నవీన్ చంద్ర చేతుల మీదగా ‘యముడు’ టీజర్.. ఆకట్టుకునే విజువల్స్, ఆర్ఆర్

Entertainment
Advertisement
రెగ్యులర్ కమర్షియల్, లవ్, యాక్షన్ చిత్రాల కంటే కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలనే ఆడియెన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. ఇలాంటి ట్రెండ్‌లోనే ప్రస్తుతం ఓ మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ చిత్రం రాబోతోంది. జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన చిత్రం ‘యముడు’. 'ధర్మో రక్షతి రక్షితః' అనే ఉప శీర్షిక. ఈ చిత్రంలో శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇది వరకే ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ జనాల్లో క్యూరియాసిటీని పెంచేసింది.

తాజాగా ‘యముడు’ చిత్రం నుంచి టీజర్‌ను రిలీజ్ చేశారు. గురువారం నాడు ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ హీరో నవీన్ చంద్ర రిలీజ్ చేశారు. టీజర్‌ను చూసిన అనంతరం చిత్రయూనిట్‌ను అభినందించారు. ఇక ఈ టీజర్‌ను గమనిస్తే ఇదొక మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ మూవీ అని అర్థం అవుతుంది. సిటీలో ఉన్న అమ్మాయిలు మిస్ అవుతుండటం, నాటకాల్లో యముడు వేషం వేసే వ్యక్తికి ఈ హత్యలకు సంబంధం ఉందేమో అన్నట్టుగా టీజర్‌ను కట్ చేశారు. యముడు భూలోకంకి వచ్చి నరకంలో విధించే శిక్షలన్నీ ఇక్కడే విధిస్తాడేమో అన్నట్టుగా కనిపిస్తోంది.

‘ధర్మంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం’ అనే డైలాగ్ చూస్తుంటే, ఈ సినిమా హిందూ ధర్మాన్ని ఆధారంగా చేసుకుని కొత్త దృక్పథాన్ని చూపించబోతుందన్న ఆసక్తి కలుగుతుంది. హిందు ధర్మం నుంచి ఓ కొత్త పాయింట్‌తో ఆసక్తికరంగా సినిమాను మల్చినట్టు అనిపిస్తుంది. టీజర్‌లో విష్ణు రెడ్డి వంగా కెమెరా వర్క్, భవాని రాకేష్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత ప్రభావవంతంగా అనిపించింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని అప్డేట్లను మేకర్లు ప్రకటించనున్నారు.

నటీనటులు : జగదీష్ ఆమంచి, శ్రావణి శెట్టి, ఆకాశ్ చల్లా తదితరులు 

సాంకేతిక బృందం
బ్యానర్ : జగన్నాధ పిక్చర్స్
కథ, దర్శకుడు, నిర్మాత : జగదీష్ ఆమంచి
రైటర్ : హరి అల్లసాని, జగదీష్ ఆమంచి
స్క్రీన్ ప్లే : శివ కుండ్రపు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : రజిని ఆమంచి
ఎడిటర్ : కెసిబి హరి 
డిఓపి : విష్ణు రెడ్డి వంగా
సంగీతం : భవాని రాకేష్ 
పీఆర్వో : సాయి సతీష్


Advertisement
Tollywood

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News