సుడిగాలి సుధీర్ G.O.A.T (గోట్) చిత్రం నుంచి రైజ్‌ ఆఫ్‌ గణ లిరికల్‌ వీడియో సాంగ్‌ విడుదల

ప్రముఖ హాస్యనటుడు సుడిగాలి సుధీర్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం G.O.A.T  (గోట్) GreatestOfAllTimes అనేది ఉపశీర్షిక.  దివ్యభారతి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి వేదవ్యాస్‌ దర్శకుడు.   మహాతేజ క్రియేషన్స్ అండ్ జైష్ణ‌వ్ ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి చంద్రశేఖర్ రెడ్డి మొగుళ్ళ నిర్మాత‌.  ప్రస్తుతం నిర్మాణానంతర పనులను జరుపుకుంటోన్న ఈ చిత్రం ఫిబ్రవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ చిత్రం నుంచి వచ్చిన టీజర్‌కు, సాంగ్స్‌కు అనూహ్య రెస్పాన్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి  రైజ్‌ ఆఫ్‌ గణ అనే  లిరిక‌ల్ వీడియోను సోమవారం విడుద‌ల చేసింది చిత్ర‌యూనిట్‌. 

ఇటీవల సీఎమ్‌ఆర్‌ ఇంజనీరింగ్‌ కళాళాలలో జరిగిన ఓ ఈవెంట్‌లో ఈ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. లియోన్‌ జేమ్స్‌ సంగీతం అందించిన ఈ పాటకు కాసర్ల శ్యామ్‌ సంగీతం అందించారు. చిత్రంలో హీరో క్యారెక్టరైజేషన్‌ను తెలిపే విధంగా ఎంతో పవర్‌ఫుల్‌ మాస్‌గా ఈ సాంగ్‌గా ఉండబోతుంది. పాటలో ఉన్న విజువల్స్‌, సాహిత్యం కూడా అందర్ని ఆకట్టుకుంటుంది.   నిర్మాత మాట్లాడుతూ  ప్ర‌స్తుతం నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఖర్చు విషయంలో ఎక్కడా రాజీపడకుండా చాలా రిచ్‌గా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. టెక్నికల్‌గా కూడా చిత్రం ఉన్నతస్థాయిలో వుంటుంది. సుడిగాలి సుధీర్  కెరీర్‌లో ఈ చిత్రం మైల్‌స్టోన్‌గా నిలుస్తుంది. ఈరోజు విడుదల చేసిన ఈ పాట కూడా ఎంతో రిచ్‌గా ఉంటుంది. సినిమా ఆద్యంతం ప్రతి ఫ్రేమ్‌ ఎంతో అద్భుతంగా ఉంటుంది. చిత్రం తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు.  

సుడిగాలి సుధీర్‌, దివ్యభారతి, సర్వధమన్‌ బెనర్జీ, నితిన్‌ ప్రసన్న, బ్రహ్యాజీ, పృథ్వీ, ఆడుకాలం నరేష్‌, రాజేంద్రన్‌, ఆనంద్‌ రామరాజ్‌, చమ్మక్‌ చంద్ర, పమ్మీ సాయి, నవీన్‌ నేని, తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి

ఈ చిత్రానికి సంగీతం: లియోన్ జేమ్స్, నేపథ్య సంగీతం: మణిశర్మ,  డీఓపీ: ర‌సూల్ ఎల్లోర్‌, ఆడిషనల్‌ డీఓపీ: సన్నీ కూరపాటి, ఎడిటర్‌: విజయ్‌ ముక్తవరపు,  ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ : రాజీవ్ నాయర్, , కో ప్రొడ్యూస‌ర్‌: సమైరా రెడ్డి.ఎన్‌, క్రియేటివ్ ప్రొడ్యూస‌ర్‌:  ప్ర‌సూన మండ‌వ‌, దర్శకత్వం: వేదవ్యాస్‌, నిర్మాత: చంద్రశేఖర్‌ మొగుళ్ళ


More Press Releases