జడ్జి ప్యానల్లోకి రఘు మాస్టర్, స్పెషల్ గెస్ట్లుగా రంభ, అనిల్ రావిపూడి, లావణ్య త్రిపాఠి.. జీ తెలుగు ఆట డాన్స్ షో స్పెషల్ ఎపిసోడ్స్, ఈ శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు!

హైదరాబాద్, 20 ఫిబ్రవరి 2026: జీ తెలుగుతెలుగు వినోద రంగంలో అగ్రగామి ఛానెల్‌గా ఎప్పుడూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. వినూత్నఉత్కంఠభరితమైన కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఇటీవలే ఆట డాన్స్ రియాలిటీ షో సరికొత్త సీజన్ని ఘనంగా ప్రారంభించింది. కొత్త మలుపులుస్టార్ గెస్ట్‌లుఅద్భుత ప్రదర్శనలతో ఈ సీజన్‌ ప్రేక్షకులను మరింత ఆకట్టుకుంటోంది. ఈ వారం మరిన్ని ట్విస్ట్లుసర్ప్రైజ్లతో వచ్చేస్తున్న ఆట డాన్స్ షో ప్రతి శనిఆదివారాలు రాత్రి 9 గంటలకుమీ జీ తెలుగులో.. టీవీ ప్రసారానికి 48 గంటల ముందే గురుశుక్రవారాల్లో జీ5లో కొత్త ఎపిసోడ్‌లు అందుబాటులో ఉంటాయి!

ఆట సరికొత్త సీజన్కి ఎనర్జిటిక్ యాంకర్ సుధీర్ వాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఆట టైటిల్ కోసం నలుగురు మెంటర్స్ కావ్యవిష్ణుప్రియవంశీసమీరా భరద్వాజ్ మార్గదర్శకత్వంలో 16 మంది ప్రతిభావంతులు పోటీపడుతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి రాధికా శరత్కుమార్,మెగా డాటర్ నిహారికా కొణిదెలతో కూడిన జడ్జ్ ప్యానల్లో ఈ వారం నుంచి ప్రముఖ కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్ కూడా చేరుతున్నారు. అంతేకాదుఈ వారం ప్రేక్షకులకు మరిన్ని సర్ప్రైజ్లు ఉండనున్నాయి. 

మెగా కోడలు లావణ్య త్రిపాఠి ఆట షోలో సందడి చేయనున్నారు. సీనియర్ హీరోయిన్ రంభ ఈ వారం స్పెషల్ జడ్జిగా వ్యవహరించనున్నారు. హిట్ మెషిన్ అనిల్ రావిపూడి కూడా ఈ వారం షోకి స్పెషల్ గెస్ట్గా హాజరై ప్రేక్షకులను అలరించనున్నారు. ఈ వారం ఎపిసోడ్లలో ఉత్కంఠభరితమైన పోటీఅద్భుతమైన ప్రదర్శనలతోపాటు కామెడీ పంచ్లుసరదా సంభాషణలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి. ఈ వారాంతం ఎపిసోడ్స్ని మీరూ మిస్ కాకుండా చూసేయండి!

ఈవారం సరికొత్త ట్విస్ట్లతో జీ తెలుగు ఆట డాన్స్ రియాలిటీ షో.. ప్రతి శనిఆదివారం రాత్రి 9 గంటలకుడోంట్ మిస్!


More Press Releases