరము అంతరాయాలు లేని వినియోగాన్ని అనుమతిస్తుంది. టర్బోపవర్™ 33డబ్ల్యూ చార్జర్ యొక్క అత్యంత వేగముతో ఇది చాలా త్వరగా ప్రారంభం అవుతుంది, తద్వారా moto g54 5జిని కొన్ని నిమిషాలపాటు చార్జ్ చేస్తే కొన్ని గంటల వరకు పనిచేస్తూ ఉంటుంది.

moto g54 5జి లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) సాంకేతికతతో ఆధునిక 50 ఎంపి కెమెరా ఉంది, దీని వలన పూర్తిగా షేక్-ఫ్రీ వీడియోలు మరియు చిత్రాలు తీసుకోవచ్చు. ఈ విశేషత ప్రతి చిత్రాన్ని మరియు వీడియోను పదునైనదిగా, ప్రకాశవంతముగా మరియు బ్లర్ రహితంగా చేస్తుంది. అదనంగా, దీనిలో ఏ పరిస్థితిలో అయినా తక్కువ-వెలుతురులో కూడా చిత్రాలను తీయగలిగిన క్వాడ్ పిక్సెల్ సాంకేతికత ఉంది. సెకండరీ 8 ఎంపి ఆటోఫోకస్ కెమెరాలో 118° అల్ట్రా వైడ్-కోణము లెన్స్ ఉంది. ఇది ఒక ప్రామాణిక లెన్స్ కంటే 4x ఎక్కువ దృశ్యాన్ని సంగ్రహిస్తుంది. అంతేకాకుండా ఇన్స్టాగ్రాం లో విలువైన క్షణాలను అప్-క్లోజ్ మరియు ప్రొఫెషనల్ గా కనిపించే చిత్రాలను సంగ్రహించుటకు 8ఎంపి సెన్సార్ కూడా ఒక మాక్రో విజన్ మరియు డెప్త్ సెన్సార్ గా రెట్టింపు అవుతుంది. ఈ అద్భుతమైన కెమెరా సిస్టమ్, స్లో మోషన్, హైపర్-లాప్స్, ఆటో స్మైల్ క్యాప్చర్, షాట్ ఆప్టిమైజేషన్, మరియు మరెన్నో ఆధునిక సాఫ్ట్‎వేర్ విశేషతలతో వస్తుంది. ముందువైపు ఈ పరికరములో 16ఎంపి సెల్ఫీ కెమెరా ఉంది.

moto g54 5జి లో అద్భుతమైన ఎంటర్టెయిన్మెంట్ కూడా ఉంది. దీనిలోని 30 నుండి 120 Hz వరకు అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ తో 6.5” ఎఫ్‎హెచ్‎డి డిస్ప్లే కు ధన్యవాదములు. ఇది యూజర్లకు మృదువైన మరియు ఫ్లూయిడ్ వ్యూస్ తో ఇష్టమైన ఆటలను సజీవం చేస్తుంది. ఈ లీనమయ్యే వీక్షణ అనుభవము రెండు పెద్ద స్టీరియో స్పీకర్లు మరియు డాల్బి అట్మోస్® మరియు మోటో స్పేషియల్ సౌండ్, అధిక వాల్యూమ్స్ లో కూడా మెరుగైన బాస్, క్లీన్ వొకల్స్ మరియు పెంచిన స్పేషియల్ సెన్స్ లతో మెరుగుపరచబడింది. అంతేకాకుండా, యూజర్స్ కు అధిక లోతైన, స్పష్టమైన మరియు సవివరమైన సంగీత శ్రవణం, చిత్రాల వీక్షణ లేదా ఆటలు ఆడుకోవడం అయినా అందుతుంది. moto g54 5జి లో అత్యంత సన్ననైన బేజెల్స్ ఉన్నాయి, ఇవి వర్చువల్ గా హద్దులులేనివి.

moto g54 5జి సన్నగా కనిపిస్తుంది మరియు ప్రీమియం అనుభూతిని ఇస్తుంది, దీని స్టైలిష్ 3డి అక్రిలిక్ గ్లాస్ (పిఎంఎంఏ) ఫినిష్ కారణంగా పట్టుకోవటానికి గొప్పగా మరియు ఆడంబరంగా ఉంటుంది. ఈ పరికరము ప్రీమియం మరియు క్లాసీగా ఉండటమే కాకుండా, ఇందులో భారీ 6,000 mAH బ్యాటరీ ఉన్నప్పటికీ ఇది కేవలం 192 గ్రాముల బరువుతో చాలా తేలికగా ఉంటుంది. ఐపి52 రేటింగ్ తో g54 5జి నీటి-వికర్షకం కలిగి ఉంది, దీనితో ఇది ఒలికిపోవడాలు మరియు స్ప్లాష్ నుండి సురక్షితంగా ఉంటుంది.

moto g54 5జి అద్భుతమైన రంగులలో అందుబాటులో ఉంది – మిడ్‎నైట్ బ్లూ, పెరల్ బ్లూ, మరియు మింట్ గ్రీన్ రంగులు ప్రతి ఒక్కటి ప్రత్యేకమైన శైలిని సూచిస్తుంది.

సంప్రదాయాన్ని అనుసరిస్తూ, moto g54 5జి ఒక నియర్-స్టాక్ ఆండ్రాయిడ్ 13 అనుభవము మరియు మీ ఫోన్ యొక్క ప్రధాన భద్రతా మరియు ఆంతరంగిక విశేషతలను అందించే మోటో సెక్యూర్ తోపాటు బిజినెస్ గ్రేడ్ భద్రతను అందించే మొబైల్ కొరకు థింక్‎షీల్డ్ వంటి వివిధ స్టాండ్-అవుట్ అనుభవాలతో వస్తుంది. ఫోన్ పై సురక్షత ఏరియాను ఏర్పరచుటకు ఫ్యామిలీ స్పేస్ అప్లికేషన్ రూపొందించబడింది. ఇది పిల్లల శిక్షణ మరియు ఆటలకు రూపొందించబడింది. అంతేకాకుండా, మై యూఎక్స్ ద్వారా, ఒక ప్రత్యేకమైన మరియు భిన్నమైన ఆకృతిని సాధించుటకు యూజర్స్ స్మార్ట్‎ఫోన్ ను వ్యక్తిగతీకరించుకోవచ్చు. గుర్తించదగిన విశేషతలలో క్విక్ క్యాప్చర్, ఫాస్ట్ టార్చ్, స్వైప్ టు స్ప్లిట్ మరియు గేమ్‎టైమ్ లతో సహా టైమ్‎లెస్ మోటో భంగిమలు ఉన్నాయి.

ఈ స్మార్ట్‎ఫోన్ 8జిబి 12జిబి స్టోరేజ్ వేరియంట్ లో కూడా అందుబాటులో ఉంది. రెండు వేరియంట్లు ఒక మైక్రో ఎస్‎డి కార్డ్ ఉపయోగించి 1టిబి వరకు స్టోరేజ్ విస్తరణకు సహకరిస్తాయి.

ప్రారంభముపై వ్యాఖ్యానిస్తూ, శ్రీ. ప్రశాంత్ మణి, ఎక్సిక్యూటివ్ డైరెక్టర్ – మోటరోలా ఆసియా పసిఫిక్, ఇలా అన్నారు, "moto g54 5జి భారతీయ వినియోగదారులకు అత్యంత సాంకేతికతను డెమొక్రటైజ్ చేయాలనే మా స్వప్నానికి కట్టుబడి ఉంటూ అత్యంత డిస్రప్టివ్ ప్రైజ్ పాయింట్స్ వద్ద ఆధునిక 5జి పరికరాలను అందించాలనే మా అంకితభావానికి ఒక వాస్తవ రూపం. moto g54 5జి భారతీయ మార్కెట్ కొరకు ప్రత్యేకంగా రూపొందించబడిన ఉత్పత్తి మరియు ఈ విభాగములో ఉత్తమ పనితీరు, 5జి కనెక్టివిటి, కెమెరా మరియు వినోదాల అనుభవము మరియు స్టైలిష్ రూపముతో అత్యంత ఆధునిక సాఫ్ట్‎వేర్ విశేషతలతో నింపబడింది. ఈ ప్రారంభముతో, మేము ఈరోజు భారతీయ మార్కెట్ లో ఉన్న అన్నిటిని దాటి ముందు వెళ్తాము మరియు ఇదివరకెన్నడు లేని విధంగా అందరు ఆవిష్కరించుటకు, కనె0క్ట్ అయ్యేందుకు మరియు అభివృద్ధి చెందుటకు అధికారమిస్తుంది.”

 

అందుబాటు:

moto g54 5జి మూడు అందమైన రంగులలో అందుబాటులో ఉంది: మింట్ గ్రీన్, పెరల్ బ్లూ మరియు మిడ్‎నైట్ బ్లూ. వీటిని 3డి అక్రిలిక్ గ్లాస్ (పిఎంఎంఏ) ఫినిష్ ఉంటుంది. ఇది బిల్ట్-ఇన్ 12 జిబి RAM 256 జిబి స్టోరేజ్ తో వస్తుంది మరియు 8జిబి RAM 128జిబి స్టోరేజ్ ఐచ్ఛికములో కూడా అందుబాటులో ఉంది.

 

moto g54 5జి సెప్టెంబరు 13, మధ్యాహ్నం 12 గంటల నుండి ఫ్లిప్కార్ట్, Motorola.in మరియు అన్ని ప్రముఖ రీటెయిల్ దుకాణాలలో అందుబాటులో ఉంటుంది.

 

ధర & ప్రారంభ ఆఫర్లు:

12జిబి 256జిబి వేరియంట్: ప్రారంభ ధర: రూ. 18,999

ప్రభావవంతమైన ధర: రూ. 17,499 బ్యాంక్ లేదా మార్పిడి ఆఫర్లతో సహా

 

8జిబి 128జిబి వేరియంట్: ప్రారంభ ధర: రూ. 15,999

ప్రభావవంతమైన ధర: రూ. 14,499 బ్యాంక్ లేదా మార్పిడి ఆఫర్లతో సహా

 
సరసమైన ఆఫర్లు:


-          ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ పై ఫ్లాట్ రూ. 1500 తక్షణ డిస్కౌంట్

-          లేదా

-          ఫ్లిప్కార్ట్ పై పాత పరికరము మార్పిడిపై రూ. 1500 అదనపు విలువ

 

ఆఫర్లతో సహా ప్రభావవంతమైన ధర:

రూ. 17,499 (12జిబి 256జిబి వేరియంట్)

రూ. 14,499(8జిబి 128జిబి వేరియంట్)

More Press News