తెలుగు సినిమాలు అందుకే 1000 కోట్లు కలెక్ట్‌ చేస్తాయి: శివ కార్తికేయన్

Entertainment
Advertisement
శివకార్తికేయన్ తాజా చిత్రం  'మదరాసి', ఎ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక వెంచర్ ఇప్పటికే టీజర్, ట్రైలర్, రెండు చార్ట్‌బస్టర్ సింగిల్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం సెప్టెంబర్ 5న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.  

ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో శివకార్తికేయన్ మాట్లాడుతూ... మెగాస్టార్ చిరంజీవి గారు, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు లాంటి పెద్ద స్టార్స్ ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గారు మురుగదాస్. ఆయనతో కలిసి వర్క్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. సాలిడ్ ఫిల్మ్ ఇచ్చారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ నా ప్రాణ స్నేహితుడు రాక్ స్టార్ అనిరుద్. అనిరుద్ అంటే హిట్ మిషన్. ఆయన ఇచ్చే పాటలన్నీ హిట్. సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. ఈ సినిమాకి ప్రొడ్యూసర్ తిరుపతి ప్రసాద్ గారు. చాలా సింపుల్ పర్సన్. చాలా పెద్ద సినిమా తీశారు. కంటెంట్ ఉంటే ఎంతైనా ఖర్చు చేస్తారు,. ఆయనలో ఆ క్వాలిటీ నాకు చాలా ఇష్టం. అందుకే తెలుగు సినిమాలు తరచుగా వెయ్యి కోట్లకు వెళ్తుంటాయి. ఈ సినిమాలో రుక్మిణి హీరోయిన్. చాలా టాలెంటెడ్. ఈ సినిమాలో లవ్ యాక్షన్ రెండు పిల్లర్స్. అందులో లవ్ పోర్షన్ అద్భుతంగా రావడానికి కారణం తనే. 

ఈ సినిమాలో మరో పిల్లర్ విలన్ విద్యుత్ జమ్వాల్. ఆయనతో చేసే యాక్షన్ సీక్వెన్స్ చాలా క్రేజీగా ఉంటాయి .అందరూ సెప్టెంబర్ 5 థియేటర్స్ కి వెళ్లి మద్రాసి చూడండి. ఎంజాయ్ చేయండి. ఇప్పటివరకు నా సినిమాలు రెమో, వరుణ్ డాక్టర్, కాలేజ్ డాన్, మహావీరుడు, అమరన్ కు మంచి సపోర్ట్ ఇచ్చారు. పెద్ద గుర్తింపు ఇచ్చారు.ఈ సినిమాకి కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. సక్సెస్ కంటే మీరు చూపించే ప్రేమే నాకు చాలా స్పెషల్. మీరందరూ మరింత ప్రేమిస్తారని కోరుకుంటున్నాను. మదరాసి తప్పకుండా చూడండి. అద్భుతమైన కథ, హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. టీం అందరం చాలా హార్డ్ వర్క్ చేశాం. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది. లవ్ యు ఆల్. 

హీరోయిన్ రుక్మిణి వసంత్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మదరాసి మా టీమ్ అందరికీ చాలా స్పెషల్ సినిమా. సెప్టెంబర్5 తర్వాత మీ అందరికీ కూడా ఫేవరెట్ సినిమా అవుతుంది. ఈ సినిమా నాకు చాలా స్పెషల్. ఒక అద్భుతమైన టీం తో కలిసి పని చేశాను. శివ కార్తికేయన్ గారు ఎక్స్ట్రార్డినరీ, ప్రొడ్యూసర్ ప్రసాద్ గారు చాలా సపోర్ట్ చేశారు. అందరు కూడా సెప్టెంబర్ 5 తప్పకుండా థియేటర్స్ లో చూసి ఎంజాయ్ చేయండి. యాక్షన్ లవ్ అన్ని ఎమోషన్స్ ఉన్న అద్భుతమైన ఎంటర్టైనర్ ఇది. కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. 

ప్రొడ్యూసర్ ఎన్వి ప్రసాద్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. మేము తమిళ్ నుంచి తెలుగుకి సినిమాలు తీసుకొస్తుంటాం. ఫస్ట్ టైం డైరెక్టర్ మురుగదాస్ గారి వలన తమిళ్లో చేశాం. శివ కార్తికేయన్ గారు ఈ సినిమాలో హీరో కావడం మా అదృష్టం. అమరన్ తర్వాత వస్తున్న ఈ సినిమాని ఎక్కడ రాజీ పడకుండా చాలా ప్రతిష్టాత్మకంగా తీశాం. శివ నిజాయితీపరుడు. కష్టపడి పైకి వచ్చాడు. ఈ సినిమాలో విద్యుత్, బిజుమినన్, రుక్మిణి వర్షన్ ఇలా అద్భుతమైన నటీనటులు వున్నారు. అనిరుద్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. టాప్ టెక్నీషియన్స్ అందరూ ఈ సినిమాకు పని చేశారు. సినిమా విజువల్ వండర్ గా ఉంటుంది. శివ కార్తికేయన్ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. 

బీస్ట్‌బెల్స్ ఉదయ్ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. నాకు ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలు ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమాకి ప్రైమరీ కంపెనీగా చాలా వర్క్ చేసాం. ఇంత గ్రాండియర్ సినిమా మేము చేసినందుకు చాలా గర్వంగా ఉంది.


Advertisement
Siva karthikeyanMadarasitollywoodMadarasi cinema news

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News