Advertisement

ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రం అందరికీ కనెక్ట్‌ అవుతుంది!

Entertainment
Advertisement
వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘ఇంకా ఏం అనుకోలేదు!’. వంశీ నందిపాటి నిర్మాతగా కన్ను సమీర్, వెన్నపూస శ్రీకర్ రెడ్డి సహ నిర్మాతలుగా ప్రణయ్ వల్లూరిపల్లి, గిరి పెమ్మసాని సంయుక్తంగా తెరకెక్కించిన ఈ మూవీలో అక్షయ్ లగుసాని, కేయూరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో , జయకృష్ణ, రావు రమేష్, హర్షవర్థన్‌, అనిత చౌదరి, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సినిమాని డిసెంబర్ 11న విడుదల చేయబోతోన్నారు. ఈ క్రమంలో ‘మేఘాలు సంద్రంలో’ అంటూ సాగే సాంగ్‌ను లాంచ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో..

వంశీ నందిపాటి మాట్లాడుతూ .. ‘‘ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రం అందరికీ రిలేట్ అయ్యేలా, కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. గిరి, ప్రణయ్ చెప్పిన ఈ కథ నాకు ఎంతో నచ్చింది. ఈ ఇద్దరి పేర్లు ఇండస్ట్రీ కచ్చితంగా గుర్తు పెట్టుకుంటుంది. సింజిత్ అద్భుతమైన పాటల్ని ఇచ్చాడు. అక్షయ్, సింజిత్ మంచి స్నేహితులు. కేయూరికి ఆల్ ది బెస్ట్. ఈటీవి విన్‌తో కలిసి ఈ మూవీని డిసెంబర్ 11న ఆడియెన్స్ ముందుకు తీసుకు వస్తున్నాం. ఈ జర్నీలో సపోర్ట్‌గా నిలిచిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

ఈటీవీ విన్ కంటెండ్ హెడ్ భరణ్ మాట్లాడుతూ .. ‘‘ఇంకా ఏం అనుకోలేదు!’ మాకెంతో ప్రత్యేకమైన సినిమా. ఈ చిత్రంతో ఒకేసారి ఇద్దరు దర్శకుల్ని పరిచయం చేయబోతోన్నాం. వంశీ గారికి నిర్మాతగా ఇదే తొలి చిత్రం. అందుకే మా సినిమా ప్రత్యేకం. సినిమాకు సింజిత్ మంచి సంగీతం ఇచ్చారు. డిసెంబర్ 11న మా సినిమాని రిలీజ్ చేస్తున్నామ’ని అన్నారు.

ఈటీవీ విన్ వైస్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ మాట్లాడుతూ .. ‘మాకు సింజిత్ ఎప్పుడూ మంచి పాటల్నే ఇస్తుంటాడు. ‘ఇంకా ఏం అనుకోలేదు!’ సినిమాకి కూడా సింజిత్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు. వంశీ నందిపాటి గారిని నిర్మాతగా పరిచయం చేస్తుండటం ఆనందంగా ఉంది. ఈ మూవీతో ఇద్దరు దర్శకుల్ని పరిచయం చేయబోతోన్నామ’ని అన్నారు.

దర్శకుడు ప్రణయ్ వల్లూరిపల్లి మాట్లాడుతూ .. ‘‘ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రానికి సింజిత్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. అన్ని పాటలు బాగుంటాయి. కిట్టూ గారు మంచి లిరిక్స్ అందించారు. రేహాన్ మంచి విజువల్స్ ఇచ్చారు. అనురాగ్ మంచి మాటలు అందించారు. మా సినిమా డిసెంబర్ 11న రాబోతోంది. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాం. మాకు ఈ అవకాశం ఇచ్చిన వంశీ గారికి, ఈటీవి విన్ టీంకు థాంక్స్’ అని అన్నారు.

దర్శకుడు గిరి పెమ్మసాని మాట్లాడుతూ .. ‘‘ఇంకా ఏం అనుకోలేదు!’ సినిమాతో మాకు అవకాశం ఇచ్చిన వంశీ గారికి, ఈటీవీ విన్ టీంకు థాంక్స్. ఇదే మాకు తొలి చిత్రం. సింజిత్ మంచి సంగీతమందించారు. పాటలన్నీ బాగుంటాయి. మున్ముందు మరిన్ని ఈవెంట్లలో ఆడియెన్స్ ముందుకు వస్తాం. మా సినిమా డిసెంబర్ 11న రాబోతోంది’ అని అన్నారు.

అక్షయ్ లగుసాని మాట్లాడుతూ .. ‘‘ఇంకా ఏం అనుకోలేదు!’ సినిమాలో ఛాన్స్ ఇచ్చిన వంశీ గారికి, ఈటీవి విన్ టీంకి థాంక్స్. ఈ ఈవెంట్‌కి సింజిత్ హీరో. అతను నా ఫ్లాట్ మేట్. 24 గంటలూ పని చేస్తూనే ఉంటాడు. మా కోసం మంచి పాటల్ని ఇచ్చాడు. మమ్మల్ని ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. డిసెంబర్ 11న ఆడియెన్స్ ముందుకు రాబోతోన్నామ’ని అన్నారు.

కేయూరి మాట్లాడుతూ .. ‘‘ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రంలో అవకాశం ఇచ్చిన వంశీ గారికి, ఈటీవి విన్ టీంకు థాంక్స్. నాకు మంచి పాత్రను ఇచ్చిన ప్రణయ్, గిరికి థాంక్స్. అక్షయ్, జైకృష్ణ గురించి మున్ముందు ఈవెంట్లలో మాట్లాడతాను. మేం రిలీజ్ చేసిన పాట అందరికీ నచ్చే ఉంటుందని భావిస్తున్నాను’ అని అన్నారు.

నటుడు జై కృష్ణ మాట్లాడుతూ .. ‘‘ఇంకా ఏం అనుకోలేదు!’ సినిమాలోని మా సాంగ్ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. సాంగ్ లాంచ్ కోసం వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ మాట్లాడుతూ .. ‘‘ఇంకా ఏం అనుకోలేదు!’ చిత్రంలో మొదటి సారిగా ఇద్దరు దర్శకులతో పని చేశాను. నాకు అక్షయ్ మంచి మిత్రుడు. నాకు ఇష్టమైన జానర్ రొమ్ కామ్, ఈ సినిమాకు వర్క్ చేయడం ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన వంశీ గారికి, ఈటీవీ విన్ టీంకి థాంక్స్. మూవీ చాలా బాగా వచ్చింది. డిసెంబర్ 11న మా చిత్రం రాబోతోంది’ అని అన్నారు. 



Advertisement
Inka Em AnukoledhuInka Em Anukoledhu songMeghalu SandramloETV Win

More Press News

చంద్రయాన్" సినిమా మీ అందరినీ ఆకట్టుకుంటుంది: శ్రీ విష్ణు

11 Nov, 23:22

మెగాస్టార్‌ చిరంజీవికి 'ఖైదీ'లా సుడిగాలి సుధీర్‌ కెరీర్‌కు 'గోట్‌' కెరీర్‌లో నిలిచిపోతుంది!

11 Nov, 23:15

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28
..More Press News