‘పరమపద సోపానం’ విజయం సాధించాలి: భీమినేని శ్రీనివాసరావు

Entertainment
Advertisement
అర్జున్ అంబటి హీరోగా ‘గణపర్తి శ్వేత’ సమర్పణలో ‘స్వయంభూ క్రియేషన్స్’ బ్యానర్‌పై గణపర్తి నారాయణరావు నిర్మించిన చిత్రం ‘పరమపద సోపానం’.  ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే అందిస్తూ నాగ శివ దర్శకత్వం వహించారు. తేలప్రోలు ప్రసన్న మరో నిర్మాత కాగా... పులగం సుప్రియ కూడా సహ నిర్మాతగా వ్యవహరించారు. జెన్నిఫర్ ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో కథా నాయికగా నటించింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏప్రిల్ 24న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు భీమనేని శ్రీనివాసరావు, వీర శంకర్, సముద్ర తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  ఈ ఈవెంట్‌లో..

ప్రముఖ దర్శకులు భీమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ..‘‘ప్రసన్న ఈ ‘పరమపద సోపానం’ చిత్రం గురించి నాకు చెప్పారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్‌లో జాయిన్ అవుతానని ప్రసన్న నా దగ్గరకు వచ్చాడు. ఓ మూవీకి కూడా పని చేశాడు. దర్శకుడిగా కంటే ప్రొడక్షన్ సైడ్ వెళ్తే, ప్రొడక్షన్ మేనేజర్‌గా వెళ్తే బాగుంటుందని సలహా ఇచ్చాను. ఇప్పుడు మంచి స్థాయిలోకి వచ్చాడు. ఈ చిత్రంతో కొత్త వారు తెరకు పరిచయం కాబోతోన్నారు. నాగ శివ గారికి మంచి విజయం దక్కాలి. అర్జున్, జెన్నీఫర్‌లకు మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ప్రముఖ దర్శకులు సముద్ర మాట్లాడుతూ .. ‘అచ్చ తెలుగులో ‘పరమపద సోపానం’ అని టైటిల్ పెట్టారు. ప్రసన్నతో నాకెన్నో ఏళ్ల నుంచి బంధం ఉంది. నాగ శివ తీసిన ఈ చిత్రం పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. అర్జున్ లుక్స్, యాక్టింగ్ అద్భుతంగా ఉంటుంది. అర్జున్ పెద్ద హీరో అవుతాడు. జెన్నిఫర్‌కి తెలుగులో మంచి భవిష్యత్తు ఉండాలి. దేవ్ గారు మంచి సంగీతాన్ని అందించారు. ఈ సినిమా జనాలు ఆదరించి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

ప్రముఖ దర్శకులు వీర శంకర్ మాట్లాడుతూ .. ‘పూరి గారి వద్ద పని చేయడం వల్ల శివకి సహనం ఎక్కువగా వచ్చినట్టుంది. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా సినిమాని ఇక్కడి వరకు తీసుకు వచ్చారు. ఫైనాన్షియల్ పరంగా నిర్మాతలు ఎప్పుడూ తెలివిగా ప్రవర్తించాలి. శివ తీసిన ఈ సినిమా మంచి విజయం సాధించాలి. అర్జున్ ప్రతీ ఫ్లాట్ ఫాం మీద తన సత్తాను చాటుకుంటూ వస్తున్నారు. ఆయన మరింత ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను. ఈశ్వర్ మంచి విజువల్స్ ఇస్తారు. దేవ్ గారు మంచి సంగీతం అందిస్తారు. ఏప్రిల్ 24న రాబోతోన్న ఈ సినిమాని అందరూ చూసి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

హీరో అర్జున్ అంబటి మాట్లాడుతూ .. ‘లెజెండరీ డైరెక్టర్స్ భీమనేని శ్రీనివాసరావు, వీర శంకర్, సముద్ర గారు మా ‘పరమపద సోపానం’ ఈవెంట్‌కి రావడం ఆనందంగా ఉంది. ఈ దర్శకులు తీసిన సినిమాల టికెట్ల కోసం చొక్కాలు చించుకున్న రోజుల నుంచి ఈ రోజు నా సినిమాకు వాళ్లు గెస్టులుగా రావడం ఆనందంగా ఉంది. ప్రసన్న, శివ, వీర శంకర్ గారి వల్లే ఈ చిత్రం ఇక్కడి వరకు వచ్చింది. దేవ్ అద్భుతమైన సంగీతాన్ని ఇచ్చారు. ఈశ్వర్‌తో నేను ఇది వరకు మూడు సినిమాలు చేశాను. రాంబాబు గారు మాకు మంచి పాటల్ని ఇచ్చారు. ‘పరమపద సోపానం’తో మేం మంచి ప్రయత్నం చేశాం. థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి నచ్చుతుంది. ఏప్రిల్ 24న మా సినిమా రాబోతోంది. అందరూ తప్పకుండా చూడండి’ అని అన్నారు.

దర్శకుడు నాగ శివ మాట్లాడుతూ .. ‘మా కోసం వచ్చిన భీమనేని శ్రీనివాసరావు గారు, వీర శంకర్ గారు, సముద్ర గారికి థాంక్స్. ఈ ప్రయాణంలో నాకు తోడుగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. అర్జున్ ఇచ్చిన సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. మా ఈ చిత్రం ఏప్రిల్ 24న రాబోతోంది. అందరూ చూసి తప్పకుండా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

నిర్మాత గణపర్తి నారాయణరావు మాట్లాడుతూ .. ‘శివ మా అబ్బాయి. హైదరాబాద్‌కి వచ్చి సెటిల్ అయ్యాడు. సినిమానే జీవితంగా మార్చుకున్నాడు. మా సినిమాకి సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా మూవీ మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

నిర్మాత తేలప్రోలు ప్రసన్న ఆంజనేయులు మాట్లాడుతూ .. ‘మా కోసం ఇక్కడకు వచ్చిన భీమనేని శ్రీనివాసరావు, వీర శంకర్, సముద్ర గారికి థాంక్స్. నేను ఈ రోజు ఎక్కువ మాట్లాడను. ఏప్రిల్ 24న మా చిత్రం రాబోతోంది. ఆ రోజు మాట్లాడతాను’ అని అన్నారు.
Advertisement
paramapadha sopanamarjun ambatiparampadha sopanam pre release

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News