మార్గదర్శి శైలజా కిరణ్ పూజాపీఠానికి 'శ్రీమాలిక': బొల్లినేని కృష్ణయ్య విశేష ఆధ్యాత్మిక సేవ!

మంత్ర శక్తులు, పరమాద్భుత నృసింహ ఆవిర్భావ ఘట్టం వంటి మంత్ర రహస్యాల సమాహారంగా ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ తీర్చిదిద్దిన ‘శ్రీమాలిక’ గ్రంథం తెలుగు రాష్ట్రాల్లో ఆధ్యాత్మిక సంచలనం సృష్టిస్తోంది. ఈ అద్భుత రచనను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కిమ్స్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన సౌజన్యం, పురాణపండ శ్రీనివాస్ నిర్విరామ కృషిపై పీఠాధిపతులు, సాహిత్యవేత్తల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.

ఇటీవల జూబిలీహిల్స్ రామాలయంలో జరిగిన ఒక పవిత్ర కార్యక్రమంలో మార్గదర్శి గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీమతి శైలజా కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొల్లినేని కృష్ణయ్య ఆమెకు ‘శ్రీమాలిక’ గ్రంథాన్ని పరమ సంతోషంతో అపురూప జ్ఞాపికగా బహూకరించారు. ఇదే క్రమంలో అక్కడి వేదపాఠశాల పండితులకు, విద్యార్థులకు కూడా ఈ దివ్య గ్రంథాలను అందజేశారు. ఇటీవల హైదరాబాద్ బుక్ ఫెయిర్‌లో సైతం మేధావి వర్గాన్ని ఈ పుస్తకం విశేషంగా ఆకట్టుకోవడం విశేషం.

     
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అపారమైన గౌరవంతో పాటు, ఉపముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ అందిస్తున్న సేవలను గుర్తిస్తూ.. వీరిద్దరి చిత్రాలను శ్రీమాలిక వెనుక ముద్రించారు. ఈ ప్రతులను అమరావతిలోని ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులకు, ఉన్నతాధికారులకు బొల్లినేని వేల సంఖ్యలో పంపిణీ చేశారు. అలాగే చంద్రబాబు, భువనేశ్వరి దంపతుల చిత్రాలతో కూడిన ప్రతులను తిరుపతి, కుప్పం, నెల్లూరు, విజయవాడ, విశాఖ, శ్రీశైలం వంటి ప్రాంతాల్లోని తెలుగుదేశం శ్రేణులకు ఉచితంగా అందజేశారు.

టీడీపీ చరిత్రలో ఒక ఆధ్యాత్మిక గ్రంథాన్ని వేలాదిమంది కార్యకర్తల పూజా పీఠాలకు చేర్చిన ఘనత బొల్లినేని కృష్ణయ్యకే దక్కుతుందని అగ్రనేతలు అభినందిస్తున్నారు. నారా భువనేశ్వరి గారి పర్యవేక్షణలో కూడా కొన్ని ముఖ్య సమావేశాల్లో ఈ పుస్తకాలను పంచడం విశేషం. ముఖ్యమంత్రి కార్యాలయంలో సైతం మంత్రులు, ప్రముఖులు నిత్యం ఈ గ్రంథాలను వీక్షించడం దీని ప్రాముఖ్యతను చాటుతోంది. గతంలో హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా తన నియోజకవర్గంలోని పలు కార్యాలయాలకు ఈ పుస్తకాలను అందజేశారు.

ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా దైవీయ స్పృహతో సంచరిస్తూ, ఆర్ష గ్రంథాల ద్వారా రుషుల పరంపరను కాపాడుతున్న పురాణపండ శ్రీనివాస్ కృషి అమోఘం. ఆయన తానే ఒక మంత్రాక్షరంగా మారి దైవబలంతో ఈ గ్రంథాలను వెలుగులోకి తెస్తున్నారు. బొల్లినేని కృష్ణయ్య చేసిన వైద్య సేవలు ఒక ఎత్తయితే, శ్రీమాలిక ద్వారా ఆయన చేస్తున్న ఈ నిస్వార్థ ఆధ్యాత్మిక సేవ చరిత్రలో నిలిచిపోతుందని తెలుగుదేశం శ్రేణులు ముక్తకంఠంతో కొనిాడుతున్నాయి.

   

More Press Releases