యాక్షన్, మాడ్‌నెస్ లో వరల్డ్ సెన్సేషన్ గా మారిన యష్, KVN ప్రొడక్షన్స్ టాక్సిక్

Entertainment
Advertisement
"టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రౌన్-అప్స్" భారతీయ చిత్రసీమలో కొత్త ఒరవడిని సృష్టిస్తోంది. ఇంగ్లీష్ మరియు కన్నడ రెండింటిలోనూ చిత్రీకరించబడిన మొట్టమొదటి బిగ్ స్కేల్ భారతీయ చిత్రంగా చరిత్ర సృష్టించనుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించే ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళం, మలయాళం వంటి భాషల్లో డబ్బింగ్ చేయనున్నారు.

"రాకింగ్ స్టార్" యష్ నటిస్తున్న ఈ చిత్రాన్ని, అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన గీతూ మోహందాస్ రాశి, దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా కన్నడలో భారతీయ ప్రేక్షకులకు, ఇంగ్లీష్‌లో ప్రపంచవ్యాప్తంగా అందరికీ కనెక్ట్ అయ్యెలా రూపొందించబడింది.

డైరెక్టర్  గీతూ మోహందాస్ మాట్లాడుతూ - "'టాక్సిక్' కోసం మేము ఒక అంతర్జాతీయ స్థాయి కథను సృష్టించాలనుకున్నాం. ఇది భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండాలి. అందుకే కన్నడ, ఇంగ్లీష్ రెండింటిలోనూ చిత్రీకరించాం. ఈ సినిమా భాషలు, సాంస్కృతిక భేదాలను దాటి అందరి హృదయాలను తాకేలా ఉంటుంది" అన్నారు.

యష్‌ తన 'మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్' సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే, వెంకట్ నారాయణ ‘KVN ప్రొడక్షన్స్’ సహనిర్మాత. యష్, గీతూ మోహందాస్ కలసి దీన్ని ఓ మహత్తరమైన సినిమాగా మలచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

ఈ చిత్రంలో హాలీవుడ్ స్థాయిలో యాక్షన్ సన్నివేశాలను రూపొందించేందుకు ‘జాన్ విక్’ మరియు ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ సినిమాల్లో పని చేసిన యాక్షన్ కొరియోగ్రాఫర్ జెజె పెర్రీని తీసుకున్నారు. అలాగే, విజువల్ ఎఫెక్ట్స్ కోసం ‘డ్యూన్: పార్ట్ 2’ సినిమాకు బీఏఎఫ్టీఏ అవార్డు గెలుచుకున్న DNEG స్టూడియో పని చేస్తోంది.

 యష్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన 'బర్త్‌డే పీక్' టీజర్, సినిమా గ్రాండియర్ ని ప్రజెంట్ చేస్తోంది. సినిమా షూటింగ్ 2024 ఆగస్టులో ప్రారంభమైంది. కన్నడ, ఇంగ్లీష్ రెండింటిలోనూ అద్భుతంగా తీయడానికి  మేకర్స్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇది ఇప్పటివరకు తీసిన హయ్యస్ట్ బడ్జెట్ భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తోంది.

నిర్మాత వెంకట్ నారాయణ మాట్లాడుతూ - "టాక్సిక్’ విషయంలో మా లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. భారతదేశం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆకట్టులునే చిత్రంగా టాక్సిక్‌ను రూపొందిస్తున్నాం. 'టాక్సిక్' తప్పకుండా ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది, అలాగే భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్తుంది" అన్నారు.
Advertisement
ToxicYash

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News