ఆది సాయికుమార్ నటించిన ‘శంబాల’.. ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో!
హైదరాబాద్, 05 మార్చి 2026: వారం వారం సూపర్ హిట్ సినిమాలను అందిస్తున్న జీ తెలుగు ఈ ఆదివారం మరో బ్లాక్బస్టర్ హిట్ సినిమాతో వచ్చేస్తోంది. ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్ నటించిన మిస్టికల్ థ్రిల్లర్ శంబాల థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకుని బ్లాక్బస్టర్ హిట్గా నిలిచింది. యుగంధర్ ముని దర్శకత్వంలో సైన్స్, చరిత్ర ఆధారంగా రూపొందిన సైంటిఫిక్ థ్రిల్లర్ శంబాల వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ మార్చి 8, ఆదివారం సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో!
1980లో ఒక ఉల్క ‘శంబాల’ అనే ఊరిలో పడుతుంది. దాని మీద రీసెర్చ్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ విక్రమ్ (ఆది సాయికుమార్) ను ఆ ఊరికి పంపుతుంది. విక్రమ్ ఆ ఊరికి వచ్చే సమయానికి, ఊరంతా ఏకమై ఒక ఆవుని చంపడానికి సిద్ధమవుతారు. ఊరందరినీ వారించి ఆవుని కాపాడతాడు విక్రమ్. ఆ తరువాత ఆ ఊరిలో వరుస హత్యలు జరుగుతూ వస్తాయి. అసలు శంబాల అనే ఊరికి ఏమైంది? అసలు వరుస హత్యలు ఎందుకు జరుగుతాయి? ఉల్క కారణంగానే ఆ ఊరిలో ఈ హత్యలు జరిగాయా? చివరికి విక్రమ్ ఆ ఊరి వారందరినీ ఆ హత్యల బారి నుంచి ఎలా కాపాడాడు? అనేది తెలియాలంటే జీ తెలుగు వేదికగా ప్రసారమయ్యే శంబాల సినిమా చూడాల్సిందే!
ఆది సాయి కుమార్, అర్చన ఐయర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో స్వాసిక విజయ్, మధునందన్, రవి వర్మ, మీసాల లక్ష్మణ్, శిజు మేనన్, హర్ష వర్ధన్, శివ కార్తిక్, శైలజా ప్రియ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నమ్మకం, ద్రోహం, కుట్రల మధ్య ఉత్కంఠగా సాగే ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుంది.
ఉత్కంఠగా సాగే కథ, కథనంతో ప్రేక్షకులను మెప్పించిన బ్లాక్బస్టర్ సినిమా శంబాల.. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు! మన జీ తెలుగులో, తప్పక చూడండి!