శ్రీరామ్ చంద్ర హోస్ట్ గా ‘ఆహా’ వారి స‌రికొత్త బిజినెస్ రియాలిటీ షో ‘నేను సూపర్ ఉమెన్’

Entertainment
Advertisement

జూన్ 27, హైద‌రాబాద్: ఇండియాలో నెంబ‌ర్ వ‌న్ లోకల్ ఓటీటీ మాధ్య‌మం ఆహా ఇప్పుడు మ‌రో సంచ‌ల‌నానికి సిద్ధ‌మైంది. స్త్రీ సాధికార‌త‌కు పెద్ద పీట వేస్తూ మ‌హిళ‌ల‌ను వ్యాపార రంగంలోనూ దూసుకెళ్లేలా చేయ‌టానికి బిజినెస్ రియాలిటీ షోను ప్రారంభించింది... అదే ‘నేను సూప‌ర్ ఉమెన్‌’. కొత్త ప‌రిశ్ర‌మ‌ల‌ను స్థాపించేలా మహిళలను ప్రేరేపించ‌ట‌మే ఈ రియాలిటీ షో ప్ర‌ధాన లక్ష్యం. దీని కార‌ణంగా పారిశ్రామిక రంగంలో మ‌హిళ‌ల ప్రాదాన్య‌త పెర‌గ‌టంతో పాటు వారిలో ఆర్థిక స్వాతంత్య్ర భావనను పెంపొందుతుంది.

 
‘నేను సూపర్ ఉమెన్’ ప్రోగ్రామ్ సాంప్రదాయ మార్గాల్లో కాకుండా వినూత్న మార్గాలను సూచిస్తూ, మహిళలకు మార్గదర్శకం చేస్తూ వారికి ప్రత్యక్ష అనుభ‌వం ఏర్ప‌డేలా చ‌ర్య‌లు తీసుకుంటుంది. శ్రీరామ్ చంద్ర హోస్ట్ చేస్తోన్న ఈ కార్య‌క్ర‌మంలో ఏజెంల్స్ అనే ప్యానెల్‌ ఉంటుంది. ఇందులో పాల్గొనే ఔత్సాహిక మ‌హిళా వ్యాపారులు వారి ఆలోచ‌న‌ల‌ను ఈ ఏజెంల్స్ కు తెలియ‌చేయ‌వ‌చ్చు. అలాగే కంటెస్టెంట్స్‌కు శ్రీరామ చంద్ర తగిన రీతిలో మార్గ‌ద‌ర్శ‌క‌త్వం చేయ‌టం ద్వారా ఈ షో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటుందన‌టంలో సందేహం లేదు. క‌ఠిన‌మైన ఎంపిక త‌ర్వాత 40 మంది అసాధార‌ణ అభ్య‌ర్థులు ఈ ‘సూపర్ ఉమెన్’కు ఎంపిక‌య్యారు. వీరంద‌రూ ఏంజెల్స్ ప్యాస‌మ‌క్షంలో త‌మ ఆలోచ‌న‌ల‌ను ముఖాముఖిగా ప్ర‌ద‌ర్శిస్తారు. ప్ర‌తి ఆలోచ‌న చాలా జాగ్ర‌త్త‌గా మూల్యాంక‌నం చేయ‌బ‌డుతుంది. తుది ప్ర‌ద‌ర్శ‌న త‌ర్వాత ప్యానెల్ ఆఫ‌ర్స్‌ను పొడిగిస్తుంది.

 ఈ ఏంజెల్స్ వారి వారి రంగాల్లో త‌మ‌దైన గుర్తింపును వారు సంపాదించుకున్నారు. రోహిత్ చెన్న‌మ‌నేని (డార్విన్ బాక్స్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు), శ్రీధ‌ర్ గాది (క్వాంటెలా ఇన్క్ యొక్క వ్య‌వ‌స్థాప‌కుడు మ‌రియు ఎగ్జిక్యూటివ్ చైర్మ‌న్‌), రేణుకా బొడ్లా (సిల్వ‌ర్ నీడెల్ వెంచ‌ర్స్ భాగ‌స్వామి), సుధాక‌ర్ రెడ్డి (అభి బ‌స్ వ్య‌వ‌స్థాప‌కుడు, సీఇఓ), దొడ్ల దీపా రెడ్డి (దొడ్ల డెయిరీ), సింధూర పొంగూరు (నారాయ‌ణ గ్రూప్‌). వీరంద‌రూ త‌మ రంగాల్లో ఎంతో నైపుణ్యం సాధించిన నిష్ణాతులు. వ్యాపారాల్లో పెట్టుబ‌డులు పెట్ట‌టానికి, విభిన్న నేప‌థ్యాలున్న మ‌హిళ‌ల‌ను పారిశ్రామిక వేత్త‌లుగా ప్రోత్స‌హించ‌టానికి సిద్ధంగా ఉన్నారు).
 

ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ‘నేను సూపర్ ఉమెన్’ షో ఆహాలో ప్రారంభం కావటానికి సిద్ధంగా ఉంది. మహిళలు వ్యాపార రంగంలో రాణించటానికి ఇదొక కొత్త శకానికి నాంది పలుకుతుంది. ఫలితంగా ఎంతో మంది వారి కలలను సాధించుకునే దిశగా అడుగులు వేయబోతున్నారు.
Advertisement
Nenu Super WomanSreeram Chandra

More Press News

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28

పూజా హెగ్డే, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి, వి.వి. వినాయక్‌లతో జీ తెలుగు వీకెండ్ సందడి!

30 Oct, 14:34
..More Press News