'హే బల్‌వంత్‌' లో హిలేరియస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌తో థియేటర్లు ఊగిపోతున్నాయి: కమెడియన్‌ సుదర్శన్‌

Entertainment
Advertisement
ప్రామిసింగ్‌ కథానాయకుడు సుహాస్‌, శివానీ నాగారం జంటగా రూపొందిన హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ 'హే బల్‌వంత్‌'. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్‌ విజనరీ స్టూడియోస్‌ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. బన్నీవాస్‌, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్‌ ద్వయం  నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ  శుక్రవారం  ఈనెల 20న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల అభినందనలతో పాటు, విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ బ్లాక్‌బస్టర్‌ టాక్‌తో దూసుకపోతుంది. చిత్రంలో ఓ కీలకపాత్రలో నటించి తన నటనతో థియేటర్‌లో ఎంటర్‌టైన్‌మెంట్‌ను అందిస్తున్న కమెడియన్‌ సుదర్శన్‌ ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఆ విశేషాలివి. 

'హే బల్‌వంత్‌లో సుదర్శన్‌ 2.0 అంటున్నారు? 
సినిమాలో అంత మంచి క్యారెక్టర్‌ చేశాను. సినిమాకు చాలా క్రేజీ రెస్పాన్స్‌ వస్తోంది. నేను పోషించిన బంక పాత్రను ఆడియన్స్‌ బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. హిలేరియస్‌గా నవ్వుకుంటున్నారు. ఈ సినిమా ఆద్యంతం ఎంటర్‌టైనింగ్‌గా ఉందని మంచి ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమాలో పోషించిన పాత్రకు మంచి పేరొచ్చింది. 

సినిమాల్లోకి మీ ఎంట్రీ ఎలా జరిగింది? 
అమెరికాకు దారేది అనే షార్ట్‌ ఫిల్మ్‌లో నటించాను. దానికి అనుకోకుండా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ షార్ట్‌ఫిల్మ్‌తో రన్‌రాజా రన్‌ ఆఫర్‌ వచ్చింది. ఆ తరువాత దోచెయ్‌, కుమారి 21ఎఫ్‌, పటాస్‌, సమాజవరగమన, నారీ నారీ నారి నడుమ మురారి, ఇప్పుడు హే బల్‌వంత్‌ సినిమాలు నన్ను ప్రేక్షకులకు చేరువ చేశాయి.  

గత సినిమాలతో పోలీస్తే ఈసినిమాలో ఎక్కువగా మీ పంచ్‌లు బాగా పేలినట్టున్నాయి? 
ఈ చిత్రంలో నా పాత్రకు ఇంపార్టెన్స్‌ వల్ల పాత్ర బాగా ఎలివేట్‌ అయ్యింది. డ్రింకింగ్‌ సీన్‌, వెన్నెల కిపోర్‌తో చేసిన ప్రకృతి చికిత్సాలయం సీన్స్‌కు థియేటర్స్‌కు ఊగిపోతున్నాయి. నా ప్రతి పంచ్‌తో పాటు సినిమాలో వెన్నెల కిషోర్‌, సుహాస్‌, నరేష్‌, సుహానీ అందరూ హిలేరియస్‌గా నవ్వించారు. 

ఈ సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇంతగా ఆకట్టుకోవడానికి రీజన్‌ ఏమిటని అనుకుంటున్నారు? 
ఈ సినిమాలో నటించిన అందరితో నాకు అందరితో మంచి ర్యాపో ఉంది. ప్రతి సీన్‌కు అందరం మంచి సింక్‌లో ఉన్నాం. అందరూ క్లోజ్‌నెస్‌తో ఫ్లోతో సీన్‌లు బాగా వచ్చాయి

మీకు హీరోగా ఆఫర్లు వస్తున్నాయని తెలిసింది? 
నేను హీరోగా వెండితెరపై ఇప్పుడే చేయను. అనుకోకుండా సినీ పరిశ్రమకు  వచ్చాం. కమెడియన్‌గా ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నాను. ఈ టైమ్‌లో రిస్క్‌ తీసుకోలేను. కమెడియన్‌గా నాకు అందరి హీరోలతో కలిసి సినిమాలు చేయాలని వుంది. నటుడిగా సెటిల్‌ అయిపోయిన తరువాత హీరోగా  ఆలోచిద్దాం. ఒకవేళ హీరోగా చేస్తే చిన్న చిన్న కాన్సెప్ట్‌లతో చేసే ఓటీటీ సినిమాలు చేస్తాను. 

ఇంతకు ముందు కమెడియన్స్‌ అంతా హీరోలుగా చేశారు కదా? 
హాస్య నటులుగా తమకంటూ ఓ గుర్తింపు వచ్చిన తరువాత వాళ్లు హీరోలుగా చేశారు. నా కెరీర్‌ ఇప్పుడే ఊపందుకుంటోంది. ఈ సమయంలో అలాంటి ఆలోచన లేదు. ఒకవేళ నేను హీరోగా చేయాలంటే అది హీరోలు చేయలేని చిన్న చిన్న కాన్సెప్ట్‌లు చేయలేని సినిమాలు చేయాలి. 
 థియేటర్స్‌లో రిలీజ్‌ అయ్యే మెయిన్‌ లీడ్‌ సినిమాలు చేయాలని లేదు. 

హీరోగా చేస్తే కమెడియన్‌గా అవకాశాలు తగ్గిపోతాయని అనుకుంటున్నారా? 
ఇందులో నిజం లేకపోలేదు. ఎందుకంటే ఒక సినిమాలో హీరోగా చేసిన తరువాత మనకు వేరే సినిమాలో చిన్న చిన్న పాత్రలు ఇవ్వకూడదని, చిన్న పాత్రలు ఇస్తే బాగుండదని కొంత మంది భావించడంతో మనకు అవకాశాలు తగ్గిపోతాయి. ఇలా మనకు తెలియకుండానే కొన్ని మంచి సినిమాల్లో చేసే అవకాశాలు మిస్ అయ్యే చాన్స్‌ ఉంటుంది.


సినిమాల్లో కమెడియన్స్‌ అంటే మీ మీద మీరే పంచ్‌లు వేసుకోవాలి? ఈ విషయంలో మీరు ఎలా ఉంటారు?  
నా మీదే నేను పంచ్‌లు వేసుకుంటాను. నాకు అలాంటి పట్టింపు లేదు. ఫైనల్‌గా ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడమే ముఖ్యం. దాని కోసం ఎలాంటి పాత్రలైనా చేస్తాను. 

బిజీగా ఉండటం వల్ల కొన్ని సినిమాలు వదులుకుంటున్నారా? 
ప్రస్తుతానికి బిజీగానే ఉన్నాను. కొన్ని సార్లు మంచి సినిమాలు కూడా వదులుకోవాల్సి ఉంది. కేవలం డేట్స్‌ క్లాష్‌ వల్ల దగ్గరికి వచ్చి పోతుంటాయి. తమిళంలో, కన్నడంలో కూడా ఆపర్లు వచ్చాయి. 

హే బల్‌వంత్‌ బిజినెస్‌ను విడుదలకు ముందు  ఎవరైనా కనిపెట్టి చెప్పారా?
విడుదలకు ముందు రోజు కూడా చాలా మంది కలిశారు. చాలా మంది రాంగ్‌ చెప్పారు. ఎవరూ  కూగా గెస్‌ చేయలేకపోయారు. కొంత మంది తెలసిన కూడా బయటికి చెప్పలేదు. 


నటుడిగా మీకు మీరు చేసే పాత్రలు సంతృప్తినిస్తున్నాయా? 
శాటిస్‌ఫాక్షన్‌ ఉంది కాబట్టి, ఈ మధ్య కాలంలో సమాజవరగమన, పాంచ్‌మినార్‌, కిష్కిందపురి సినిమాలు మంచి పేరు తెచ్చాయి. నారీ నారీ నడుమ మురారి, ఇప్పుడు హే బల్‌వంత్‌ సినిమాలు నాకు మంచి పేరును తీసుకొచ్చాయి. 

మీ తదుపరి చిత్రాలు? 
మృత్యుంజయతో పాటు, గొదావరి గట్టు మీద లో కూడా మంచి పాత్రలు చేశాను. త్వరలోనే అవి విడుదల కానున్నాయి.వీటితో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తున్నాను. 



Advertisement
Sudarshan interviewHay BalwanthComedian SudarshanTollywood

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News