ఆది సాయి కుమార్ శంబాల మేకింగ్ వీడియో రిలీజ్.. ఆసక్తి పెంచుతున్న విజువల్స్

Entertainment
Advertisement
యంగ్ హీరో ఆది సాయి కుమార్ కెరీర్ డిఫరెంట్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అవుతోంది. ప్రతి సినిమాలో వైవిద్యం చూపిస్తూ దూసుకుపోతున్న ఈ హీరో ప్రస్తుతం ఆడియెన్స్‌ను నూతన ప్రపంచంలోకి తీసుకెళ్లే సినిమా చేస్తున్నారు. ఆ సినిమానే శంబాలా. కాల్పనిక ప్రపంచంలో జరిగే అద్భుతమైన ఘట్టాల్ని చూసి ఆడియెన్స్ థ్రిల్ అవుతున్నారు. ఈ క్రమంలోనే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి తీసుకెళ్లేలా ‘శంబాల’ చిత్రాన్ని పూర్తి చేస్తున్నారు ఆది సాయి కుమార్. 

షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజశేఖర్ అన్నభీమోజు, మహిధర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాకు 'ఏ-యాడ్ ఇన్‌ఫినిటిమ్' ఫేమ్ డైరెక్టర్ యుగంధర్ ముని దర్శకత్వం వహిస్తున్నారు. ఖర్చులకు ఎక్కడా రాజీ పడకుండా భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ఆది సాయి కుమార్ సరసన అర్చన అయ్యర్ కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుతున్న దర్శకనిర్మాతలు.. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు జోరుగా ప్రమోషన్స్ చేస్తున్నారు. 

ఇప్పటికే శంబాల మూవీ నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ మొదలుకొని.. వరుసగా వస్తున్న అన్ని అప్ డేట్స్ సినిమాపై అంచనాలు క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే తాజాగా శంబాలా మేకింగ్ వీడియో వదిలారు మేకర్స్. టీజర్ లోడింగ్ అంటూ వదిలిన ఈ వీడియోలో సినిమా కోసం చిత్రయూనిట్ ఏ రేంజ్ లో కష్టపడుతోందో చూపిస్తూ ఆసక్తిరేకెత్తించారు. తాజాగా విడుదల చేసిన ఈ వీడియో సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టింది. చిత్రంలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ చూడబోతున్నామని ఈ వీడియో చెప్పకనే చెప్పింది.  

ఈ  శంబాల చిత్రంలో ఆది సాయి కుమార్ జియో సైంటిస్ట్‌గా కనిపించనున్నారు. సూర్య 45వ చిత్రంలో భాగమైన శ్వాసిక ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుండగా.. రవివర్మ, మీసాల లక్ష్మణ్, మధునందన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై ఇదివరకెన్నడూ టచ్ చేయని పాయింట్, కథతో ఈ సూపర్ నేచురల్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తున్నారు. న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఫిల్మ్ మేకింగ్‌లో శిక్షణ పొందిన యుగంధర్ ముని హాలీవుడ్ స్థాయి నిర్మాణాన్ని లక్ష్యంగా చేసుకుని హై టెక్నికల్ స్టాండర్డ్స్‌తో, గ్రాండ్ విజువల్స్‌తో రూపొందిస్తున్నారు. ఈ మూవీలో విజువల్స్, సాంకేతికత అత్యున్నత స్థాయిలో ఉండేలా చూసుకుంటున్నారు. ఈ చిత్రానికి భారతీయ సంగీత విద్వాంసుడు శ్రీరామ్ మద్దూరి సంగీతాన్ని అందిస్తున్నారు.  అతి త్వరలో ఈ సినిమా రిలీజ్ డేట్ సహా మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వదులుతామని చిత్రయూనిట్ చెబుతోంది.

   
Advertisement
Tollywood

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News