యుద్దం రాముడితో కాదు.. రాజ్యంతో అంటోన్న కొణిదెల పవన్‌తేజ్
Advertisement
కొణిదెల పవన్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "జంట". ఈ చిత్రంలో పాడని కుమార్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని వసుంధర ఆర్ట్స్ బ్యానర్ పై రాజేష్ గునిశెట్టి, వీరు యాదవ్ నిర్మిస్తున్నారు. రూరల్ బ్యాక్ డ్రాప్ లో సాగే ఒక యూనిక్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా దర్శకుడు రాజశేఖర్ యాదవ్ రూపొందిస్తున్నారు. ఈ రోజు ఈ చిత్ర టైటిల్, ఫస్ట్ లుక్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు, అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు మాట్లాడుతూ - ఇక్కడ దసరా బుల్లోడు సినిమా నుంచి ఎన్నో మూవీస్ షూటింగ్స్ జరుపుకున్నాయి. జంట సినిమా చిత్రీకరణకు ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం సంతోషంగా ఉంది. కొణిదెల పవన్ తేజ్ కు హీరోగా ఇది రెండో సినిమా. జంట సినిమాతో కొణిదెల పవన్ తేజ్ మెగా ఫ్యామిలీలో మరో పెద్ద హీరోగా పేరు తెచ్చుకోవాలి. ఈ సినిమా టీమ్ అందరికీ నా బెస్ట్ విశెస్ అందిస్తున్నా. అన్నారు.
ప్రొడ్యూసర్ రాజేష్ గునిశెట్టి మాట్లాడుతూ - ఈ సినిమా కోసం రెండేళ్లుగా వర్క్ చేసుకుంటున్నాం. మా సినిమా కంటెంట్ కు తగినట్లు అమలాపురంలోని లొకేషన్స్ యాప్ట్ అవుతాయని అనిపించి ఇక్కడికి వచ్చాం. అమలాపురం నుంచి వచ్చిన ప్రొడ్యూసర్స్ గా మా సినిమా ఇక్కడ స్థానికంగా షూటింగ్ జరుపుకోవడం సంతోషంగా ఉంది. ఈ స్క్రిప్ట్ ను మా డైరెక్టర్ రాజశేఖర్ తప్పితే మరొకరు డీల్ చేయలేరు. ఆయన వల్లే ఈ సినిమా ఇక్కడిదాకా వచ్చింది. ఈ సినిమాతో ఒక యూనిక్, క్రియేటివ్ డైరెక్టర్ టాలీవుడ్ కు రాబోతున్నాడని చెప్పగలను. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుంది. ఈ మూవీకి వర్క్ చేసిన వాళ్లంతా గర్వంగా ఫీలవుతారు. అన్నారు.
హీరోయిన్ పాడని కుమార్ మాట్లాడుతూ - ఇది నాకు ఫస్ట్ తెలుగు మూవీ. ఈ సినిమాలో అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. మా టీమ్ లోని ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతున్నా. ఈ సినిమాను పెద్ద హిట్ చేయాలని మీ అందరినీ కోరుతున్నా. ఈ సినిమా షూట్ లో జాయిన్ అయ్యేందుకు ఆత్రుతగా వేచి చూస్తున్నా. అన్నారు.
హీరో పవన్ తేజ్ కొణిదెల మాట్లాడుతూ - మా జంట చిత్రానికి శుభాకాంక్షలు అందజేసిన పెద్దలకు థ్యాంక్స్. మా సినిమాను మొదట్లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించాలని అనుకున్నాం. ఆంధ్రా వైపు కూడా మన సినిమాల షూటింగ్స్ జరగాలని మేమంతా డిస్కస్ చేసుకుని అమలాపురంకు షిఫ్ట్ అయ్యాం. మా సినిమా షూటింగ్ మొత్తం ఇక్కడే జరపబోతున్నాం. రెండేళ్లుగా నేను మా డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ మీద ట్రావెల్ చేస్తున్నాం.
ఈ సినిమాను ఎలాగైనా హిట్ చేయాలని ప్రయత్నిస్తున్నాం. వేరే మూవీస్ ఆఫర్స్ వచ్చినా నేను ఈ చిత్రం కోసం వేచి చూస్తూ వచ్చాను. బలమైన కథతో ఈ సినిమా చేస్తున్నాం. ఈ చిత్రంలో హీరోగా నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. సినిమాలో మంచి ఎమోషనల్ డ్రైవ్, మాస్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇలాంటి కథ ఇప్పటిదాకా రాలేదని చెప్పగలను. మా సినిమా క్యాప్షన్ 'యుద్ధం రాముడితో కాదు రాజ్యంతో..'. ఈ క్యాప్షన్ చూసి చాలా మంది ఫోన్స్ చేస్తున్నారు. ఈ క్యాప్షన్ మా కథకు యాప్ట్ గా ఉంటుంది. జంట సినిమాతో బ్లాక్ బస్టర్ కొడుతున్నాం. అన్నారు.