అమితాబ్ బచ్చన్ నటించిన మెడిబడ్డీస్ కొత్త బ్రాండ్ ప్రచారము కేవలం 10 నిమిషాలలో వైద్య నిపుణులతో వీడియో సంప్రదింపుల సౌకర్యాన్ని చూపిస్తుంది

Entertainment
Advertisement

27th జూన్ 2023: భారతదేశపు ప్రముఖ డిజిటల్ ఆరోగ్య సంరక్షణ వేదిక, మెడిబడ్డీ, ఆన్లైన్ వీడియో వైద్య సంప్రదింపులను అందించడం ద్వారా భారతీయ ఆరోగ్యసంరక్షణ రంగములో ఎప్పటికప్పుడు విప్లవాన్ని తీసుకొస్తోంది. బిలియన్ల భారతీయులకు అత్యధిక-నాణ్యత ఉన్న ఆరోగ్య సంరక్షణను అందుబాటులోకి తీసుకొనిరావడం మెడిబడ్డీ వారి స్వప్నము. ఈ వేదిక 10 నిమిషాలలో,  24X7, ఏడాదికి 365 రోజులూ ఒక వైద్య నిపుణుడితో ఆన్లైన్ వీడియో సంప్రదింపును అందించే హామీని ఇస్తుంది.

 
ఈ ప్రచారము శ్రీ. అమితాబ్ బచ్చన్ నటించిన బ్రాండ్ చిత్రాల సీరీస్ ను ప్రారంభించడము ద్వారా ఆరోగ్యకరమైన భారతదేశాన్ని సృష్టించడముపై దృష్టి కేంద్రీకరిస్తుంది. ఈరోజులలో, అందరు ఆరోగ్య-చేతన జీవనశైలిని అవలంబించే దిశగా ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే, ప్రజలు అనారోగ్యం పాలైతే, వైద్య నిపుణుల సలహాలను తీసుకోవడములోని ప్రాముఖ్యతను ఉపేక్షిస్తున్నారు. దీనికి కారణం వారు తామే స్వయంగా-చికిత్స తీసుకోగలము అని అనుకోవడం లేదా అయాచిత సలహాను అంగీకరించడం కారణం కావచ్చు. ఒక వైద్య నిపుణుడితో ఆన్లైన్ వీడియో సంప్రదింపును తమ ఇంటి నుంచి లేదా ఎక్కడి నుంచైనా 10 నిమిషాలలో అండుకొవచ్చుననే అవగాహన కల్పిస్తూ ఈ ప్రస్తుత పరిస్థితిని మార్చడం మెడీబడ్డీ యొక్క లక్ష్యము.

 
ప్రచారము గురించి మాట్లాడుతూ, శ్రీ. సతీష్ కన్నన్, సహ-వ్యవస్థాపకుడు & సీఈఓ, మెడీబడ్డీ, ఇలా అన్నారు, “బిలియన్ భారతీయులకు అత్యధిక-నాణ్యత కలిగిన ఆరోగ్య సంరక్షణను అందించుట మా ఉద్దేశము. మేము నిరంతరంగా పట్టణ మరియు గ్రామీణ ఆరోగ్య సంరక్షణ దూరాలను పూరించుటకు సాంకేతికతలో పెట్టుబడి పెడతాము. మా వేదిక తోటి భారతీయులకు 10 నిమిషాలలో ఒక వైద్యుడిని సంప్రదించే సౌకర్యాన్ని అందిస్తుంది మరియు వైద్య నిపుణులు మరియు ఆరోగ్యసంరక్షణ సేవలకు ప్రాప్యతను నిర్ధారిస్తుంది . ఇది తెలిసిన నిర్ణయాలు తీసుకోవడములో వారికి సహాయం చేస్తుంది, తద్వారా ఒక ఆరోగ్యకరమైన సంఘానికి దారితీస్తుంది. ఆన్లైన్ వీడియో వైద్యుల సంప్రదింపుల సౌకర్యము మరియు ప్రాప్యత గురించి అవగాహన కలిగించే సందేశము ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు తీసుకొస్తుందని మరియు ఆరోగ్యకరమైన ఎంపికలు చేసుకోవడములో సహకరిస్తుందని మేము విశ్వసిస్తున్నాము.”
 

శ్రీ. సైబాల్ బిశ్వాస్, హెడ్ ఆఫ్ మార్కెటింగ్, భాగస్వామ్యాలు & పిఆర్, మెడీబడ్డీ, ఇలా అన్నారు, “వైద్య నిపుణుల నుండి సూచనలను తీసుకోవడములో ప్రజలు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటారు లేదా వాయిదా వేస్తారు అనే వాస్తవముపై కొత్త బ్రాండ్ ప్రచారము ఆధారపడింది. ఇది యథాతధ స్థితిని అంగీకరించడములోని సవాళ్ళ స్థానములో ఆన్లైన్ వీడియో వైద్య సంప్రదింపును ఎంపిక గుర్తుకు వచ్చేలా చేయడం దీని లక్ష్యము. వైద్య నిపుణుల సంప్రదింపును పొందడం బ్యాంకింగ్, షాపింగ్ మరియు ఆహారం డెలివరీల వంటి రోజువారి ఆన్లైన్ పనుల మాదిరిగా సౌకర్యవంతమైనది అని ఇది ఉద్ఘాటిస్తుంది. ప్రకటన చిత్రాలలో శ్రీ. బచ్చన్ నటించడం, తమ ఆరోగ్యసంరక్షణ ప్రయాణములో యూజర్లకు సహకరించుటకు ఒక నిపుణుడైన సంరక్షకుడిగా మెడీబడ్డీ యొక్క స్థానాన్ని తెలుపుతుంది. ప్రకటనలలో, శ్రీ. బచ్చన్ మొబైల్ ఫోన్ నుండి ఆశ్చర్యకరంగా ఒక కొత్త వేషధారణలో బయటికి వస్తారు, ఒక బడ్డీలాగా మరియు ఒక మెడెబడ్డీ యాప్ యొక్క సజీవ మానవీకరణగా కనిపిస్తారు.”

 
మెడిబడ్డీ యొక్క సేవలు 16 భాషలలో అందుబాటులో ఉన్నాయి, దీనితో ఇవి విభిన్న ప్రాంతాలు మరియు భాషల నేపథ్యాల నుండి ప్రజలకు అందుబాటులొ ఉంటాయి. అంతేకాకుండా, 22 స్పెషాలిటీలలో అందుబాటులో ఉంటూ, మెడీబడ్డీ అనేక వైద్య అవసరాలను చూసుకుంటుంది, తద్వారా నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను బిలియన్ల భారతీయులకు అందుబాటులోకి తీసుకొని వస్తుంది.
 

ప్రచార వివరాలు:
 

మెడీబడ్డీ యొక్క కొత్త బ్రాండ్ ప్రచారములో మొత్తం 27 ప్రకటనలు ఉన్నాయి, వీటిల్లో శ్రీ. అమితాబ్ బచ్చన్ నటించిన అయిదు ప్రధాన ప్రకటన చిత్రాలు, చలన చిత్రాలు మరియు టెస్టిమోనియల్స్ ఉన్నాయి. ఈ ప్రభావవంతమైన బ్రాండ్ ప్రచారము ఐటిడబ్ల్యూ ప్లేవర్క్స్ సహకారముతో మెడీబడ్డీలోని అంతర్గత బృందము ద్వారా రూపొందించబడింది. ఈ ప్రచారము టెన్ ఫిల్మ్స్ ద్వారా నిర్మించబడింది మరియు శ్వేతాబ్ వర్మచే దర్శకత్వం వహించబడింది. అయిదు ప్రధాన ప్రకటన చిత్రాల నిడివి 45 నుండి 60 క్షణాల వరకు ఉంటుంది. ప్రచారాన్ని ప్రారంభించుటకు, ఇది అనేక డిజిటల్ ప్లాట్ఫార్మ్స్ లో ప్రారంభించబడింది. 

Advertisement
MediBuddyAmitabh Bachchan

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News