జీ రైటర్స్ రూమ్ ద్వారా, భారతదేశపు భవిష్యత్తు స్క్రీన్ రైటర్లను గుర్తించడం కోసం మొదటిసారిగా ఈ తరహా అన్వేషణకు శ్రీకారం చుట్టిన ‘జీ’

Entertainment
Advertisement
15 జూలై 2025, హైదరాబాద్ – దేశవ్యాప్తంగా ఉన్న యువతరం, భవిష్యత్ స్క్రీన్ రైటర్లను గుర్తించి, వెలుగులోకి తీసుకొచ్చే లక్ష్యంతో, ఒక మైలురాయి కార్యక్రమంగా జీ రైటర్స్ రూమ్ – ప్రారంభించినట్లు ప్రముఖ కంటెంట్ మరియు టెక్నాలజీ పవర్‌హౌస్ అయిన జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (‘Z’) సగర్వంగా ప్రకటించింది. జీ రైటర్స్ రూమ్ అనేది ప్రతిభను అన్వేషించే ప్రయత్నం కంటే మించినది—'యువర్స్ ట్రూలీ Z' అనే కంపెనీ బ్రాండ్ తాత్వికతతో ముడిపడిన ఒక సృజనాత్మక ఉద్యమం ఇది. అన్ని ప్లాట్‌ఫామ్‌లలోనూ తన కంటెంట్ సమర్పణను మరింత మెరుగుపరచడమే దీని లక్ష్యం. తాజా దృక్పథాల కోసం డిమాండ్ అత్యధికంగా ఉన్న నేపథ్యంలో, మూల కథ చెప్పే సామర్థ్యం మరియు స్క్రీన్ రైటింగ్ అనే వృత్తిగత ప్రపంచం మధ్య అంతరం తగ్గించాలన్నది ఈ కార్యక్రమ ఉద్ధేశం. ఎంపిక చేసిన రచయితలు ‘Z’పరిధిలోని విస్తృత స్థాయి టీవీ, డిజిటల్ మరియు ఫిల్మ్ ప్లాట్‌ఫామ్‌ల కోసం కథలు రూపొందించేందుకు ఈ ఈ కార్యక్రమం అవకాశం అందిస్తుంది.
 
‘Z’కి చెందిన కేంద్రీయ కంటెంట్ మరియు ప్రాంతీయ బృందాల దర్శకత్వంలో, భారతదేశపు వినోద ప్రకృతి దృశ్యంలో అభివృద్ధి చెందుతున్న అవసరాలతో అనుసంధానం కాలేకపోతున్న ప్రతిభకు అవకాశం కల్పించడం కోసం ఈ కార్యక్రమం రూపొందించబడింది. "భవిష్యత్ రచయితలకు అవకాశాల ద్వారాలు తెరిచి, వారి – కథలు, స్క్రిప్ట్‌లు, స్క్రీన్‌లు" వెలుగులోకి తీసుకొచ్చే ఏకైక దార్శనికతతో,  ఏడు భారతీయ భాషల్లో ఉత్తేజకరమైన మరియు ఆకర్షణీయమైన బ్రాండ్ ఫిల్మ్‌తో జీ రైటర్స్ రూమ్ కార్యక్రమం ప్రకటించబడింది.  
 
80 నగరాలు మరియు 32 ఈవెంట్ సెంటర్లలో విస్తరించడం ద్వారా, ఆన్-ఎయిర్, డిజిటల్ మరియు ఆన్-గ్రౌండ్ ప్లాట్‌ఫామ్‌లలో విస్తరించిన అధిక-ప్రభావ ప్రమోషన్ ద్వారా ఈ కార్యక్రమం విస్తరించనుంది. హిందీ, మరాఠీ, బంగ్లా, తమిళం, తెలుగు, కన్నడ మరియు మలయాళ భాషల్లోని నిబద్ధత కలిగిన కథకులు వారి ఊహ, నిర్మాణం మరియు కథన నైపుణ్యం పెంపొందించుకునే దిశగా, సహకార రచయితల ప్రపంచంలోకి అడుగు పెట్టే అపూర్వ అవకాశం అందించడమే ఈ కార్యక్రమ లక్ష్యం. 
 
బ్రాండ్ ఫిల్మ్‌ని ఇక్కడ వీక్షించండి:ZEE Writers' Room Brand Film
 
ఈ కార్యక్రమం గురించి జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ చీఫ్ క్రియేటివ్ ఆఫీసర్ రాఘవేంద్ర హున్‌సూర్ మాట్లాడుతూ, “భారతదేశంలోని ప్రముఖ కథకుల్లో ఒకరిగా మారేందుకు ఇది మేము అందిస్తున్న అవకాశం మాత్రమే కాదు. భవిష్యత్తు తరం రచయితల ప్రతిభను పెంపొందించే మా కర్తవ్యం కూడా ఇందులో భాగమే. జీలో, మా అతిపెద్ద బలం మా కథనాలు మాత్రమే కాదు, మేము గుర్తించి, అవకాశం ఇచ్చే కథకులు కూడా అని మేము విశ్వసిస్తున్నాము. జీ రైటర్స్ రూమ్‌తో సరికొత్త స్వరాలు, ఇప్పటికింకా చెవినపడని ఆలోచనలు మరియు నిజాయితీ కలిగిన భావోద్వేగాలు రూపం సంతరించుకునే ప్రదేశాన్ని మేము సృష్టిస్తున్నాము. ఇది ఒక పోటీ కాదు - ఇది ఒక నిబద్ధత. స్క్రీన్‌లలో, ప్రాంతాల్లో, శైలుల్లో శాశ్వత అనుభవాలు నిర్మించడం కోసం భారతదేశంలోని ప్రతి ప్రాంతానికి చెందిన రచయితలకు పనిముట్లు, మార్గదర్శకత్వం మరియు విశ్వాసం అందించడం ద్వారా — క్రియేటర్లకు సాధికారత అందించడం, వారికి నైపుణ్యం, ధైర్యం మరియు అవకాశం అందించడం మా విధి. ఎందుకంటే, కథ చెప్పే తీరు యొక్క భవిష్యత్తు అనేది మనం ఏం చేస్తామనే దాని మీద మాత్రమే కాకుండా - మనం దేనితో ఆ పని చేస్తామనే దానిమీద కూడా అది ఆధారపడి ఉంటుంది” అన్నారు.
 
ZEEL చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ కార్తీక్ మహాదేవ్ మాట్లాడుతూ, “జీ రైటర్స్ రూమ్‌తో, మా బ్రాండ్ వాగ్దానంలో మేము ఒక అడుగు ముందుకు వేస్తున్నాము—కథ చెప్పే నైపుణ్యం మెరుగుపరచడం మీద దృష్టి సారించడం ద్వారా మరియు విభిన్నమైన మరియు వైవిధ్యమైన కథలు చెప్పడంలో మాకు సహాయపడే రచయితల సంఘాన్ని మేము నిర్మిస్తున్నాము. ఉద్విగ్నులైన రచయితలు రేపటి కథకులుగా మారేందుకు ద్వారాలు తెరిచే స్థలాన్ని మేము సృష్టిస్తున్నాము” అని అన్నారు.
చీఫ్ క్లస్టర్ ఆఫీసర్ – ఈస్ట్, నార్త్,  ప్రీమియం క్లస్టర్, జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌‌గా ఉన్న సామ్రాట్ ఘోష్ మాట్లాడుతూ, “బెంగాల్ ఎల్లప్పుడూ సాహిత్యం మరియు సినిమా సంబంధిత ప్రతిభకి కేంద్రంగా ఉంటోంది. వెలుగులోకి వస్తున్న బెంగాలీ కథకులు వారి స్వరాలను గుర్తించి, వారసత్వ మరియు సమకాలీన సున్నితత్వాలను ప్రతిబింబించే కథనాలు రూపొందించడం కోసం జీ రైటర్స్ రూమ్‌తో మేము ఒక నూతన యుగం వేదిక ఏర్పాటు చేస్తున్నాము” అన్నారు.
 
చీఫ్ క్లస్టర్ ఆఫీసర్ – సౌత్ & వెస్ట్ జీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌గా ఉన్న సిజూ ప్రభాకరన్ మాట్లాడుతూ, “దేశంలోని అత్యంత శక్తివంతంగా కథలు చెప్పే సంస్కృతులకు దక్షిణ మరియు పశ్చిమ ప్రాంతాలు నిలయంగా ఉన్నాయి. అక్కడి ఆ అభిరుచి మరియు సృజనాత్మకతను టీవీ, ఓటీటీ మరియు సినిమాల్లో వృద్ధి చెందగల వృత్తిగత నిర్మాణాత్మక కంటెంట్‌లోకి మళ్లించడంలో జీ రైటర్స్ రూమ్ సహాయపడుతుంది” అన్నారు.
 
ఇప్పటికే ఒక సృజనాత్మక జ్వలనత—అది స్వీయ-అభ్యసనతో వచ్చినది కావచ్చు లేదంటే, నియమబద్ధంగా నేర్చుకున్నది కావచ్చు—కలిగిన రచయితల కోసం రూపొందించబడిన జీరైటర్స్ రూమ్ ఇప్పుడు కాలేజీ ఫెస్టివల్స్, రైటర్స్ క్లబ్బులు లేదా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో సత్తా నిరూపించుకుని, పరిశ్రమలోకి ప్రవేశం కోసం నిరీక్షిస్తున్న ప్రతిభని స్వాగతిస్తోంది. రచనలో ప్రాథమిక అంశాలు నేర్పడం కోసం రూపొందించిన కార్యక్రమం కానప్పటికీ, ఆశాజనక ప్రతిభతో వృత్తిగత స్క్రీన్ రైటర్లుగా మారేందుకు సిద్ధంగా ఉన్న వారికి మెరుగులు దిద్దడానికి మరియు వారిని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి ఈ కార్యక్రమం రూపొందించబడింది.
 
ఈ 70 మంది కొత్త రచయితలు మరియు 30 మంది వర్థమాన నిపుణులు ఒక ఆలోచనలు-రూపొందించే ఇంజన్లుగా తయారవుతారు. కథా బీజాలు మరియు సంభావిత అంశాలను టీవీ, ఓటీటీ మరియు సినిమాల్లో ‘Z’కి అవసరమైన కంటెంట్‌ కోసం ఆకర్షణీయ కొత్త ప్రపంచాలుగా, పాత్రోచితంగా మరియు కథన నిర్మాణాలుగా మలుస్తారు. ఎన్‌రోల్ చేసుకోవడానికి, సందర్శించండి [www.zeewritersroom.com]. ప్రతి అభ్యర్థి ఈ లింక్‌లోకి వెళ్లాలి:
·         రచయితల కోసం పరీక్ష: రిజిస్టర్ చేసుకున్న పార్టిసిపెంట్లు ఎంపిక కార్యక్రమానికి హాజరు కావాలి మరియు టెస్ట్ రాయాలి.
·         సమర్పించిన వాటిని మూల్యాంకనం చేయడం: రచనా ప్రతిభ ఆధారంగా, టాప్ 10% మందిని రీడింగ్ కమిటీ షార్ట్‌లిస్ట్ చేస్తుంది.
·         ఇంటర్వ్యూ ప్రక్రియ: ఫైనలిస్టులని పరిశ్రమకి చెందిన ప్యానెల్ మదింపు చేస్తుంది.
·         జీ రైటర్స్ రూమ్‌లోకి ప్రవేశం: టాప్ 100 మందిని జీ రైటర్స్ రూమ్‌లోకి ప్రవేశిస్తారు. ఇక్కడ వాళ్లు నిపుణుల మార్గదర్శకత్వంలో కథా ఆలోచనలకు మెరుగులు దిద్దుతారు.
మీరింకా దేనికోసం నిరీక్షిస్తున్నారు? తక్షణం, జీ రైటర్స్ రూమ్‌లో చేరడం ద్వారా, భవిష్యత్ కంటెంట్‌ రూపకర్తలుగా అవకాశం అందుకోండి.
Advertisement
Zee NewsTollywood

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News