ప్రేమ 'శనార్తి' ప్రారంభం !
దర్శకుడు సంపత్ నంది నిర్మాణ సంస్థ సంపత్ నంది టీమ్‌వర్క్స్, శ్రీ ధనలక్ష్మి ప్రొడక్షన్స్ అధినేత, అభిరుచి గల నిర్మాత కె.వి. శ్రీధర్ రెడ్డితో కలిసి తన రెండవ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధమవుతోంది. ప్రతిష్టాత్మక ఆదిత్య మూవీస్ బ్యానర్ సమర్పిస్తోంది.
'రాజు వెడ్స్ రాంబాయి' చిత్రంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అఖిల్ రాజ్, యంగ్ ట్యాలెంటెడ్ నాగ దుర్గ ఇందులో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రాజ్ గణేష్ ఉప్పునూతి ఈ ప్రాజెక్ట్‌తో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి 'శనార్తి' అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు. హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ప్రముఖ సినీ ప్రముఖులు, చిత్ర బృందం సమక్షంలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. చిత్ర బృందం త్వరలోనే షూటింగ్‌ను ప్రారంభించనుంది. 'శనార్తి' చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతర ఆసక్తికరమైన వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
మూవీ లాంచింగ్ ఈవెంట్ లో సంపత్ నంది మాట్లాడుతూ.. ఏ సినిమా చేయడానికి అయినా కథ కారణం అవుతుంది. ఈ సినిమా చేయడానికి మాత్రం కథతో పాటు గణేష్ కారణం. గణేష్ చాలా ప్రతిభావంతుడు. తను దర్శకుడు కావడానికి సపోర్ట్ చేసిన శ్రీధర్ గారికి ధన్యవాదాలు. అలాగే ఆదిత్య మూవీస్ ఉమేష్ గారికి కూడా ధన్యవాదాలు. ‘శనార్తి’.. పల్లెటూరిలో చాలా స్వచ్ఛంగా, ఆత్మీయంగా పలకరించుకున్నప్పుడు ఉపయోగించే పదం ఇది. ఈ ప్రేమకథకి ఈ పదం అచ్చంగా సరిపోతుంది. అఖిల్‌కి ఈ కథ చాలా నచ్చింది. అలాగే నాగ దుర్గ కూడా ఈ ప్రాజెక్ట్‌లోకి రావడానికి కారణం అఖిల్. ఇందులో హీరోయిన్ పాత్రకు నాగదుర్గ బాగుంటుందని సజెస్ట్ చేశాడు. నిజంగా ఆమె వీడియోలను చూసినప్పుడు ఈ పాత్రకు తనే పర్ఫెక్ట్ అనిపించింది. ఇద్దరూ స్క్రీన్‌పై చాలా అందంగా కనిపిస్తారు. చిరంజీవి గారు-శ్రీదేవి గారు, వెంకటేష్ గారు-సౌందర్య గారిని తెరపై చూసినప్పుడు ఎంత మంచి ఫీలింగ్ కలుగుతుందో.. వీళ్లిద్దరి కాంబినేషన్ కూడా అంత అందంగా ఉంటుంది. వాళ్లిద్దరి కోసం చాలామంది కథలు రాస్తారని అనుకుంటున్నాను. సురేష్ బొబ్బిలి చక్కని సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని అందరినీ కోరుతున్నాను. ఇది మనందరి సినిమా' అన్నారు.
దర్శకుడు గణేష్ మాట్లాడుతూ: “అందరికీ శనార్తి. సంపత్ నంది గారు నా బలం. ఆయన దగ్గర రచయితగా పనిచేశాను. ఒకరోజు ఈ కథ చెప్పగానే ఆయనకు చాలా నచ్చింది. అలాగే మా నిర్మాత శ్రీధర్ గారికి ధన్యవాదాలు. అఖిల్ రాజ్, నాగ దుర్గతో మ్యాజిక్ చేయబోతున్నాం. సంపత్ నంది గారు లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. మరోసారి ఆయనకు ధన్యవాదాలు. మా టీమ్ అందరికీ ధన్యవాదాలు' అన్నారు