"లిటిల్ హార్ట్స్"థియేటర్‌లో చూసి ఎంజాయ్‌ చేయాల్సిన సినిమా : బన్నీవాస్, వంశీ నందిపాటి

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్ శివానీ నాగరం లీడ్ రోల్స్ లో నటిస్తున్న మూవీ "లిటిల్ హార్ట్స్". ఈ చిత్రాన్ని ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్ పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. "90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ "లిటిల్ హార్ట్స్" మూవీకి  నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాను నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ గా రిలీజ్ చేస్తున్నారు.  "లిటిల్ హార్ట్స్" సినిమా సెప్టెంబర్ 5న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ షేర్ చేసుకున్నారు బన్నీ వాస్, వంశీ నందిపాటి

*ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ బన్నీ వాస్ మాట్లాడుతూ -* "లిటిల్ హార్ట్స్" మూవీ బాగుందని వంశీ నందిపాటి చెప్పాడు. ఆ తర్వాత ఆదిత్య హాసన్ వచ్చి మూవీ గురించి వివరించాడు. సినిమా చూశాను చాలా బాగుంది.క్రియేటివ్ పరంగా మేము ఇన్వాల్వ్ కాలేదు. నాకు అనిపించిన సజెషన్స్ చెప్పాను. మొత్తం వాళ్లే చేసుకున్నారు. ఇందులో నటించిన వాళ్లు కొత్తవాళ్లు లేదా ఓటీటీలో ఎక్కువ పరిచయమైనవాళ్లు. కాబట్టి ఓపెనింగ్స్ నెమ్మదిగానే ప్రారంభమవుతాయని అనుకుంటున్నాం, అయితే మ్యాట్నీ, ఫస్ట్ షో నుంచి కలెక్షన్స్ పికప్ అవుతాయనే నమ్మకం ఉంది. "లిటిల్ హార్ట్స్"  కంటెంట్ బాగుంది. ఇలాంటి మూవీ నాలుగైదేళ్ల కిందట వచ్చి ఉంటే థియేటర్స్ లో కుమ్మేసేది. ఈ రెండు మూడు వారాల్లో కూడా యూత్ ఓరియెంటెడ్ ఫన్ మూవీ రావడం లేదు. సో అది మాకు అడ్వాంటేజ్ అవుతుందని ఆశిస్తున్నాం. ఫైనల్ కాపీ చూశాను, ప్రేక్షకులు బాగా నవ్వుకుంటారు. కరోనా టైమ్ నుంచి కంటెంట్ లో చాలా మార్పులు వచ్చాయి. ప్రచారం చేయాల్సిన తీరులోనూ మార్పులు వచ్చాయి. గతంలో పద్ధతులు ఇప్పుడు ఉపయోగపడటం లేదు. ట్రైలర్ నచ్చితేనే ప్రేక్షకులు సినిమా పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. మా సంస్థ నుంచి మిత్రమండలి సినిమాను అక్టోబర్ 16న దీపావళి సందర్భంగా రిలీజ్ చేయబోతున్నాం.

*నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి మాట్లాడుతూ -* "లిటిల్ హార్ట్స్"  సినిమా 80 పర్సెంట్ పూర్తై, పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో మేము డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం. ఒక ఆడియెన్ గా మాకు అనిపించినవి సజెషన్స్ చెప్పాం. "లిటిల్ హార్ట్స్" సినిమాను మేము చూస్తున్నప్పుడు ఇది థియేట్రికల్ కంటెంట్ , థియేటర్స్ లో బ్లాస్ట్ అవుతుంది అనిపించింది. బన్నీ వాస్ గారు తన బ్యానర్ నుంచి తీసుకొస్తున్న ఫస్ట్ మూవీ ఇది. యంగ్ టీమ్ ఈ చిత్రానికి పనిచేశారు. వాళ్ల ఎనర్జీ అంతా స్క్రీన్ మీద రిఫ్లెక్ట్ అవుతుందని నమ్ముతున్నాం. ఈటీవీ విన్ వారు తీసుకొస్తున్న కంటెంట్ చాలా బాగుంటుంది. మన చిన్నప్పటి మొమెరీస్ గుర్తు చేసేలా వాళ్ల మూవీస్, సిరీస్ లు ఉంటాయి. "90s మిడిల్ క్లాస్ బయోపిక్" స్కూల్ జ్ఞాపకాలను, ఎయిర్ అనే సిరీస్ తో కాలేజ్ డేస్ ను గుర్తుచేశారు. ఇప్పుడు లిటిల్ హార్ట్స్ తో కాలేజ్ అయ్యాక ఒక అమ్మాయికి ప్రపోజ్ చేసిన అబ్బాయి తన లవ్ సక్సెస్ చేసుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అనేది ఎంటర్ టైన్ చేస్తుంది. కంటెంట్ అనేది మారుతోంది. మేము పొలిమేర చేసినప్పటికి ఇప్పటికి కూడా కంటెంట్ వైజ్ చాలా మార్పులు వచ్చాయి. ప్రేక్షకుల అభిరుచిలో కూడా మార్పు వచ్చింది. దానికి తగినట్లే ప్రొడ్యూసర్స్ మారాల్సిఉంది. ఈ నెల 3వ తేదీన ఈ చిత్రానికి స్టూడెంట్స్ కోసం హైదరాబాద్, వైజాగ్, విజయవాడలో స్పెషల్ షోస్ ప్లాన్ చేస్తున్నాం. 4న పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నాం. దాదాపు 170 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం.

More Press Releases