ఆహ తెలుగు స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడిని 'కామెడీ స్టాక్‌ ఎక్సేంజ్‌' షో ద్వారా ఓటిటి లో లాంచ్ చేయబోతున్నారు

Entertainment
Advertisement
 
''అరే.. స్టాక్స్ ఉదమ్ములేపడానికి రెడీగా ఉండండి. బొమ్మ దద్దరిపోతుంది'' అని అంటున్నారు టాలీవుడ్‌ కింగ్‌ ఆఫ్‌ కామెడీ ఫిల్మ్స్ అనిల్‌ రావిపూడి. ఆహా తెలుగు ద్వారా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు అనిల్‌ రావిపూడి. హాస్య చతురత, సరదాగా నవ్వే గుణం, నలుగురి ముఖాల్లోనూ నవ్వులు పంచే గుణం కన్నా గొప్ప క్వాలిటీ ఇంకేం ఉంటుంది. ఎవరు ఎలాంటి మూడ్‌లో ఉన్నా సెట్‌ చేసేది కామెడీనే. ఈ నవంబర్‌ నుంచి అదే పనిలో ఉండబోతున్నారు అనిల్‌ రావిపూడి. కడుపుబ్బ నవ్వించే కామెడీ షో 'కామెడీ స్టాక్‌ ఎక్సేంజ్‌' నవంబర్‌ నుంచి మొదలు కానుంది. ఎస్‌ఓఎల్‌ ప్రొడక్షన్స్ ఈ షోని తెరకెక్కిస్తోంది.
 
'కామెడీ స్టాక్‌ ఎక్సేంజ్‌'లో చాలా ప్రత్యేకమైంది. స్టేజీల మీద కామెడీ చేసి, ప్రేక్షకులకు తమవైన మాటలతో చక్కిలిగింతలు పెట్టి కడుపుబ్బ నవ్వించే వారికి పెద్ద పీట వేస్తుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కి విశేషమైన స్పందన వస్తోంది. వేణు, ముక్కు అవినాష్‌, సద్దాం, ఎక్స్ ప్రెస్‌ హరి, భాస్కర్‌, జ్ఞానేశ్వర్‌ వంటివాళ్లు చేసిన కామెడీ ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టడం ఖాయం. ఇప్పటిదాకా ప్రేక్షకులకు చూపించని కోణాన్ని పంచుకోవడానికి సిద్ధమవుతున్నారు ఈ సెలబ్రిటీలు. సుడిగాలి సుధీర్‌ ఈ షోతోనే ఓటీటీలో అడుగుపెడుతున్నారు.
 

 
ఈ షో గురించి, ఆహా ద్వారా ఓటిటి లో అడుగుపెడుతునందుకు  ప్రముఖ దర్శకుడు అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ, “ప్రతిభావంతులైన నటులతో కామెడీ స్టాక్‌ ఎక్సేంజ్‌కి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. ఆద్యంతం నవ్వించే ఈ షోలో నేను కూడా భాగం అయినందుకు సంతోషిస్తున్నాను. నా ఓటీటీ డెబ్యూ ఇది. ప్రేక్షకులందరూ ఆనందంగా ఆహ్వానిస్తారని ఆశిస్తున్నాను."
అతి త్వరలోనే కామెడీ స్టాక్‌ ఎక్సేంజ్‌ ఆహాలో ప్రసారం కానుంది.
Advertisement
అనిల్ రావిపూడికామెడీ స్టాక్‌ ఎక్సేంజ్‌

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News