ప్రతిభను వెలికితీసే అద్భుతమైన వేదిక జీ తెలుగు ఆట కొత్త సీజన్ ఫిబ్రవరి 7న ప్రారంభం, ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు.. టీవీ కంటే 48 గంటల ముందుగానే ఫిబ్రవరి 5న జీ5లో!

హైదరాబాద్04 ఫిబ్రవరి 2026: తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త కార్యక్రమాలని అందిస్తూ వినోదం పంచుతున్న జీ తెలుగు ప్రతిభావంతులను వెలుగులోకి తీసుకురావడంలోనూ ముందుంటుంది. తెలుగు టెలివిజన్ చరిత్రలో అత్యంత ఆదరణ పొందిన డాన్స్ రియాలిటీ షో జీ తెలుగు ‘ఆట’. ఈ కార్యక్రమంతో ఎందరో ప్రతిభావంతులైన డాన్సర్లను వెలుగులోకి తీసుకొచ్చిన జీ తెలుగు ఆట సరికొత్త సీజన్తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. బుల్లితెర పాపులర్ డాన్స్ షో ‘ఆట’ సరికొత్త సీజన్ ఫిబ్రవరి 7న ప్రారంభంప్రతి శనిఆదివారాల్లో రాత్రి 9 గంటలకుమీ జీ తెలుగులో మాత్రమే!

ఎందరో ప్రతిభావంతులను వెండితెరకు పరిచయం చేసిన ఆట సరికొత్త సీజన్కి ఎనర్జిటిక్ యాంకర్ సుధీర్ వాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఆట టైటిల్ కోసం నలుగురు మెంటర్స్ కావ్యవిష్ణుప్రియవంశీసమీరా భరద్వాజ్ మార్గదర్శకత్వంలో 16 మంది ప్రతిభావంతులు పోటీపడనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటి రాధికా శరత్కుమార్కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్మెగా డాటర్ నిహారికా కొణిదెల న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. 

ఆట సరికొత్త సీజన్ ప్రారంభ ఎపిసోడ్లో అద్భుతమైన ప్రదర్శనలతో కంటెస్టెంట్స్ పోటీపడనున్నారు. ఇటీవల బ్లాక్బస్టర్ హిట్ సాంగ్స్ ‘సూసేకి అగ్గిపుల్ల’, ‘చుట్టమల్లే’, ‘గిర గిర గిర’ వంటి పాటలకు అద్భుతమైన కొరియోగ్రఫీతో కంటెస్టెంట్లుమెంటర్లు డాన్స్ చేసి అలరించనున్నారు. అంతేకాదుయాంకర్ సుధీర్ ప్రస్థానంపై కంటెస్టెంట్ అక్షత ప్రదర్శన అందరినీ ఆకట్టుకోనుంది. కొరియోగ్రాఫర్గా రాణిస్తున్న రాప్టర్ యువరాజ్ కంటెస్టెంట్గా ఆట టైటిల్ పోరులో దిగనున్నారు. అద్భుతమైన ప్రదర్శనలుభావోద్వేగ క్షణాలతో ఆద్యంతం ఆసక్తికరంగా సాగనున్న ఈ కార్యక్రమం ప్రేక్షకులను అలరించేందుకు జీ తెలుగు వేదికగా ప్రసారం కానుంది.   

పోటాపోటీగా సాగే ఆట టైటిల్ సమరం ఫిబ్రవరి 7న ప్రారంభంప్రతి శనిఆదివారాల్లో రాత్రి 9 గంటలకుమీ జీ తెలుగులో.. తప్పక చూడండి!


More Press Releases