‘మొహబ్బత్’ నుంచి ‘వరమే’ సాంగ్‌ను రిలీజ్ చేసిన డైరెక్టర్ విఐ ఆనంద్

‘మొహబ్బత్’ నుంచి ‘వరమే’  సాంగ్‌ను రిలీజ్ చేసిన డైరెక్టర్ విఐ ఆనంద్
ఏబీఎస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై సంతోష్‌ రాజా, శ్రేయాస్‌ సేన్‌ జంటగా రూపొందిన చిత్రం 'మొహబ్బత్‌'.  అఫ్రోజ్‌ షేక్‌ నిర్మిస్తున్న ఈ మూవీకి మ్యాక్‌ దర్శకత్వం వహించారు. ఈ సినిమాని డిసెంబర్ రెండో వారంలో గ్రాండ్‌గా విడుదల చేయబోతోన్నారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్ అన్నీ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ప్రమోషన్స్‌లో భాగంగా ‘వరమే’ అంటూ సాగే యూత్ ఫుల్ లవ్ సాంగ్‌ని రిలీజ్ చేశారు. ఈ మ్యూజికల్ ప్రమోషన్స్‌తో అందరినీ ఆకట్టుకునేందకు టీం రెడీ అయింది. అందుకే పాటలతో శ్రోతల్ని ఆకట్టుకునేందుకు ముందుగా ఓ అందమైన ప్రేమ గీతాన్ని వదిలారు. డైరక్టర్ విఐ ఆనంద్ చేతుల మీదుగా 'వరమే' అనే ఈ పాటను రిలీజ్ చేశారు.

‘వరమే’ అంటూ సాగే ఈ ప్రేమ గీతాన్ని కృష్ణ తేజస్వి ఆలపించగా.. భాష్య శ్రీ ఎంతో అర్థవంతమైన సాహిత్యాన్ని అందించారు. సునీల్ కశ్యప్ బాణీ ఎంతో క్యాచీగా ఉంది. యూత్ ఆడియెన్స్‌కి ఇట్టే కనెక్ట్ అయ్యేలా ఈ పాట ఉంది. లిరికల్ వీడియోలో మొయిన్ కంపోజ్ చేసిన తీరు కూడా ఎంతో అందంగా కనిపిస్తుంది. సింపుల్ స్టెప్స్‌తో కథని నడిపిస్తూ ఎంతో అందంగా కొరియోగ్రఫీ చేశారు. ఇక ఈ ‘వరమే’ పాట యూట్యూబ్‌లో చార్ట్ బస్టర్‌గా నిలిచేట్టు కనిపిస్తోంది.ఈ చిత్రంలో ఈశ్వర్‌ సాయి, మనోజ్‌, సాత్విక్‌, శ్రేయాస్‌ సేన్, సంతోష్ రాజా, అజయ్‌ ఘోష్‌, సంతోషి, దుర్గ తదితరులు కీలక పాత్రలను పోషించారు. 

ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌‌గా సలీమ్‌ షేక్‌, సినిమాటోగ్రఫర్‌‌గా వైఎస్‌ కృష్ణ, రచయితగా కలాం, సంగీత దర్శకుడిగా సునీల్ కశ్యప్, ఎడిటర్‌గా శ్రీ వర ప్రసాద్ వర్క్ చేశారు. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించనున్నారు.
Get the ap7am app Free · Opens in one tap Install

More Press News