రవితేజ కోసమే మాస్ జాతర కథ రాశాను

Entertainment
Advertisement
హీరో రవితేజ 75వ చిత్రం 'మాస్ జాతర'. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య  నిర్మించారు.  భాను భోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. రవితేజ, శ్రీలీల, నవీన్ చంద్ర ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. అక్టోబర్ 31వ తేదీ సాయంత్రం ప్రత్యేక ప్రదర్శనలతో థియేటర్లలో అడుగుపెట్టనున్న 'మాస్ జాతర' చిత్రం కోసం మాస్ మహారాజా అభిమానులతో పాటు తెలుగు సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూస్తున్నారు.  తాజాగా మీడియాతో ముచ్చటించిన దర్శకుడు భాను భోగవరపు, సినిమాకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

మాస్ జాతర ఎలా ఉండబోతుంది? ఏమైనా ప్రత్యేకతలు ఉన్నాయా?
ఇందులో మాస్ అంశాలు ఉంటాయి. అదే సమయంలో ఒక కొత్త పాయింట్ కూడా ఉంటుంది. రైల్వే పోలీస్ నేపథ్యంలో ఈ కథ జరుగుతుంది. ఆ నేపథ్యంలో జరిగే క్రైమ్ కొత్తగా ఉంటుంది. సన్నివేశాలు కూడా కొత్తగా ఉంటాయి. 'మాస్ జాతర' అనే టైటిల్ రవితేజ గారే చెప్పారు. కథ విన్న తర్వాత వినోదంతో పాటు అన్ని అంశాలు బాగున్నాయి అంటూ ఆయన ఈ టైటిల్ సూచించారు. ఆ టైటిల్ తర్వాత నాపై బాధ్యత మరింత పెరిగింది. మాస్ అంశాలు మరిన్ని జోడించాను. థియేటర్ లో ప్రేక్షకులు కొన్ని సర్ ప్రైజ్ లు చూడబోతున్నారు. 

ఏదైనా ప్రేరణతో ఈ రైల్వే పోలీస్ కథను రాసుకున్నారా?
ఇది కల్పిత కథే. అయితే ఈ కథ కోసం ఎంతో రీసెర్చ్ చేశాను. పలువురు రైల్వే పోలీస్ అధికారులను కలిసి వారి అధికారాల గురించి, వారు ఎదుర్కొన్న సంఘటల గురించి తెలుసుకున్నాను. వాటి స్ఫూర్తితో ఈ కథకు తగ్గట్టుగా కొన్ని సన్నివేశాలు రాసుకోవడం జరిగింది.

రవితేజ గారి 75వ చిత్రానికి దర్శకత్వం వహించడం ఎలా అనిపించింది?

ఇది రవితేజ గారి 75వ చిత్రమని మాకు ముందు తెలియదు. రవితేజ గారికి కథ నచ్చి, సినిమా ఓకే అయిన తర్వాత.. అప్పుడు లెక్కేస్తే 75వ సినిమా అని తెలిసింది. కథ బాగుంది, ఈ నెంబర్ల గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా సినిమా చేయమని రవితేజ గారు నన్ను ఎంతో ప్రోత్సహించారు.

నవీన్ చంద్ర గారి పాత్ర గురించి?
శివుడు అనే శక్తివంతమైన ప్రతినాయక పాత్ర పోషించారు. ఈ పాత్ర కోసం మొదట వేరే ఇద్దరు ముగ్గురు నటుల పేర్లు కూడా పరిశీలించాము. కానీ, సంతృప్తి లేదు. అలాంటి సమయంలో నవీన్ చంద్ర గారిని కలిసి కథ వినిపించాను. ఆయనకు కథ నచ్చి సినిమా చేయడానికి అంగీకరించారు. నవీన్ గారు గొప్ప నటుడు, అందులో సందేహం లేదు. అయితే ఈ పాత్రలో ఎలా ఉంటారనే ఉద్దేశంతో ప్రత్యేక మేకోవర్ చేసి, ఫోటోషూట్ చేయడం జరిగింది. ఆ లుక్ నిర్మాత నాగవంశీ గారితో సహా అందరికీ నచ్చింది. శివుడు పాత్రకు నవీన్ చంద్ర గారు పూర్తి న్యాయం చేశారు. సినిమా విడుదలైన తర్వాత శివుడు పాత్ర గురించి అందరూ ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు.

శ్రీలీల పాత్ర గురించి ఏం చెబుతారు ? 
ఇందులో తులసి పాత్ర కోసం వేరే ఏ హీరోయిన్ పేరు మేము అనుకోలేదు. కథ రాస్తున్నప్పుడు నేను, కథ వింటున్నప్పుడు హీరో గారు, నిర్మాతలు మాకు తెలియకుండానే.. హీరోయిన్ శ్రీలీల గారు అని అనుకున్నాం. ధమాకా జోడి కాబట్టి శ్రీలీల గారిని తీసుకోవాలనే ఆలోచన మాకు లేదు. తులసి పాత్ర అనగానే మా అందరికీ శ్రీలీల గుర్తుకొచ్చారు. ఆమె పాత్రకు సినిమాలో ఎంతో ప్రాధాన్యముంది. గత చిత్రాలతో పోలిస్తే ఇందులో శ్రీలీల గారు కొత్తగా కనిపిస్తారు. గ్యాంగ్ లీడర్ లో చిరంజీవి గారు-విజయశాంతి గారి మధ్య సన్నివేశాలు ఎలాగైతే కామెడీ టచ్ తో మాసీగా ఉంటాయో.. ఇందులో రవితేజ గారు-శ్రీలీల గారి మధ్య సన్నివేశాలు అలా ఉంటాయి.

రచయితగా కామెడీలో మంచి ముద్ర వేసిన మీరు, దర్శకుడిగా మాస్ సినిమాతో పరిచయమవ్వడానికి కారణం?
మాస్ జాతరలో కూడా వినోదానికి పెద్ద పీట వేశాము. అదేవిధంగా మాస్ అంశాలు కూడా పుష్కలంగా ఉంటాయి. నిజానికి 'సామజవరగమన' లాంటి రొమాంటిక్ కామెడీ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవ్వాలనుకున్నాను. అయితే ఎక్కువమంది మంచి మాస్ కథ ఉంటే చెప్పు అనేవారు. అలా 'మాస్ జాతర' కథ రాయడం జరిగింది. మాస్ కథ అంటే మొదట గుర్తుకొచ్చే పేరు రవితేజ గారు. ఆయనను దృష్టిలో పెట్టుకునే ఈ కథ రాశాను. రవితేజ గారు పోలీస్ సినిమాలు కొన్ని చేశారు. అందుకే కొత్తగా ఉండేలా ఈ రైల్వే పోలీస్ కథని రాసుకున్నాను.

రవితేజ గారు ఖాకీ డ్రెస్ వేస్తే విక్రమార్కుడు సినిమాతో పోల్చడం సహజం.. ఆ ఒత్తిడి ఏమైనా మీపై ఉందా?

నేను రవితేజ గారికి అభిమానిని. ఆయన ఖాకీ డ్రెస్ వేసిన సినిమాలు ఎంతటి విజయాన్ని సాధించాయో తెలుసు. దానిని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను.

ట్రైలర్ లో రవితేజ గారి వెంకీ, ఇడియట్ సినిమాల రిఫరెన్స్ లు కనిపించాయి.
రవితేజ గారి ఐకానిక్ మూమెంట్స్ ని సెలబ్రేట్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఆ రిఫరెన్స్ లు పెట్టడం జరిగింది. అలా అని అవి కథకి అడ్డుగా ఉండవు. అభిమానులు సెలబ్రేట్ చేసుకునేలా ఉంటాయి.

మాస్ జాతర గురించి ప్రేక్షకులకు ఒక మాట చెప్పమంటే ఏం చెప్తారు?
రవితేజ గారి సినిమా నుండి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలు ఉంటూనే 'మాస్ జాతర' చిత్రం కొత్తగా ఉంటుంది. హాస్య సన్నివేశాలు, యాక్షన్ సన్నివేశాలను కొత్తగా రూపొందించాము.

తదుపరి ప్రాజెక్ట్ లు?
రచయితగా కొన్ని సినిమాలు చేస్తున్నాను. అలాగే, దర్శకుడిగా రెండో సినిమా కోసం కథ సిద్ధం చేస్తున్నాను. పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తాను.
Advertisement
Bhanu BhogavarapuMass jatharaMass JatharaTollywoodRavitejaSri leelaNaga vamshi

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News