మనుషుల మధ్య ఉండే ఆప్యాయతలోనే చాలా మంచి కథలు ఉంటాయి : దర్శకుడు ఉదయ్ చౌహాన్
అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా సమర్పిస్తూ నిర్మిస్తున్న చిత్రం పళ్ళబురుసు. ఉదయ్ చౌహాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్, ప్రజ్వల్ యాద్మా, గోమతి రెడ్డి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ‘పళ్ళ బురుసు’ ఆగస్టు 14న థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు ఉదయ్ చౌహాన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
మాది మహబూబ్‌నగర్ జిల్లా. అమ్మానాన్న ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. నాకు చిన్నప్పటి నుంచే సినిమాలంటే చాలా ఇష్టం. ఇంట్లో డాక్టర్ చదవని చెప్పారు. కానీ సినిమాలపై పాషన్ తో మాస్ కమ్యూనికేషన్ లో జాయిన్ అయ్యాను. అక్కడ నుంచి సినిమాలపై ఆసక్తి మరింత పెరిగింది. పుణేలో రెండేళ్లు చదువుకున్నాను. అక్కడ స్క్రీన్‌ప్లే, డైరెక్షన్ నేర్చుకున్నాను. ఆ తర్వాత ముంబైలో యాడ్ ఫిల్మ్స్‌కు అసిస్టెంట్‌గా జాయిన్ అయ్యాను. అక్కడ చాలా విషయాలు నేర్చుకున్నాను.
2016లో హైదరాబాద్‌కు వచ్చి సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టాను. ఇండిపెండెంట్‌గా ఒక సినిమా చేసి ఫెస్టివల్స్‌కు పంపించాను. దాంతో నాకు మరింత నమ్మకం వచ్చింది. అదే సమయంలో డిస్నీ హాట్‌స్టార్ నుంచి అవకాశం వచ్చింది. అక్కడ మూడేళ్లు పనిచేశాను. ఈ కథ రాసుకున్న తర్వాత ఒక మంచి బ్యానర్ కోసం చూస్తున్న సమయంలో అన్నపూర్ణ స్టూడియోస్‌లో కథ చెప్పే అవకాశం వచ్చింది. నాకు ఆ సంస్థ అంటే చాలా అభిమానం. వారు ఎప్పుడూ విలక్షణమైన సినిమాలు నిర్మిస్తుంటారు. సుప్రియా గారికి కథ చెప్పగానే వెంటనే నచ్చింది. అక్కడి నుంచే ‘పళ్ళ బురుసు’ జర్నీ మొదలైంది.
నేను మహబూబ్‌నగర్‌లోనే పుట్టాను. ఊర్లో జరిగే సంఘటనలు, అక్కడి పాత్రలను చాలా జాగ్రత్తగా పరిశీలించేవాడిని. నాకు టౌన్‌లో ఉండడం కంటే ఊర్లో ఉండడం ఇష్టం. అక్కడి ప్రజలు నాపై చూపించే అభిమానం చాలా ఆనందాన్ని ఇచ్చేది. ఊర్లో చాలా ప్రశాంతత ఉంటుంది. నిజానికి అక్కడ చాలా మంచి కథలు ఉంటాయి. ఆ కథల్లో ఉండే స్వచ్ఛత నాకు చాలా ఇష్టం.
‘పళ్ళ బురుసు’లో కూడా చాలా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. అదే సమయంలో మనసును హత్తుకునే ఒక సందేశం కూడా ఉంది.
ఈ సినిమాలో కేవలం ‘పళ్ళ బురుసు’ అనే అంశం మాత్రమే కాదు. చాలా లేయర్స్ ఉన్నాయి. అవన్నీ మీరు థియేటర్‌లో చూస్తారు. ‘పళ్ళ బురుసు’ నేపథ్యం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
ఊర్లో చాలా విషయాలు చూశాను. చిన్న చిన్న విషయాల గురించి చాలా పెద్ద గొడవలు జరుగుతాయి. కాసేపు గొడవపడతారు, ఆ తర్వాత మళ్లీ కలిసిపోతారు. మనుషుల మధ్య ఉండే ఆప్యాయతలోనే చాలా మంచి కథలు ఉంటాయి. అలాంటి చిన్న సంఘటనను కూడా ఎంత అద్భుతంగా, మనసును హత్తుకునేలా చెప్పొచ్చో ఈ సినిమాలో మీరు చూస్తారు.
నాగార్జున గారు సినిమా చూసి చాలా హార్ట్ టచింగ్‌గా ఉందని అన్నారు. సినిమా డైలాగ్స్ చాలా బాగున్నాయని చెప్పారు. అదే సమయంలో ఎక్కడా బోర్ కొట్టకుండా సాగిపోయిందని అన్నారు. సజెషన్స్ కూడా ఇచ్చారు. అవి మాకు చాలా హెల్ప్ అయ్యాయి. నాగచైతన్య గారికి కూడా ఈ కథ చెప్పాను. ఆయనకు కూడా చాలా నచ్చింది. త్వరలోనే ఆయన సినిమా చూస్తారు.
మీరు అన్నది కరెక్టే. నిజానికి ఇలాంటి క్యూరియాసిటీ రావాలనే నేను అలా రాశాను. ఆ కేసు వెనుక చాలా ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. అవన్నీ సినిమాలో చూసినప్పుడు ఎంజాయ్ చేస్తారు.
సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు ఆ ప్రపంచంలోకి వెళ్లిపోతారు. ఆ ఊర్లోకి వెళ్లిపోయిన ఫీలింగ్ కలుగుతుంది. ఇది మనసును హత్తుకునే ఎంటర్టైనర్. మంచి ఫీలింగ్‌తో థియేటర్ నుంచి బయటకు వస్తారు.
కొత్త సినిమాల గురించి కొన్ని ఐడియాలు ఉన్నాయి. అయితే వాటిపై మరింత వర్క్ చేయాలి. ‘పళ్ళ బురుసు’ రిలీజ్ అయిన తర్వాత వాటిపై పని చేస్తాను.