జీ తెలుగు సమ్మర్ ట్రీట్: 'అఖండ 2' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్.. ఏప్రిల్ 26న సాయంత్రం 5:30 గంటలకు!

Entertainment
Advertisement

హైదరాబాద్, 23 ఏప్రిల్ 2026: వేసవి ఎండలు పెరుగుతున్న వేళ, ప్రేక్షకులకు ఉల్లాసాన్ని కలిగించే వినోదాన్ని పంచేందుకు జీ తెలుగు సిద్ధమైంది. ప్రతి ఇంట్లోనూ అద్భుతమైన సినిమా అనుభూతిని అందించాలనే లక్ష్యంతో, ఈ వేసవిలో 'సమ్మర్ ఎంటర్టైన్మెంట్ బొనాంజా'ను అందిస్తోంది. ఇందులో భాగంగా, బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'అఖండ 2' వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ఏప్రిల్ 26వ తేదీ సాయంత్రం 6 గంటలకు మీ జీ తెలుగులో ప్రసారం కానుంది. 

బాలమురళీకృష్ణ (బాలకృష్ణ) కుమార్తె జనని (హర్షాలి మల్హోత్రా) సైంటిస్ట్. శత్రు దేశాలకు సంబంధించిన వ్యక్తులు ఇండియా పై దాడులు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల క్రమంలో దేశవ్యాప్తంగా ఒక్కసారిగా చోటుచేసుకున్న ఓ అనుకోని ఘటన కలకలం రేపుతుంది. పైగా ఆ ఘటన ప్రజల్లో దేవుడి పై నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తోంది. ఆ ఉద్రిక్త సంఘటనలను సృష్టించిన దుండగులపై అఖండ (బాలయ్య) ఎలా విరుచుకుపడ్డాడు ?, దేశాన్ని ఎలా కాపాడాడు ?, ప్రజల ప్రాణాలను ఎలా రక్షించాడు ?, అఖండ తల్లి కోరిక తీరిందా ? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే జీ తెలుగు వేదికగా ప్రసారమయ్యే అఖండ 2 చూడాల్సిందే!

ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ ద్విపాత్రాభినయంతో ప్రేక్షకులను మెప్పించారు. సింహా, లెజెండ్, అఖండ వంటి వరుస ఇండస్ట్రీ హిట్లతో రికార్డులు తిరగరాసిన నందమూరి బాలకృష్ణ - బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబో, అఖండ 2తో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మ్యూజిక్ సెన్సేషన్ ఎస్. థమన్ అందించిన సంగీతం, వెన్నులో వణుకు పుట్టించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ ఆధ్యాత్మిక యాక్షన్ విజువల్ వండర్‌కు ప్రాణం పోశాయి. హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా ‘అఖండ 2’ని ఈ ఆదివారం మీరూ తప్పకుండా చూసేయండి!

బాక్సాఫీస్ బ్లాక్బస్టర్ హిట్ అఖండ 2, ఈ ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు, మీ జీ తెలుగులో.. తప్పక చూడండి!

 

Advertisement
AkhandaBalakrishnaZee Telugu

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News