సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

Entertainment
Advertisement
‘మాంగళ్యం’, ‘పరాక్రమం’, ‘నిర్భంధం’ వంటి చిత్రాలతో తనలోని విలక్షన నటుడ్ని అందరికీ పరిచయం చేసుకున్నాడు సరోజ్ కుమార్. ఆయన నటన, మేకింగ్, టేకింగ్ అంటే ఓ వర్గానికి చెందిన ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. ప్రస్తుతం సరోజ్ మరో వినూత్న కాన్సెప్ట్‌తో ఆడియెన్స్‌ని ఆకట్టుకునేందుకు రెడీ అయ్యారు. సరోజ్ ప్రధాన పాత్రల్లో రానున్న నూతన చిత్రం ‘ఛప్రి’. ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్, ఎడిటింగ్, మ్యూజిక్, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతల్ని సరోజ్ నిర్వర్తించారు. BSK మెయిన్ స్ట్రీమ్ బ్యానర్ మీద సరోజ్, ప్రమోద్ పడమటి, పృథ్వీ చౌహాన్ నిర్మించిన ఈ సినిమాలో సరోజ్‌తో పాటుగా ఐశ్వర్య బోరా, దివ్య జ్యోతి, శ్లోకా, ప్రవీన్, మోహన్ ఆర్య, జీవా బాలచందర్, ప్రియాంక సింగ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.

స్లమ్‌లో ఉండే ఓ కుర్రాడు.. అతడి ప్రేమ ప్రయాణం.. ఆ జర్నీలో కొంత మంది డబ్బున్న వ్యక్తులు ఎదురు పడటం, వారి వల్ల అతని జీవితం తలకిందులు అవ్వడం అనే ఆసక్తికరమైన పాయింట్స్‌తో ‘ఛప్రి’ మూవీని తెరకెక్కించారు. ప్రేమ చుట్టూ తిరిగే ఈ కథలో చివరకు ఏం జరుగుతుంది? అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అతని ప్రేమలో విజయం సాధిస్తాడా? లేదా? అన్నది ‘ఛప్రి’ మూల కథ. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని తాజాగా విడుదల చేశారు.

‘ఛప్రి’ ఫస్ట్ లుక్‌లో సరోజ్ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. స్లమ్ కుర్రాడిలా రా అండ్ రస్టిక్‌గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌ని గమనిస్తుంటే ఫుల్ యాక్షన్ మోడ్‌లో హీరో కనిపిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. 
Advertisement
CHAPRIBandi saroj kumarChapri first lookcinema

More Press News

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28

పూజా హెగ్డే, హరీశ్ శంకర్, అనిల్ రావిపూడి, వి.వి. వినాయక్‌లతో జీ తెలుగు వీకెండ్ సందడి!

30 Oct, 14:34
..More Press News