సంతాన ప్రాప్తిరస్తు సినిమా కాంటెంపరరీగా ఉంటూ ఎంటర్ టైన్ చేస్తుంది

Entertainment
Advertisement
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న సినిమా "సంతాన ప్రాప్తిరస్తు". ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ పై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. రచయిత షేక్ దావూద్ జి ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించారు. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా నవంబర్ 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో ఈ సినిమా నుంచి తెలుసా నీ కోసమే లిరికల్ సాంగ్ ను ప్రొడ్యూసర్ సురేష్ బాబు అతిథిగా రిలీజ్ చేశారు. 

ప్రొడ్యూసర్ మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ - అత్యధిక జనాభా ఉన్న మన దేశంలో పెద్ద సంఖ్యలో ఫర్టిలిటీ సెంటర్స్ ఉన్నాయి. ఈ పాయింట్ నుంచే కథ మొదలైంది. పిల్లలు పుట్టకపోవడం అనేది బిజీ లైఫ్ లో ఉన్న సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ గానీ ఇతర ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ల జీవితాల్లో పెద్ద సమస్యగా మారింది. గత కొన్నేళ్లుగా మన సొసైటీలో ఈ సమస్యను చూస్తున్నాం. ఈ పాయింట్ తో "సంతాన ప్రాప్తిరస్తు" సినిమాను ఎలాంటి వల్గారిటీ లేకుండా మంచి ఫన్, ఎంటర్ టైన్ మెంట్ తో ఫ్యామిలీ అంతా చూసేలా రూపొందించాం. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా కాంటెంపరరీగా ఉంటూ ఎంటర్ టైన్ చేస్తుంది, ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకం ఉంది. తెలుసా నీ కోసమే బ్యూటిఫుల్ సాంగ్, కథలోనుంచి వచ్చిన పాట ఇది. తప్పకుండా ఛాట్ బస్టర్ అవుతుంది.అన్నారు.

డైరెక్టర్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ - ఈ రోజు సమాజంలో కపుల్స్ ఎదుర్కొంటున్న సమస్య నేపథ్యంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. అయితే ఎక్కడా సందేశాలు ఇచ్చేలా సినిమా ఉండదు. ఫన్, ఎంటర్ టైన్ మెంట్ తో లైటర్ వేన్ లో మూవీ వెళ్తుంటుంది. మా ప్రొడ్యూసర్స్ శ్రీధర్ గారు, నిర్వి హరిప్రసాద్ గారు మూవీకి కావాల్సిన ఆర్టిస్టులతో పాటు ప్రొడక్షన్ పరంగా కావాల్సినవన్నీ ఇచ్చి సపోర్ట్ చేశారు. మా హీరో విక్రాంత్ మూవీలో కంటే బయటే అందంగా ఉంటాడు ఎందుకంటే మా సినిమాలో అతను సాప్ట్ వేర్ ఇంజినీర్. వాళ్లు ఎలా కనిపిస్తారో అలా విక్రాంత్ మేకోవర్ ఉంటుంది. అన్నారు.

హీరో విక్రాంత్ మాట్లాడుతూ - "సంతాన ప్రాప్తిరస్తు" కథ విన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. ఈ కథలో నేడు సొసైటీ ఎదుర్కొంటున్న ఒక బర్నింగ్ ఇష్యూను ఎలాంటి మెసేజ్ లు ఇవ్వకుండా లైట్ హార్టెట్ గా స్క్రిప్ట్ చేశారు. పిల్లలు పుట్టిన యంగ్ కపుల్స్ సొసైటీ నుంచి ఒక ఒత్తిడిని ఎదుర్కొంటారు. ఇది వారిని మానసికంగా ఇబ్బందిపెడుతుంది. అలాంటి ఎమోషనల్ కంటెంట్ కూడా ఈ మూవీలో ఉంది. ఈ సినిమాలో నా పర్ ఫార్మెన్స్ కు పేరొస్తే దానికి కారణం మా దర్శకుడు సంజీవ్ రెడ్డి. ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన మా ప్రొడ్యూసర్స్ శ్రీధర్ గారికి, హరిప్రసాద్ గారికి థ్యాంక్స్. అజయ్ అరసాడ తన బీజీఎంతో సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాడు. నా ఆల్ టైమ్ ఫేవరేట్ సాంగ్ తెలుసా నీ కోసమే. ఈ పాటకు శ్రీమణి మంచి లిరిక్స్ ఇచ్చారు, అర్మాన్ మాలిక్ బాగా పాడారు. మా మూవీలో యాక్ట్ చేసిన వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్..ఇతర కాస్ట్ అందరికీ థ్యాంక్స్. చాందినీ పర్ ఫార్మెన్స్ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. "సంతాన ప్రాప్తిరస్తు" సినిమా ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉంటుంది, ఫ్యామిలీ వ్యాల్యూస్ చెబుతుంది. ఎక్కడా అసభ్యత అనేది ఉండదు. నవంబర్ 14న థియేటర్స్ లోకి వస్తున్న మా చిత్రాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. అన్నారు.

నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ - "సంతాన ప్రాప్తిరస్తు" టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. మధుర శ్రీధర్ నాకు మంచి మిత్రులు. ఆయన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ నుంచి ప్రొడ్యూసర్ గా మారారు. సినిమా అంటే ఎంతో ప్యాషన్ తో ఉంటారు. ఆయన ఎఫర్ట్స్ ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. "సంతాన ప్రాప్తిరస్తు" సాంగ్స్ చాలా బాగున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ కు కంగ్రాట్స్. ఈ సినిమా మంచి మ్యూజికల్ హిట్ కావాలని కోరుకుంటున్నా. అన్నారు.



Advertisement
Santhana PrapthirasthuChandini ChowdaryTollywoodCinema news

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News