Sunitha Laxma Reddy: సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్న చైర్..

సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్న చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి

సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో పాల్గొన్న చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి
(తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయం - బుద్ధ భవన్): స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా మంగళవారం హైదరాబాద్ నగరంలోని కవాడిగుడ లో నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమంలో చైర్ పర్సన్ వాకిటి సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి స్వతంత్రం సిద్దించి 75సంవత్సరాలు పూర్తి చేసుకొని 76వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభతరుణంలో తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం 15రోజుల పాటు స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తోందని అన్నారు. కార్యక్రమాల్లో భాగంగానే మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారని చైర్ పర్సన్ తెలిపారు. 

దేశంలోనే తొలిసారిగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమానికి శ్రీకారం చుట్టి తెలంగాణ వ్యాప్తంగా ఒకే సమయంలో ఉదయం 11.30 గంటలకు సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆకాంక్షను కోరుతూ చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ తెలంగాణ మహిళా కమిషన్ తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తోందని గుర్తుచేశారు.
Sunitha Laxma Reddy

Watch Today's Deals on Amazon

More Press News