'గుమ్మడి నర్సయ్య' పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక పాట విడుదల

Entertainment
Advertisement
బయోపిక్ సినిమాలు అనేవి ఆడియెన్స్‌లో ఎప్పుడూ ఆసక్తిని రేపుతుంటాయి. ఉన్నది ఉన్నట్టుగా తీశారా? ఏమైనా అదనంగా చూపిస్తున్నారా? అసలు వాస్తవాలు బయటకు చూపిస్తారా? అనే ఆలోచనలతో జనాలు ఆ బయోపిక్ సినిమాలను చూస్తుంటారు. అవినీతి మచ్చలేని రాజకీయ నాయకుడు, పేదల పాలిట పెన్నిది అయిన గుమ్మడి నర్సయ్య బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది వరకే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్లు అందరినీ ఆకట్టుకున్నాయి.

ప్రజల కోసం ప్రజల కొరకే నా జీవితం అంటూ ముందుకు సాగిన గుమ్మడి నర్సయ్య బయోపిక్ భావితరాలకు స్పూర్తిదాయకంగా నిలిచేలా తెరకెక్కిస్తున్నారు. గుమ్మడి నర్సయ్య అనే సినిమాకు సంబంధించిన అప్డేట్ ఒకటి ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. గుమ్మడి నర్సయ్య పుట్టిన రోజు సందర్భంగా ఓ పాటను రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్లు ప్రకటించారు. 

ఈ మేరకు దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలె మాట్లాడుతూ.. 'ఈరోజు శ్రీ గుమ్మడి నర్సయ్య గారి పుట్టిన రోజును పురస్కరించుకుని ఒక ప్రమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశాం. ప్రేక్షక మహాశయులు అందరూ చూసి మా చిత్రాన్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాం. బయోపిక్ కావడంతో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చాలా శ్రద్దగా, నిదానంగా సినిమాను తీస్తున్నాం. ఇకపై సినిమాకు సంబంధించిన అప్డేట్లను రెగ్యులర్‌గా ఇస్తామ'ని తెలిపారు.

చరణ్ అర్జున్ అందించిన బాణీ, పాడిన తీరు పాటను వినసొంపుగా మార్చింది. గుమ్మడి నర్సయ్య వ్యక్తిత్వం, మంచితనం, గొప్పదనం తెలిసేలా రాసిన పాట శ్రోతలను కదిలించేలా ఉంది. ఈ పాటతో సినిమా మీద మంచి బజ్ ఏర్పడేలా ఉంది. ఈ పాట త్వరలోనే అందరి నోట వినిపించేలా కనిపిస్తోంది.


సాంకేతిక బృందం
బ్యానర్‌ : డార్క్ టు లైట్ క్రియేటర్స్
కథ, కథనం, దర్శకత్వం : పరమేశ్వర్ హివ్రాలే
సంగీతం : చరణ్ అర్జున్
సినిమాటోగ్రఫీ : అఖిల్ వల్లూరి
ఎడిటింగ్‌ : సత్య గిడుతూరి  

Advertisement
Gummadi Narsaiah

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News