అందమైన ప్రేమకథ 'జయం'... జీ తెలుగులో కొత్త సీరియల్

Entertainment
Advertisement
హైదరాబాద్, 11 జులై 2025: తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎల్లప్పుడూ వినోదం పంచే ఛానల్ జీ తెలుగు. ఊహించని మలుపులు, ఆసక్తికర కథనాలతో సాగే సీరియల్స్తో ఆకట్టుకుంటోన్న జీ తెలుగు సరికొత్త సీరియల్ ‘జయం’ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రేమ, మోసం, పట్టుదల, బాధ్యతల నడుమ సాగే సరికొత్త ప్రేమ కథతో రూపొందుతున్న సీరియల్ జయం. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొంటూ ఎలా ముందుకు సాగాలో తెలిపే స్ఫూర్తివంతమైన కథతో ఈ సీరియల్ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆకట్టుకునే కథతో రానున్న జయం, జులై 14న ప్రారంభం, సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 8 గంటలకు, మీ జీ తెలుగులో!

జయం సీరియల్ కథ మాజీ బాక్సర్ రుద్రప్రతాప్(శ్రీరామ్ వెంకట్), పేదింటి అమ్మాయి గంగావతి(వర్షిణి) జీవితాల చుట్టూ తిరుగుతుంది. రుద్ర తన సోదరుడి మరణం, చెరగని గాయాలతో కూడిన గతంతో సతమతమవుతుండగా, పేదరికం, తల్లి అనారోగ్యం, తండ్రి బాధ్యతారాహిత్యంతో గంగ జీవితం దినదిన గండంగా సాగుతుంది. వీరిద్దరూ ఎలా కలుస్తారు? వారి మధ్య ప్రేమ చిగురిస్తుందా? గతాన్ని అధిగమించి ముందుకు వెళ్లగలరా? అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే జీ తెలుగులో సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే జయం సీరియల్ తప్పకుండా చూడాల్సిందే.

ఈ సీరియల్ విశేషాలు పంచుకోడానికి జులై 11న హైదరాబాద్లోని ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో జయం సీరియల్ ప్రధాన పాత్రదారులైన శ్రీరామ్ వెంకట్, వర్షిణి పాల్గొని కథలోని పాత్రలు, ఆసక్తికరమైన అంశాలను పంచుకున్నారు.

ప్రముఖ నటుడు శ్రీరామ్ వెంకట్ మాట్లాడుతూ, "జయం ఒక ప్రత్యేకమైన కథ, ఇది ఇప్పటివరకు నేను పోషించిన పాత్రలకు భిన్నమైనది. బాక్సింగ్ కోచ్‌గా రుద్ర పాత్రలో నటించడం నాకు సవాలుగా, అదే సమయంలో ఉత్సాహంగా అనిపించింది. మా నటీనటులు, సిబ్బంది అంకితభావంతో పనిచేస్తున్నారు. ప్రేక్షకులు ఈ ధారావాహికను తప్పకుండా ఆదరిస్తారని ఆశిస్తున్నాం" అన్నారు.

జయం సీరియల్ జులై 14 నుంచి ప్రతి సోమవారం నుంచి శనివారం రాత్రి 8 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. ఈ సీరియల్ ప్రారంభంతో ఇతర ధారావాహికల ప్రసార సమయాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. జులై 14 నుంచి, చామంతి రాత్రి 8:30 గంటలకు, జగద్ధాత్రి రాత్రి 9 గంటలకు ప్రసారమవుతాయి. దయచేసి జీ తెలుగు ప్రేక్షకులు గమనించగలరు.

 భావోద్వేగాల సమాహారంగా సాగే సరికొత్త సీరియల్ జయం.. సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు రాత్రి 8 గం. మీ జీ తెలుగులో.. తప్పక చూడండి!
Advertisement
JayamNew SerialZEE TeluguTV

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News