Advertisement

చంద్రయాన్" సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుంది: శ్రీ విష్ణు

Entertainment
Advertisement
రాజు వెడ్స్ రాంబాయి సూపర్ హిట్ తర్వాత నిర్మాత వేణు ఊడుగుల తన సమర్పణలో "చంద్రయాన్" టైటిల్ తో మరో ఇంట్రెస్టింగ్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో శివకుమార్ ధీకొండ, స్వప్న ప్రియదర్శిని, రవి శివతేజ, వంశీధర్, లోకేష్, బలగం సత్యనారాయణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని సింబ స్క్రీన్ స్టోరీస్ బ్యానర్ పై ప్రవీణ్ మొలక నిర్మిస్తున్నారు. శ్రీనాథ్ చంద్రశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు. హిలేరియస్ అడ్వెంచర్ స్టోరీతో తెరకెక్కిన "చంద్రయాన్" సినిమా ఈ నెల 13న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు కింగ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ హీరో శ్రీవిష్ణు అతిథిగా "చంద్రయాన్" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

డైరెక్టర్ నీలకంఠ మాట్లాడుతూ - శ్రీనాథ్ నాతో నాలుగేళ్ల పాటు ట్రావెల్ చేశాడు. ఆయన ఆలోచనలు జెన్యూన్ గా ఉంటాయి. ఈ సినిమాలోనూ అదే నిజాయితీ కనిపిస్తోంది. ఈ సినిమా చూశాను. మంచి ఎంటర్ టైనర్ అవుతుంది. వేణు గారు ప్రెజెంట్ చేస్తున్నారు కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తుంది. వేణు గారు చేసే సినిమాలు, ఆయన ఎంచుకునే మూవీస్ అన్నీ కొత్త తరహాలో ఉంటాయి. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించాలి. ఇలాంటి నేపథ్యమున్న చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన ప్రవీణ్ గారిని అభినందిస్తున్నా. అన్నారు.

ప్రొడ్యూసర్ ప్రవీణ్ మొలక మాట్లాడుతూ - ఈ సినిమా కోసం డైరెక్టర్ శ్రీనాథ్ తన టీమ్ తో ఎంతో కష్టపడ్డాడు. మా టెక్నీషియన్స్, ఆర్టిస్టులు పూర్తి సహకారం అందించారు. మా సినిమాకు అండగా నిలబడిన వేణు ఊడుగుల గారికి థ్యాంక్స్. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక కొత్త తరహా ఎంటర్ టైనర్ గా చంద్రయాన్ మీ ముందుకు రాబోతోంది. యూత్ తో పాటు ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేసేలా సినిమా ఉంటుంది. ఈ నెల 13న మా సినిమాను తెలుగు ప్రేక్షకులు సక్సెస్ చేస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

హీరో శివకుమార్ ధీకొండ మాట్లాడుతూ - ఈ వేదిక మీద హీరోగా నిలబడాలి అనేది నా పదేళ్ల కల. ఈ పదేళ్లలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాను. ఈ జర్నీలో చంద్రయాన్ వంటి మంచి అవకాశం రావడం హ్యాపీగా ఉంది. ఈ చిత్రంలో హీరోగా నన్ను సెలెక్ట్ చేసుకుని మా డైరెక్టర్ కు, నన్ను నమ్మి ప్రొడ్యూస్ చేసిన మా ప్రొడ్యూసర్ కు థ్యాంక్స్. ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో సినిమా చేయాలంటే ఈజీ కాదు. అందుకు మా టీమ్ అంతా చాలా సపోర్ట్ చేశారు. ఈ నెల 13న థియేటర్స్ లో మా సినిమా చూడండి. మీరు మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంతా ఫుల్  ఫన్ ను ఎంజాయ్ చేస్తారు. అన్నారు.

డైరెక్టర్ శ్రీనాథ్ చంద్రశేఖర్ మాట్లాడుతూ - ఈ సినిమాకు వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్, ఆర్టిస్ట్ కు రుణపడి ఉంటాను. 42 రోజులు షూటింగ్ చేశాం. సినిమా కోసం ప్రతి ఒక్కరూ చాలా కష్టపడ్డారు. శివకుమార్ ను ఈ సినిమాలో రాకెట్ మ్యాన్ గా చూపించాం. ఆయన ఫ్యూచర్ లో రాకెట్ స్టార్ గా ఎదుగుతారు. ఈ సినిమా కంప్లీట్ అయ్యాక వేణు గారి దగ్గరకు వెళ్లి కాన్సెప్ట్ చెప్పాం. ఆయనకు నచ్చి మాకు సపోర్ట్ గా ఉండేందుకు ముందుకొచ్చారు. ఈ నెల 13వ తేదీ నుంచి ప్రతి థియేటర్ లో నవ్వులు హంగామా మొదలవుతుంది. 2 గంటల 15 నిమిషాలు మిమ్మల్ని ఆగకుండా నవ్వించే చిత్రమిది.  ఆయుధాలు, రక్తపాతాలు లేని చిత్రమిది. మీ జీవితంలో ఏ సమస్య ఉన్నా మా మూవీ థియేటర్ కు రండి మీ బాధల్ని రెండు గంటల పాటు మర్చిపోయి నవ్వుకుంటారు. మా సినిమా మీకొక లాఫింగ్ థెరపీ.  ప్రతి సీన్ హిలేరియస్ గా నవ్విస్తుంది. అన్నారు.

మూవీ ప్రెజెంటర్ వేణు ఊడుగుల మాట్లాడుతూ - మా సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. పెద్ద సినిమాలు ఉండటం వల్ల వాయిదా వేస్తూ వచ్చాం. ఒక్కసారి డేట్ మారితే ప్రొడ్యూసర్ కు ప్రమోషన్ కు చేసిన ఖర్చంతా భారమే. ఒక కాన్సెప్ట్ అనుకుని ఈవెంట్స్ చేస్తూ వచ్చాం. కానీ మా ప్రొడ్యూసర్ ఎంతో సపోర్ట్ చేశారు. సినిమా వాయిదా పడినా ప్రమోషన్ పరంగా వెనకడుగు వేయలేదు. రిలీజ్ విషయంలో బెక్కెం అన్న సపోర్ట్ చేశారు. మూవీ డిస్ట్రిబ్యూషన్ కు శిరీష్ గారు ముందుకొచ్చారు. మంచి థియేటర్స్ ఇద్దాం, సినిమా టాక్ బాగుంటే ఇంకా బెటర్ గా తీసుకెళ్దామన్నారు. ఇలా ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తూ వస్తున్నారు. వారందరికీ థ్యాంక్స్ చెబుతున్నా. స్టార్ తో చేసే సినిమాలు, భారీ బడ్జెట్ తో చేసే సినిమాలు చూస్తుంటాం. కానీ ఒక మంచి ఆలోచనతో , వినూత్నంగా తెరకెక్కించే సినిమాలు అరుదుగా వస్తుంటాయి. అలాంటి అరుదైన సినిమా చంద్రయాన్. డైరెక్టర్ లో ఎంతో నిజాయితీ కనిపించింది. ఈ సినిమా చూడగానే సపోర్ట్ చేసేందుకు ముందుకొచ్చాను. ప్రేక్షకుల్ని ఆలోచింపజేస్తూ, వినోదాన్ని అందించే చిత్రమిది. శివకుమార్ సినిమా మీద ప్యాషన్ ఉన్న యంగ్ హీరో. ప్రొడ్యూసర్ ఈ సినిమా మీద పెట్టుకున్న నమ్మకం గెలవాలని కోరుకుంటున్నా. ప్రేక్షకులు ఇలాంటి కొత్త తరహా సినిమాలను ఎంకరేజ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నా. అన్నారు.

కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు మాట్లాడుతూ - "చంద్రయాన్" సినిమాకు యంగ్ టాలెంట్ పనిచేశారు. ఈ సినిమా ఈ కొత్త వాళ్లకు మంచి పేరు తీసుకురావాలి. తెలంగాణ నేపథ్యంతో వస్తున్న సినిమా అయినా రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు ఆదరిస్తారు. మంచి సాంగ్స్ ఉన్నాయి. పట్టణాలే కాదు పల్లెల్లోనూ ఈ సినిమాకు ఆదరణ దక్కాలని కోరుకుంటున్నా. డైరెక్టర్ కు ఈ సినిమాతో మంచి పేరు, ప్రొడ్యూసర్ కు డబ్బులు రావాలని కోరుకుంటున్నా. అన్నారు.

కింగ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ - ఏదైనా కొత్తదనం ఉంటే తప్ప వేణు ఊడుగుల గారు సినిమాను ప్రెజెంట్ చేయరు. ఈ సినిమా కాన్సెప్ట్ గురించి ఇప్పుడే చెప్పారు. ఇందులో ఒక సరదా పాయింట్ ఉంది. అందుకే వేణు గారు టేకప్ చేశారు. కొత్త టీమ్ ను సపోర్ట్ చేస్తున్న వేణు గారిని అభినందిస్తున్నా. ఈ సినిమా ఈ నెల 13న మీ ముందుకు వస్తోంది. మూవీ మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. ఈ కొత్త టీమ్ అందరికీ మంచి పేరు రావాలని కోరుకుంటున్నా. ఈ టీమ్ చేసిన ప్రయత్నాన్ని రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులతో పాటు ఇతర రాష్ట్రాల ఆడియెన్స్ కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నా. అన్నారు.

Advertisement
ChandrayanChandrayan movie

More Press News

మెగాస్టార్‌ చిరంజీవికి 'ఖైదీ'లా సుడిగాలి సుధీర్‌ కెరీర్‌కు 'గోట్‌' కెరీర్‌లో నిలిచిపోతుంది!

11 Nov, 23:15

ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రం అందరికీ కనెక్ట్‌ అవుతుంది!

11 Nov, 23:12

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28
..More Press News