అమెజాన్‌ ప్రైమ్‌లో ఆకట్టుకుంటోన్న యాక్షన్ పీరియడ్ డ్రామా 'పులి-19వ శతాబ్దం'

Entertainment
Advertisement
ఈ మధ్యే థియేటర్లో రిలీజ్ ఐన భారీ బడ్జెట్ సినిమా 'పులి-19వ శతాబ్దం' శనివారం రాత్రి నుంచి అమెజాన్ ప్రైమ్‌లో తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమాకు విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌ హైలెట్‌గా నిలిచాయి. 2022  లో మలయాళంలో వచ్చిన 'పథోంపథం నూట్టండు' యాక్షన్ పీరియడ్ డ్రామా ఇప్పుడు 'పులి-19వ శతాబ్దం' పేరుతో తెలుగు డబ్ అయింది.

సిజు విల్సన్ ఓ యోధుడు. కత్తిని తిప్పడంలో నేర్పరి. 19వ శతాబ్దంలో ట్రావెన్‌కోర్‌కు సంబంధించిన కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. అనంతపద్మనాభ స్వామి దేవాలయంలో జరిగే దొంగతనం, ఆ దొంగను పట్టుకునే పాయింట్‌తో ఈ సినిమా నడుస్తుంది. ఈ క్రమంలో చూపించే విజువల్స్, స్టన్నింగ్ యాక్షన్ సీక్వెన్స్‌ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటాయి. 

2022లో మలయాళం లో విడుదలైనప్పుడు ఈ సినిమాకు పాజిటివ్ రివ్యూలు, 4 స్టార్ రేటింగ్‌లు వచ్చాయి. విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్‌ గురించి విమర్శకులు ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. అద్భుతమని కొనియాడారు. ఈ సినిమాలో నాటి పరిస్థితులు, అంటరానితనం ఎలా ఉండేదో కూడా చూపించారు. వినయన్ దర్శకత్వానికి మంచి మార్కులు పడ్డాయి. నాని దసరా, ప్రభాస్ ప్రాజెక్ట్ కే, వెంకటేష్ సైంధవ్ సినిమాలతో టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయిన సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించారు.

షాజి కుమార్ సినిమాటోగ్రఫీ, అజయన్ చల్లస్సెరీ వేసిన సెట్స్ అద్భుతమనిపించాయి. ధన్యా భాలకృష్ణన్ కాస్ట్యూమ్స్, వివేక్ హర్షన్ ఎడిటింగ్‌కు కూడా ప్రశంసలు దక్కాయి. ఇప్పుడు తెలుగులోనూ ఈ సినిమాకు  మంచి రెస్పాన్స్ వస్తోంది. విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటుగా ప్రేక్షకులను సైతం ఈ చిత్రం ఆకట్టుకుంటోంది.
Advertisement
PuliPuli The 19th CenturyAmazon PrimeTelugu Movies

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News