సినీ ప్రముఖుల సమక్షంలో సీనియర్‌ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి 75వ పుట్టినరోజు వేడుకలు

సకుటుంబ కథా చిత్రాలతో తెలుగు తెరకు మిరుమిట్లు గొలిపే విజయాలు అందించిన దిగ్దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి ప్రస్తుతం తన 43వ సినిమా "వేదవ్యాస్" రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత కె . అచ్చిరెడ్డి సమర్పణలో నూతన నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి తన సాయి ప్రగతి ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో పిడుగు విశ్వనాథ్  హీరోగా అరంగేట్రం చేస్తుండగా...కొరియన్  నటి జూన్ హ్యూంజీ,  మంగోలియన్ నటుడు షరన్ బోల్డ్ సెగ్మెంట్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమవుతున్నారు. "వేదవ్యాస్" సినిమా ప్రస్తుతం చిత్రీకరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ రోజు దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి 75వ జన్మదినోత్సవం సందర్భంగా హైదరాబాద్ ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ లో పుట్టినరోజు వేడుకలతో పాటు "వేదవ్యాస్" సినిమా మేకింగ్ వీడియో లాంఛ్ చేశారు. 38 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన దర్శకుడిగా ఎస్వీ కృష్ణారెడ్డికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నుంచి వరల్డ్ రికార్డ్ గుర్తింపు పత్రాన్ని అందజేశారు. పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా

నిర్మాత కొమ్మూరి ప్రతాపరెడ్డి మాట్లాడుతూ - ఎస్వీ కృష్ణారెడ్డి గారు గొప్ప దర్శకులు. మంచి మనసున్న వ్యక్తి. ఆయన సకుటుంబంగా చూసే ఎన్నో అద్భుతమైన చిత్రాలు రూపొందించారు. ఆ సినిమాలన్నీ వినోదంతో పాటు సమాజానికి సందేశాన్ని కూడా చెప్పాయి. పిల్లల నుంచి పెద్దల దాకా ఎస్వీ గారి సినిమాలను ఆస్వాదించారు. నేను సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి కారణం ఎస్వీ కృష్ణారెడ్డి గారు, అచ్చిరెడ్డి గారు. మన వేదాల గొప్పదనం, వాటి వెనక ఉన్న సైన్స్ గురించి చెబుతూ కృష్ణారెడ్డి గారు "వేదవ్యాస్" కథ సిద్ధం చేశారు. ఇలాంటి కథతో సినిమా చేస్తే నేటి సమాజానికి మంచిని చెప్పినట్లవుతుందని ఆయన నాతో అన్నారు. నేను వెంటనే మూవీ చేసేందుకు అంగీకరించాను. ఈ సినిమా కోసం నిర్మాతగా ఆయన ఏది చెబితే అది ఫాలో అయ్యాను. "వేదవ్యాస్" సినిమా షూటింగ్ పూర్తయింది. మూవీ చాలా బాగా వచ్చింది. మా సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్ చెబుతున్నా. తను దర్శకత్వం వహించిన 42 చిత్రాల్లో 38 సినిమాలకు సంగీతం అందించిన రికార్డ్ ఆయనకే సొంతం. అందుకే తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ వారు వరల్డ్ రికార్డ్ గుర్తింపు అందజేశారు. కృష్ణారెడ్డి గారు నూరేళ్లు సంతోషంగా జీవించాలి. మరెన్నో విజయాలు సాధించాలి. ఆ ప్రయాణంలో మేమూ ఉండాలని కోరుకుంటున్నాం. అన్నారు.
నటుడు శ్రీకాంత్ మాట్లాడుతూ - ఎస్వీ గారి దర్శకత్వంలో ఎక్కువ చిత్రాల్లో హీరోగా నటించే అదృష్టం నాకే దక్కింది. ఆయన 75వ పుట్టిరోజు వేడుకుల్లో మేమంతా పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. కృష్ణారెడ్డి గారు ప్రస్తుతం వేదవ్యాస్ అనే సినిమా రూపొందిస్తున్నారు. ఈ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నా. ఎస్వీ గారు మరెన్నో చిత్రాలను రూపొందించాలి. అన్నారు.

నటుడు జేడీ చక్రవర్తి మాట్లాడుతూ - ఎస్వీ కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో నటించే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన గొప్ప కథకుడు. ఆయన కథ చెప్పే విధానం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సరదాగా మనం ఏదైనా పాయింట్ మీద కథ చెప్పమన్నా అద్భుతంగా చెబుతారు. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నా. అన్నారు.


వేదవ్యాస్ మూవీ హీరో పిడుగు విశ్వనాథ్ మాట్లాడుతూ - ఎస్వీ కృష్ణారెడ్డి గారి లాంటి లెజెండరీ డైరెక్టర్ చేతుల మీదుగా నేను హీరోగా లాంఛ్ కావడం నా అదృష్టం. ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఇలాంటి బర్త్ డే లు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నా. అన్నారు.

దర్శకులు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ - ఇంతమంది నిర్మాతలు, దర్శకులు, నటీనటులు అతిథులుగా వచ్చారు కాబట్టే ఈరోజు నా పుట్టినరోజు కార్యక్రమం ఇంత ఘనంగా జరుపుకున్నాం. నా పుట్టినరోజున నా మ్యూజిక్ కు ఒక రికార్డ్ దక్కింది. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ వారి నుంచి మెమొంటో అందుకున్నాను. ఇంతకంటే అదృష్టం ఇంకేం కావాలి. మీరంతా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేశారు. నా రాబోయో వేదవ్యాస్ సినిమాను కూడా సక్సెస్ చేస్తారు. మీ అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నా. అన్నారు.

నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ - ఎందరో ఆత్మీయుల మధ్య కృష్ణారెడ్డి గారు పుట్టినరోజు వేడుకలు, వేదవ్యాస్ మేకింగ్ వీడియో లాంఛ్, ఎస్వీ గారికి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ వరల్డ్ రికార్డ్ ప్రధానోత్సవ కార్యక్రమం ఘనంగా జరుపుకున్నాం. మా ఈ 43 చిత్రాల జర్నీలో నటీనటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, ఇతర మిత్రులు సహకరించడం వల్లే మేము ఇక్కడి వరకు రాగలిగాం.  ప్రతాపరెడ్డి గారు కృష్ణారెడ్డి గారి మీద ఉన్న ప్రేమ, అభిమానం, నమ్మకంతో వేదవ్యాస్ సినిమాను రూపొందించేందుకు సంపూర్ణమైన స్వేచ్ఛ, సహకారం, ప్రోత్సాహం ఇచ్చారు. ఆ సహకారంతోనే ఒక ఛాలెంజ్ గా తీసుకుని ఈ సినిమా చేస్తున్నాం. వేదవ్యాస్ సినిమా మా అందరికీ కమ్ బ్యాక్ మూవీ అవుతుంది' అన్నారు. 

More Press Releases