కూకట్‌పల్లి, హైదరాబాద్‌ వద్ద తమ అత్యాధునిక మ్యూజిక్‌ అకాడమీని ప్రారంభించిన మ్యూజిగల్‌ సంగీత అకాడమీ

Entertainment
Advertisement
వ్యవస్థీకృత సంగీత పరిశ్రమలో సుప్రసిద్ధ సంస్థగా తమను తాము నిలుపుకునేందుకు ప్రయత్నాలను కొనసాగిస్తున్న మ్యూజిగల్‌, తమ చేరికను మరింతగా విస్తరించడంతో పాటుగా గణనీయమైన  ప్రభావాన్ని చూపుతుంది

హైదరాబాద్‌, 25 మార్చి 2023 : భారతదేశపు అతిపెద్ద మ్యూజిక్‌ ఎడ్యుకేషన్‌ ప్లాట్‌ఫామ్‌, మ్యూజిగల్‌ తమ మూడవ అత్యాధునిక సంగీత అకాడమీని  హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో ప్రారంభించింది. కూకట్‌పల్లి (హైదరాబాద్‌)లో ఉన్న అకాడమీ దాదాపు 2వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండటంతో పాటుగా సాటిలేని సౌకర్యాలు కలిగి ఉంది. ఇది గాత్రం మరియు వాయిద్యంతో సహా సంగీతం నేర్చుకోవడానికి అత్యంత అనుకూలమైనది.

దాదాపు 500 మంది విద్యార్థులకు పలు బ్యాచ్‌లుగా బోధన చేసే సౌకర్యాలు కలిగిన కూకట్‌పల్లిలోని  ఈ  మ్యూజిక్‌ అకాడమీలో  పియానో, కీబోర్డ్‌, గిటార్‌, డ్రమ్స్‌, కర్నాటిక్‌ వోకల్స్‌, హిందుస్తానీ వోకల్స్‌ ,  వెస్ట్రన్‌ వోకల్స్‌ లో బోధన చేస్తారు. ఈ మ్యూజిక్‌ అకాడమీ ప్రారంభం తరువాత, తొలి నెలరోజులూ ఉచితంగా సంగీత విద్యను చేరిన ప్రతి ఒక్కరికీ అందిస్తారు.

సంగీత అభ్యాసంలో సమగ్రమైన కార్యాచరణ  అందించడం ద్వారా మరియు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ రూపాలలో  బోధనతో   సంగీత విద్యలో అత్యున్నత ప్రమాణాలను మ్యూజిగల్‌ యొక్క అత్యాధునిక అకాడమీ  ఏర్పరిచింది. ఇదే కేంద్రంలో సంగీత  పరికరాలను సైతం విక్రయాలకు అందుబాటులో ఉంచారు.

కూకట్‌పల్లిలో మ్యూజిగల్‌ అకాడమీ ప్రారంభం గురించి మ్యూజిగల్‌ యొక్క  ఫౌండర్‌ డాక్టర్‌ లక్ష్మీనారాయణ ఏలూరి మాట్లాడుతూ ‘‘ సంగీత విద్యను అందరికీ చేరువ చేయాలనే మహోన్నత లక్ష్యంతో మ్యూజిగల్‌ అకాడమీ తీర్చిదిద్దాము. అభ్యాసకులకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కేంద్రాన్ని  తమకు దగ్గరలో అందిస్తుంది. సంగీతంలో అత్యుత్తమ అభ్యాసం మరియు బోధన అనుభవాలను ఈ కేంద్రం అందించనుంది. భారతీయ శాస్త్రీయ మరియు పాశ్చాత్య సంగీతంలో విస్తృత శ్రేణి కోర్సులను ఇది అందిస్తుంది. ఈ కోర్సులను నిష్ణాతులైన సంగీత అధ్యాపకులు బోధించనున్నారు. వీటితో పాటుగా,  అభ్యాసకులను లక్ష్యంగా చేసుకుని ఓ నిర్మాణాత్మక కరిక్యులమ్‌ (బోధనాంశాలు), పీరియాడిక్‌ ఎస్సెస్‌మెంట్స్‌, సర్టిఫికేషన్‌, సౌకర్యవంతమైన ఫీజు చెల్లింపు ప్లాన్స్‌, సుశిక్షితులైన  అధ్యాపకులను అందుబాటులో ఉంచాము’’ అని అన్నారు.

భారతదేశంతో పాటుగా యుఎస్‌ఏ, యుకె, ఆస్ట్రేలియా, యుఏఈలలో 10వేల మంది విద్యార్ధులకు 400కు పైగా సుశిక్షితులైన సంగీత టీచర్లు మద్దతు అందిస్తున్నారు. ఇప్పటికే 40వేల తరగతులు విజయవంతంగా పూర్తయ్యాయి. మ్యూజిగల్‌ , అంతర్జాతీయంగా సంగీతాభిమానులైన  అంటే వారు హాబీగా సంగీతం నేర్చుకుంటున్నా  లేదా ట్రినిటీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌ కోసం తీవ్రంగా శ్రమించే వారైనా , విద్యార్థుల కోరికలను తీరుస్తుంది.

భారతదేశంలో సంప్రదాయ సంగీత ఇనిస్టిట్యూషన్స్‌ అత్యధిక శాతం మామ్‌–అండ్‌  – పాప్‌ షాప్స్‌,  హోమ్‌ ట్యూషన్స్‌ లేదా  భారీ బొటిక్‌ ఇనిస్టిట్యూషన్స్‌గా ఉంటున్నాయి. ఇవి కొన్ని ప్రాంతాలకు పరిమితం కావడం లేదా  అనుభవజ్ఞులైన సంగీత అభ్యాసకులకు పరిమితమై ఉంటాయి. మ్యూజిగల్స్‌ అకాడమీ అత్యాధునిక మౌలిక సదుపాయాలు, విస్తృత శ్రేణిలో సంగీత కోర్సులు, అంకితం చేయబడిన సిబ్బంది, సుశిక్షితులైన  టీచర్లు మరియు షాప్‌ –ఫ్రంట్‌ తో చుట్టుపక్కల సంగీత అకాడమీలను సంపూర్ణం చేయడం మరియు పునర్నిర్మించడం చేస్తుంది. అన్ని వయసులు, వర్గాల  అభ్యాసకులను మ్యూజిగల్‌ ఆహ్వానిస్తోంది.

సంగీత అభ్యాసకుల అవసరాలను తీర్చడానికి మ్యూజిగల్‌ తన ఆన్‌లైన్‌ ఉనికి, ఆఫ్‌లైన్‌ అకాడమీ మరియు నిపుణులైన  బోధకులపై ఆధారపడి  సంగీత విద్యలో సమగ్రమైన విధానాన్ని అందిస్తుంది. ఈ విధానం, విద్యార్థులు వారి సంగీత ఆకాంక్షలను సాధించడానికి అవసరమైన వనరులు మరియు మార్గదర్శకాలను కలిగి ఉండేలా నిర్ధారిస్తుంది.

కూకట్‌పల్లి మ్యూజిగల్‌  అకాడమీ చిరునామా : భగవాన్‌ ప్లాజా, రెండవ అంతస్ధు, మాంటిస్సోరీ హై స్కూల్‌ ఎదురుగా, విజయ్‌ నగర్‌ కాలనీ, కూకట్‌పల్లి, హైదరాబాద్‌– 500072
Advertisement
మ్యూజిగల్‌ సంగీత అకాడమీకూకట్‌పల్లి

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News