'బకాసుర రెస్టారెంట్‌' ట్రైలర్‌ విడుదల

Entertainment
Advertisement
పలు విజయవంతమైన చిత్రాలతో మంచి నటుడిగా, కమెడియన్‌గా అందరికి సుపరిచితుడైన ప్రవీణ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'బకాసుర రెస్టారెంట్‌',   ఈ చిత్రంలో వైవా హర్ష టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నారు. కృష్ణభగవాన్‌ ,షైనింగ్‌ ఫణి, కేజీఎఫ్‌ గరుడరామ్‌,ఇతర ముఖ్య పాత్రలో యాక్ట్‌ చేస్తున్నారు. ఎస్‌జే శివ దర్శకుడిగా పరిచయం కాబోతున్న ఈ చిత్రాన్ని ఎస్‌జే మూవీస్‌ పతాకంపై లక్ష్మయ్య ఆచారి, జనార్థన్‌ ఆచారి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమైంది. హంగర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న  ఈ చిత్రం ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు మేకర్స్‌. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు మారుతి ముఖ్య అతిథిగా విచ్చేసి ట్రైలర్‌ను విడుదల చేశారు. 

ఈ సందర్భంగా ప్రవీణ్‌ మాట్లాడుతూ ''భకాసుర రెస్టారెంట్‌ త్వరలో మీ ముందుకు రాబోతుంది. మా ట్రైలర్‌ మారుతి గారి చేతుల మీదుగా విడుదల కావడం హ్యపీగా ఉంది. ఆయన దర్శకత్వంలో వచ్చిన ప్రేమకథా చిత్రం నా కెరీర్‌ సెట్‌ కావడానికి ఎంతో ఉపయోగపడింది. ఈ రోజు మరోసారి ఆయన నా సినిమా ట్రైలర్‌కు రావడం ఆనందంగా ఉంది. ఆయనకు నా కృతజ్ఞతలు.' అన్నారు. మారుతి మాట్లాడుతూ '' ఈ సినిమాకు టైటిల్‌తోనే విజయం సాధించారు. మంచి టైటిల్‌ పెట్టారు. సినిమా కూడా బాగుంటుందనే ఫీల్‌ కలుగుతుంది. మంచి టైటిల్‌ ఈ సినిమాకు పెట్టడంతో మంచి పాజిటివ్‌ వైబ్‌ ఉంది. చాలా రోజుల నుంచి ప్రవీణ్‌ను హీరోగా చూడాలనుకుంటున్నాను. ఈ రోజుకు కుదిరింది. డెఫినెట్‌గా ఈ సినిమా ప్రవీణ్‌ కెరీర్‌కు మరో మైలురాయిగా నిలుస్తుంది. తప్పకుండా ఈ సినిమా ఆడియన్స్‌ అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా తప్పకుండా విజయం సాధించి ఈ సినిమా యూనిట్‌ అందరికి మంచి పేరు తీసుకరావాలని అని కోరుకుంటున్నాను' అన్నారు. 

నిర్మాత జనార్థన్‌ ఆచారి మాట్లాడుతూ '' శివ ఈ లైన్‌ చెప్పగానే బాగా నచ్చింది. వెంటనే ఈ పాత్రకు ప్రవీణ్‌ అనుకున్నాం. పాత్రకు తగ్గ ఆర్టిస్టులు ఈ సినిమాకు కుదిరారు. ఆర్టిస్టులు అందరూ ఎంతో సపోర్ట్‌ చేశారు. కేజీఎఫ్‌ గరుడ రామ్‌ పాత్ర అందరికి నచ్చుతుంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుంది' అన్నారు. దర్శకుడు ఎస్‌జే శివ మాట్లాడుతూ  '' మా చిత్రం ద్వారా బకాసుర రెస్టారెంట్‌ చిత్రంతో ప్రవీణ్‌ను హీరోగా పరిచయం చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం ఆయనకు బిగ్‌ సక్సెస్‌ను ఇస్తుంది. వైవా హర్ష టైటిల్‌ రోల్‌లో నటిస్తున్నాడు. ఇలాంటి కథతో ఇప్పటి వరకు తెలుగులో సినిమా రాలేదు. సినిమాలో ప్రతి పాత్ర ఎంతో బాగా డిజైన్‌ చేసుకున్నాం. మా టెక్నిషియన్స్‌ ఎంతో సపోర్ట్‌ చేశారు. తప్పకుండా చిత్రం అందర్ని అలరిస్తుందనే నమ్మకం వుంది' అన్నారు. 

వైవా హర్ష మాట్లాడుతూ '' ఈ సినిమా అందరికి బెంచ్‌ మార్క్‌ ఫిల్మ్‌ అవుతుంది. దర్శకుడు ఎంతో అనుభవం ఉన్న దర్శకుడిలా సినిమాను హ్యాండిల్‌ చేశాడు. కుటుంబంతో కలిసి అందరూ చూడదగ్గ చిత్రమిది. ప్రవీణ్‌ ఈ సినిమాతో హీరోగా మారినందుకు హ్యపీగా వుంది. ఇది ట్రెండింగ్‌ జానర్‌ అయిన హారర్‌ జోనర్‌ సినిమా కాబట్టి తప్పకుండా విజయం సాధిస్తుంది. అందరూ థియేటర్‌లో ఎంజాయ్‌ చేయల్సిన సినిమా ఇది' అన్నారు. 

Advertisement
Bakasura RestaurantBakasura Restaurant trailerTollywoodCinema newsPraveenViva harshaMaruthi

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News