న్యూ ఇయ‌ర్ ట్రీట్‌..వీరాభిమానులు, ఆడియెన్స్ కోసం ప్ర‌భాస్ బాహుబ‌లి ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా అందిస్తోన్న ఆహా

Entertainment
Advertisement
- అన్‌స్టాప‌బుల్ 2 విత్ ఎన్‌బీకే - ది బిగినింగ్ డిసెంబ‌ర్ 30న, అన్‌స్టాప‌బుల్ 2 విత్ ఎన్‌బీకే  - క‌న్‌క్లూజ‌న్ జ‌న‌వ‌రి 6న ప్ర‌సారం కానుంది -
 
ఇండియ‌న్ సినీ ఇండ‌స్ట్రీలో పాన్ ఇండియా స్టార్‌గా త‌న‌దైన గుర్తింపు సంపాదించుకున్న స్టార్ ప్ర‌భాస్‌. త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో, గ్రేస్‌తో ప్రేక్ష‌కుల హృద‌యాల్లో చెర‌గ‌ని స్థానాన్ని సంపాదించుకున్నారాయ‌న‌. ఈ పాన్ ఇండియా స్టార్ రీసెంట్‌గా తెలుగు ఓటీటీ మాధ్య‌మంలో నట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ హోస్ట్ చేస్తోన్న‌ పాపుల‌ర్ టాక్ షో అన్‌స్టాప‌బుల్‌లో పార్టిసిపేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో కూడా విడుద‌లైంది. దీంతో ప్ర‌భాస్ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించారు. ఇటు నంద‌మూరి బాల‌కృష్ణ అటు ప్ర‌భాస్‌, గోపీచంద్‌ల ఫ్యాన్స్ ప‌ర్‌ఫెక్ట్ విందు భోజ‌నంలాంటి ఎపిసోడ్‌ను ఆహా సిద్ధం చేసింది. ఇంత గొప్ప ఎపిసోడ్‌ను ఎడిట చేయ‌టానికి చాలా క‌ష్ట‌ప‌డుతుంది. ఎందుకంటే ఇందులో ప్ర‌తి క్ష‌ణం ఎంతో విలువైన‌దే. దాన్ని ప్ర‌తీ ఒక్క‌రూ ఆస్వాదించాలి. దీంతో ఆహా.. ఈ బాహుబ‌లి ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా ప్రేక్ష‌కుల‌కు అందించాల‌ని నిర్ణ‌యించుకుంది. ఇది అభిమానులకు సంతోష‌క‌ర‌మైన విష‌య‌మే. అవును నిజమే 100 నిమిషాల బాహుబలి ఎపిసోడ్‌ని బాహుబలి - అన్‌స్టాప‌బుల్ 2 విత్ ఎన్‌బీకే 1 ది బిగినింగ్ డిసెంబ‌ర్ 30న కొత్త సంవత్సరాది ట్రీట్‌గా ప్ర‌సారం కానుంది.  అలాగే బాహుబలి అన్‌స్టాప‌బుల్ 2 విత్ ఎన్‌బీకే 1 క‌న్‌క్లూజ‌న్  జ‌న‌వ‌రి 6న ప్ర‌సారం కానుంది. 
 
అన్‌స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే హిస్ట‌రీలో ఓ ఎపిసోడ్‌ను రెండు ఎపిసోడ్స్‌గా అందించ‌టం ఇదే మొద‌టిసారి. డిసెంబ‌ర్ 30న ప్ర‌సారం కాబోయే తొలి ఎపిసోడ్‌లో నంద‌మూరి బాల‌కృష్ణ‌, ప్ర‌భాస్ మ‌ధ్య జ‌రిగే సంభాష‌ణ ప్రేక్ష‌కుల‌కు కావాల్సినంత వినోదాన్ని అందిస్తుంది. ఇది ఆహాలో మాత్ర‌మే ఎక్స్‌క్లూజివ్‌గా కొత్త సంవ‌త్స‌రం ట్రీట్‌గా రానుంది. ఇక డిసెంబ‌ర్ 6న ప్ర‌సారం కాబోయే రెండో ఎపిసోడ్‌లో ప్ర‌భాస్‌, ఆయ‌న బెస్ట్ ఫ్రెండ్ హీరో గోపీచంద్, నంద‌మూరి బాల‌కృష్ణ మ‌ధ్య ఆస‌క్తిక‌రంగా సాగ‌నుంది. ఇందులో ప్ర‌భాస్‌, గోపీచంద్ కెరీర్ ఇండ‌స్ట్రీలో ఎలా ప్రారంభ‌మైంది. వారి స్నేహం ఎలా ప్రారంభ‌మైంది..ఇన్నేళ్ల‌లో ఎలా బ‌ల‌ప‌డింది అనే విష‌యాలుంటాయి.
 
‘‘మాకు అభిమానుల నుంచి లెక్కలేనని మెసేజెస్ వచ్చాయి. ఈ  ఎపిసోడ్‌ను ఎలాంటి ఎడిటింగ్ లేకుండా ప్రసారం చేయాల‌ని వారు కోరారు. అలాగే ఆహా, ప్ర‌భాస్ ఎపిసోడ్ ఫైన‌ల్ ఔట్‌పుట్ విష‌యంలో చాలా హ్యాపీగా ఉన్నారు. దీంతో ప్ర‌భాస్‌, నంద‌మూరి బాల‌కృష్ణ, ఆహా టీమ్ అంత‌ర్గ‌తంగా చ‌ర్చించుకున్న త‌ర్వాత రెండు భాగాలుగా ఈ ఎపిసోడ్‌ను అందించాల‌ని నిర్ణ‌యించుకున్నాం. న్యూ ఇయ‌ర్‌ను నంద‌మూరి బాల‌కృష్ణ‌, ప్ర‌భాస్ కాంబినేష‌న్‌తో ఆహాలో రాబోతున్న ఈ టాక్ షో ఎపిసోడ్ కంటే గొప్ప‌గా సెల‌బ్రేట్ చేసుకోవ‌టానికి ఏముంటుంది. ఎవ‌రూ ఊహించ‌లేని కొత్త విష‌యాలు, అంత‌కు మించిన ఫ‌న్ డిసెంబ‌ర్ 30, జ‌న‌వ‌రి 6న ఆహా ద్వారా స్క్రీన్స్‌ను ఢీ కొట్ట‌నుంది’’ అని ఆహా టీమ్ తెలియజేసింది. 
 
ఈ బాహుబ‌లి ఎపిసోడ్‌లో ఓ చిన్న ఫ‌న్ గేమ్ ఉంది. తొలి ఎపిసోడ్‌లో బాల‌కృష్ణ‌.. ప్ర‌భాస్ సీత‌తో ఉన్న రిలేష‌న్ గురించి ప్ర‌శ్నించారు. దానికి ఆయ‌న ఏమ‌ని బ‌దులిచ్చారు. ప్రేక్ష‌కులకు ఇప్ప‌టి వ‌ర‌కు తెలియ‌ని విష‌యాలు ఏం తెలియ‌సాయ‌నేది ఆస‌క్తిక‌ర‌మైన కొన‌సాగిపుంగా ఉంటుంది.
 
అన్‌స్టాప‌బుల్ 2 విత్ ఎన్‌బీకే లో బాహుబ‌లి ప్ర‌భాస్ ఎపిసోడ్స్ కోసం ఆహాను ట్యూన్ చేయండి
Advertisement
ఆహాప్ర‌భాస్అన్‌స్టాప‌బుల్ 2 విత్ ఎన్‌బీకే

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News