నాగవంశీ ధైర్యమే ఆయన్ని ఇంతదూరం తీసుకొచ్చింది: అక్కినేని నాగచైతన్య

Entertainment
Advertisement
బ్లాక్ బస్టర్ చిత్రం 'మ్యాడ్'కి సీక్వెల్ గా రూపొందిన 'మ్యాడ్ స్క్వేర్'పై భారీ అంచనాలు ఉన్నాయి. నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ తో కలిసి సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై హారిక సూర్యదేవర, సాయి సౌజన్య నిర్మించారు. ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ సమర్పకులు. భీమ్స్ సిసిరోలియో పాటలను స్వరపరచగా, తమన్ నేపథ్య సంగీతం అందించారు. ఈ వేసవికి వినోదాల విందుని అందించడానికి 'మ్యాడ్ స్క్వేర్' చిత్రం మార్చి 28న థియేటర్లలో అడుగుపెడుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు విశేషంగా ఆకట్టుకొని.. ఈ సినిమా సంచలన విజయం సాధిస్తుందనే నమ్మకాన్ని కలిగించాయి. బుధవారం సాయంత్రం ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో వైభవంగా నిర్వహించారు. యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకలో ప్రముఖ దర్శకులు మారుతి, వెంకీ అట్లూరితో పాటు చిత్ర బృందం పాల్గొంది.

ఈ సందర్భంగా ముఖ్య అతిథి అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ, "మ్యాడ్ స్క్వేర్ ట్రైలర్ చూశాను. అది మ్యాడ్ స్క్వేర్ కాదు, మ్యాడ్ మ్యాక్స్. ట్రైలర్ చాలా బాగుంది. నాకు ఈ వేడుకకు రావడం సంతోషంగా ఉంది. నేను మ్యాడ్ సినిమాలోని కామెడీ సీన్స్ చూస్తూ, ఒత్తిడిని దూరం చేసుకుంటూ ఉంటాను. ఇలాంటి సినిమాలు ఆరోగ్యానికి చాలా మంచిది. డల్ గా ఉన్నప్పుడు మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా సూచించాలనేది నా అభిప్రాయం. ఇలాంటి సినిమాలు చూడటం వల్ల.. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో కలిసి సరదాగా గడిపేలా చేస్తాయి. ఫ్రెండ్ షిప్ ని స్ట్రాంగ్ చేస్తాయి. కొత్త ఫ్రెండ్స్ ని పరిచయం చేస్తాయి. మ్యాడ్ లాంటి సినిమాలు రావడం సంతోషంగా ఉంది. మ్యాడ్ సినిమాతో ఈ ముగ్గురు హీరోలు స్టార్స్ అయిపోయారు. ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలా వీళ్ళ పేర్లను గుర్తు పెట్టుకుంటారు. కామెడీ చేయడం అనేది చాలా కష్టం. నార్నె నితిన్, రామ్, సంగీత్ లో ఆ టాలెంట్ ఉంది కాబట్టే ఇంత నవ్వించగలిగారు. ఒక స్టోరీ డిస్కషన్ లో దర్శకుడు కళ్యాణ్ తో కూర్చున్నప్పుడు ఆయన నేరేషన్ కే పడిపడి నవ్వాను. ఇక ఈ సినిమా ఎలా ఉంటుందో ఊహించగలను. నా ఫేవరెట్ డీఓపీ శామ్‌దత్ గారు ఈ సినిమాకి పనిచేశారు. నిర్మాతగా హారిక మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను. నాది, నాగవంశీ జర్నీ ప్రేమమ్ తో మొదలైంది. తన ధైర్యమే నాగవంశీని ఇంతదూరం తీసుకొచ్చింది. దర్శకులకు, నటులకు ఎంతో ధైర్యాన్ని ఇస్తూ వరుస విజయాలు అందుకుంటున్నారు. అలాగే నిర్మాత చినబాబు గారు అంటే నాకు ఎంతో ఇష్టం. మ్యాడ్ స్క్వేర్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మంచి ఓపెనింగ్స్ వచ్చి, సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. మ్యాడ్ 2 మాత్రమే కాదు, మ్యాడ్ 100 కూడా రావాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్." అన్నారు.

దర్శకుడు వెంకీ అట్లూరి మాట్లాడుతూ, "నేను మ్యాడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా వచ్చాను. ఆ సమయంలో నార్నె నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్‌ పేర్లు అప్పుడప్పుడే తెలుస్తున్నాయి. కానీ, ఇప్పుడు ఈ ముగ్గురు ప్రతి కుటుంబానికి చేరువయ్యారు. ముగ్గురు కలిసి సినిమాని బాగా ప్రమోట్ చేశారు. ఈ సినిమాలో కొన్ని సీన్స్ చూసి నేను పగలబడినవ్వాను. హారిక మొదటి సినిమాతోనే పెద్ద హిట్ కొట్టారు. ఇప్పుడు రెండో సినిమాతో ఇంకా పెద్ద హిట్ అందుకుంటారనే నమ్మకం ఉంది. భీమ్స్ గారు స్వరపరిచిన పాటలు పెద్ద హిట్ అయ్యాయి. మ్యాడ్ స్క్వేర్ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ ఆల్ ది బెస్ట్." అన్నారు.


కథానాయకుడు నార్నె నితిన్ మాట్లాడుతూ, " ఏడాదిన్నర క్రితం మేము మ్యాడ్ సినిమాతో వచ్చాము. అప్పుడు మా పేర్లు కూడా ఎవరికీ సరిగా తెలియదు. అయినా మా సినిమాని పెద్ద హిట్ చేశారు. మా దేవుళ్ళు ప్రేక్షకులే. ఇప్పుడు మిమ్మల్ని ఇంకా ఎంటర్టైన్ చేయడానికి మ్యాడ్ స్క్వేర్ తో వస్తున్నాం. మా దర్శకుడు కళ్యాణ్ శంకర్ గారికి సినిమా అంటే చాలా పిచ్చి ఉంది. అందుకే దానిని మ్యాడ్ అనే సినిమా టైటిల్ తో చూపిస్తున్నారు. నన్ను నమ్మి, నాకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినందుకు కళ్యాణ్ గారికి, చినబాబు గారికి, నాగవంశీ గారికి, హారిక గారికి ధన్యవాదాలు. డీఓపీ శామ్‌దత్ గారు మమ్మల్ని అందంగా చూపించారు. భీమ్స్ సిసిరోలియో గారు అద్భుతమైన సంగీతం అందించారు. ఈ సినిమాలో భాగమైన ప్రతి ఒక్కరికీ థాంక్స్." అన్నారు.

కథానాయకుడు సంగీత్ శోభన్ మాట్లాడుతూ, "నాగచైతన్య గారు ఎప్పుడూ పాజిటివ్ గా ఉంటారు. ఆయన ఈ వేడుకకు రావడం సంతోషంగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ గారు మా టీజర్ చూసి ఎంజాయ్ చేయడంతో మాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. థాంక్యూ సో మచ్ తారక్ అన్న. ఈ వేడుకకు హాజరైన వెంకీ అట్లూరి గారికి, మారుతి గారికి థాంక్స్. చినబాబు గారు, నాగవంశీ గారు, హారిక గారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. దర్శకుడు కళ్యాణ్ శంకర్ గారు మిక్సింగ్ పనులుండి రాలేకపోయారు. సక్సెస్ మీట్ కి వస్తారు. మాతో పాటు విడుదలవుతున్న నితిన్ గారి 'రాబిన్ హుడ్' కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను." అన్నారు.

కథానాయకుడు రామ్ నితిన్ మాట్లాడుతూ, "సినిమా మీద నాకున్న ప్రేమ, అభిమానం, గౌరవం నన్ను ఇక్కడివరకు తీసుకొచ్చాయి. అలాంటి సినిమాని నాకు పరిచయం మా అమ్మకి, సినిమాల్లోకి వస్తానంటే నన్ను ప్రోత్సహించిన నాన్నకి, అలాగే నన్ను సపోర్ట్ చేసిన మా మావయ్యకి రుణపడి ఉన్నాను. నిహారిక గారు నిర్మించిన 'హలో వరల్డ్' అనే సిరీస్ చూసి, నన్ను నమ్మి 'మ్యాడ్'లో మనోజ్ పాత్ర చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలు చినబాబు గారికి, నాగవంశీ గారికి, హారిక గారికి జీవితాంతం రుణపడి ఉంటాను. నన్ను గైడ్ చేసిన దర్శకుడు కళ్యాణ్ శంకర్ గారికి ధన్యవాదాలు. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన నన్ను, ఇంతలా ఆదరిస్తున్న ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు. " అన్నారు. 
Advertisement
MAD SquareAkkineni Naga ChaitanyaNarne NithiinMad Square prev releaseTollywoodSangeeth Shobhan

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News