సంక్రాంతికి వస్తున్నాం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్, సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్, లక్ష్మీ నివాసం ప్రారంభం.. బ్యాక్ టు బ్యాక్ ఎంటర్టైన్మెంట్ మీ జీ తెలుగులో!

Entertainment
Advertisement
హైదరాబాద్, 26 ఫిబ్రవరి 2025: వరుస సూపర్హిట్ సినిమాలు, సరికొత్త కాన్సెప్ట్లతో ఫిక్షన్, నాన్ఫిక్షన్ షోలతో అలరిస్తున్న జీ తెలుగు మరో త్రిపుల్ బొనాంజా ఎంటర్టైన్మెంట్తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ ఏడాది సంక్రాంతి బ్లాక్బస్టర్గా నిలిచిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాని వరల్డ్ టెలివిజ్ ప్రీమియర్గా ప్రసారం చేసేందుకు సిద్దమైంది. జీ తెలుగు 16 సీరియల్స్ పోటీపడే సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్, మధ్యతరగతి కుటుంబ కథతో ప్రేక్షకులను ఆకట్టకునేలా రూపొందుతున్న లక్ష్మీ నివాసం సీరియల్ని ప్రారంభించనుంది. సంక్రాంతికి వస్తున్నాం మార్చి 1(శనివారం)న సాయంత్రం 6 గంటలకు, నటులు శ్రీకాంత్, రోజా, రాశి, డైరెక్టర్ అనిల్ రావిపూడి అతిథులు గా హాజరైన సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ గ్రాండ్ లాంచ్ మార్చి 2(ఆదివారం) సాయంత్రం 6 గంటలకు, ప్రేమ, బాధ్యత, బంధాలే ప్రధానంగా సాగే సరికొత్త సీరియల్ లక్ష్మీ నివాసం ప్రారంభం మార్చి 3(సోమవారం) రాత్రి 7 గంటలకు.. మీ జీ తెలుగులో!


విక్టరీ వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా జీ తెలుగు వేదికగా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే కథాంశంతో అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. థియటర్ రన్ ముగించుకుని జీ తెలుగు వేదికగా ఈ శనివారం సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా ప్రసారం కానుంది. 

జీ తెలుగు ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న నాన్-ఫిక్షన్ షోలలో ఒకటైన సూపర్ సీరియల్ ఛాంపియన్షిప్ ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది. ఈ లాంచ్ ఎపిసోడ్కి ప్రముఖ నటులు శ్రీకాంత్, రోజా, రాశి, డైరెక్టర్ అనిల్ రావిపూడి, సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ బుల్లిరాజు అతిథులుగా హాజరై మరింత వినోదాన్ని అందించనున్నారు. యాంకర్ రవి, అషు రెడ్డి వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్న ఈ షోలో మీ అభిమాన జీ తెలుగు 16 సీరియల్ జట్లు ఛాంపియన్షిప్ టైటిల్ కోసం తలపడతాయి. సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ ప్రారంభ ఎపిసోడ్ నుంచే అంతులేని వినోదంతోపాటు సరదా ఆటలు, సవాళ్లతో హోరాహోరీ పోటీ జరగనుంది. సూపర్ సీరియల్ ఛాంపియన్ షో ఈ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమై ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది.

అంతేకాదు, ఆసక్తికరమైన మలుపులతోసాగే సీరియల్స్తో ఆకట్టుకుంటున్న జీ తెలుగు మరో అద్భుతమైన కథతో రూపొందుతున్న లక్ష్మీ నివాసం సీరియల్ని ప్రారంభించబోతోంది. సాధారణ మధ్యతరగతికి చెందిన లక్ష్మి, శ్రీనివాస్ ల ప్రేమకథ ఆధారంగా ఈ సీరియల్ తెరకెక్కుతోంది. లక్ష్మీ నివాసాన్ని నిర్మించాలనే శ్రీనివాస్ కల, ఆడపిల్లల పెళ్లిళ్లు చేయాలనే లక్ష్మి ఆరాటం, వారి పిల్లల ఆకాంక్షల మధ్య జరిగే సంఘర్షణే ప్రధానంగా ఈ సీరియల్ కథ సాగుతుంది. ఈ అందమైన కుటుంబ ప్రయాణం గురించి మరింత తెలుసుకోవాలంటే మార్చి 3 సోమవారం  నుంచి ప్రతిరోజూ రాత్రి 7 గంటలకు జీ తెలుగులో ప్రసారమయ్యే లక్ష్మీ నివాసం సీరియల్ మిస్కాకుండా చూసేయండి.  

లక్ష్మీనివాసం సీరియల్ ప్రారంభంతో జీ తెలుగు ఇతర సీరియల్స్ ప్రసార సమయాల్లో స్వల్ప మార్పులు ఉంటాయి. మార్చి 3వ తేదీ నుంచి నిండు నూరేళ్ల సావాసం సాయంత్రం 6.30 గంటలకు, మా అన్నయ్య సాయంత్రం 6 గంటలకు, చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రసారమవుతాయి. జీ తెలుగు ప్రేక్షకులు దయచేసి గమనించగలరు!

జీ తెలుగు అందిస్తున్న త్రిపుల్ ధమాకా ఎంటర్టైన్మెంట్.. మార్చి 1 నుంచి 3 వరకు తప్పకుండా చూసేయండి!


Advertisement
Sankranthiki VasthunamVenkatesh Daggubati

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News