జీ తెలుగు బోనాల సంబురం ‘బ్లాక్ బస్టర్ బోనాలు’, ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు!

Entertainment
Advertisement

వినోదభరితమైన కంటెంట్తో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఛానల్ జీ తెలుగు. ఆసక్తికరమైన మలుపులతో సాగుతున్న సీరియల్తో పాటు సరికొత్త కాన్సెప్ట్లతో నాన్ ఫిక్షన్ షోలతోనూ ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తోంది. ప్రత్యేక సందర్భాలను మరింత ప్రత్యేకంగా మలిచేందుకు ఎప్పుడూ ముందుండే జీ తెలుగు బోనాల సందర్భంగా మరో ప్రత్యేక కార్యక్రమంతో మీ ముందుకు రానుంది.

తెలంగాణ బోనాల సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం ‘బ్లాక్బస్టర్ బోనాలు’ జూలై 20న ఆదివారం సాయంత్రం 6 గంటలకు, మీ జీ తెలుగులో మాత్రమే!

జీ తెలుగు నటీనటుల ఆటపాటలు, అల్లరితో సందడిగా సాగిన ఈ కార్యక్రమానికి యాంకర్ రవి, వర్షిణి వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. సంప్రదాయం, సంస్కృతి మేళవింపుతో ఘనంగా  జరిగే ఈ కార్యక్రమంలో కళాకారుల ప్రదర్శనలు, హాస్య సన్నివేశాలు, వినోదాత్మక స్కిట్‌లు, మధురమైన పాటలతోపాటు మరెన్నో వినోదం పంచే  కార్యక్రమాలతో ఆకట్టుకోనున్నారు. జీ తెలుగులో ప్రసారమయ్యే మధ్యాహ్నం, ప్రైమ్‌టైమ్ సీరియల్స్ నటీనటులు హీరో శ్రీకాంత్‌‌‌‌ - నటి రోజా నాయకత్వంలో రెండు టీమ్లుగా ఏర్పడి పోటీపడనున్నారు. ఈ కార్యక్రమంలో జీ తెలుగు నటీనటులతోపాటు జోగిని శ్యామల దేవత ఎల్లమ్మ కథను హృదయాలకు హత్తుకునేలా ఆవిష్కరించనున్నారు. "హగ్ చేస్కో, సాంగ్ గెస్ చేస్కో" అనే ఆటతో అంత్యాక్షరి ఆటతో ప్రేక్షకులను అలరిస్తారు. శ్రీకాంత్ తన సూపర్హిట్ సినిమా "ప్రేయసిరావే" లోని గాజులు విసిరే సన్నివేశాన్ని పునఃసృష్టించనున్నారు. డ్రామా జూనియర్స్ పిల్లలు బాలకృష్ణ "అఖండ" పాత్రను హాస్యాస్పదంగా అనుకరించి కడుపుబ్బా నవ్వించనున్నారు.

రోజా చిరంజీవి శంకర్దాదా పాత్రలో, శ్రీకాంత్ తన ఏటీఎం పాత్రలో అదరగొడుతూ పండుగ వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మారుస్తారు. మధ్యాహ్నం,  ప్రైమ్‌టైమ్ హీరోయిన్‌ల మధ్య జరిగే నృత్య పోటీ వేదికను ఉర్రూతలూగిస్తుంది. చిన్నారులు రాయన్, కుషి తమ పాటలతో అందరి మనసులను గెలుచుకుంటారు. బోనాలు సందర్భంగా మహిళా కళాకారులకు గాజులు పంచడం తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తుచేస్తుంది. వైభవంగా జరిగిన ఈ బ్లాక్బస్టర్ బోనాలు కార్యక్రమాన్ని మీరూ మిస్ కాకుండా చూసేయండి!

 

వినోదభరితమైన బ్లాక్‌బస్టర్ బోనాలు కార్యక్రమాన్ని ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో   తప్పక చూడండి!

Advertisement
Zee TeluguBonalu

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News