"రణబాలి" "రౌడీ జనార్థన" చిత్రాలతో పాన్ ఇండియా స్థాయిలో అలరించనున్న విజయ్ దేవరకొండ

హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది రెండు ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఆయన నటిస్తున్న "రణబాలి", "రౌడీ జనార్థన" సినిమాలు ఇప్పటికే మూవీ లవర్స్ లో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి. వీడీ ఫ్యాన్స్ కు కూడా 2026 ఒక  మెమొరబుల్ ఇయర్ కాబోతోంది. "రణబాలి", "రౌడీ జనార్థన" సినిమాలు రెండూ ప్రెస్టీజియస్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కావడం విశేషం. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో "రణబాలి" సినిమాను దర్శకుడు రాహుల్ సంకృత్యన్ ప్యాషనేట్ గా రూపొందిస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ పై ఆయన పూర్తి నమ్మకంతో ఉన్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన టైటిల్ అనౌన్స్ మెంట్ గ్లింప్స్ కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. 

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న తాను రూపొందిస్తున్న "రౌడీ జనార్థన" సినిమాకు బ్లాక్ బస్టర్ ప్రామిస్ ఇస్తున్నారు దర్శకుడు రవికిరణ్ కోలా. ఈ యంగ్ డైరెక్టర్ కు డ్రీమ్ ప్రాజెక్ట్ ఇది. "రౌడీ జనార్థన" టీజర్ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. భిన్నమైన కథా నేపథ్యాలతో తెరకెక్కుతున్న "రణబాలి", "రౌడీ జనార్థన" చిత్రాల్లో విజయ్ దేవరకొండ అంతే వైవిధ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. సెప్టెంబర్ 11న "రణబాలి", డిసెంబర్ లో "రౌడీ జనార్థన" సినిమాలు థియేటర్స్ లో సందడి చేయబోతున్నాయి

More Press Releases