నా కెరీర్‌లో యాక్షన్‌ టచ్‌ ఉన్న కామెడీ ఫిల్మ్‌ 'లైలా': విశ్వక్‌సేన్‌

Entertainment
Advertisement
విశ్వక్‌సేన్‌, ఆకాంక్ష శర్మ జంటగా '. రామ్ నారాయణ్ దర్శకత్వం తెరకెక్కుతోన్న చిత్రం 'లైలా'. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మించారు. ఈ చిత్రం నుంచి  సెకండ్ సింగిల్ ఇచ్చుకుందాం బేబీని లాంచ్ చేశారు. లియోన్ జేమ్స్ స్వరపరిచిన ఈ ట్రాక్ అప్ బీట్ మోడ్రన్ స్టయిల్ బ్లెండ్ తో ఆకట్టుకుంది. 

ఈ పాటని ఆదిత్య ఆర్కే , ఎంఎం మానసి ఎనర్జిటిక్ వోకల్స్ ఆలపించారు. పూర్ణాచారి అందించిన సాహిత్యం లీడ్ పెయిర్  కెమిస్ట్రీని ప్రెజెంట్ చేసింది. యూత్ ఫుల్ ఎనర్జీతో సాంగ్ వైరల్ గా మారింది. విశ్వక్సేన్, ఆకాంక్ష శర్మల కెమిస్ట్రీ అదిరిపోయింది. బీచ్  బ్యాక్ డ్రాప్ పాట వైబ్‌ను మరింతగా పెంచుతోంది. ఆకాంక్ష శర్మ తన చార్మ్ తో సన్నివేశానికి అదనపు గ్లామర్‌ను తెస్తుంది, విశ్వక్సేన్ చరిస్మాటిక్ గా కనిపించాడు.

ఫుట్ ట్యాపింగ్ నెంబర్ ఇచ్చుకుందాం బేబీ  మ్యూజిక్, విజువల్స్ రెండింటిలోనూ కట్టిపడేసింది. ఫస్ట్ సింగిల్ సోను మోడల్ లాగానే, ఇచ్చుకుందాం బేబీ కూడా సూపర్ హిట్ అవుతుంది. 

ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే వాసుదేవ మూర్తి రాశారు, రిచర్డ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్. లైలా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదల కానుంది.

విశ్వక్‌సేన్‌  మాట్లాడుతూ.. యాక్టర్ గా నా విష్ లో వున్న సినిమా 'లైలా'. ఇలాంటి కథ క్యారెక్టర్ చేయాలని ఎప్పటినుంచో వుండే. డైరెక్టర్ రామ్ నారాయణ్ కథ చెప్పగానే నేను చేస్తానని చెప్పాను. ఈ సినిమా చేసే అవకాశం ఇచ్చిన సాహు అన్న థాంక్ యూ. ఫిబ్రవరి 14న వస్తున్నాం. వాలెంటైన్స్ డే కి సింగిల్స్ తమకు ఎవరూ లేరని బాధపడుతుంటారు. ఈ వాలెంటైన్స్ డే కి మీకు లైలా వుంది. అమ్మాయిలు సింగిల్ అని అనుకుంటే మీకు సోను మోడల్ వున్నాడు.(నవ్వుతూ) నా కెరీర్ లో యాక్షన్ టచ్ తో అవుట్ అండ్ అవుట్ కామెడీ ఫిల్మ్ ఇదే. న్యూ ఏజ్ ఫిలిం. మీరంతా ఎంజాయ్ చేస్తారు. ఫిబ్రవరి 14కి కలుద్దాం. అప్పటివరకూ ఇచ్చుకుందాం బేబీని ఎంజాయ్ చేయండి. ఇది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఫిల్మ్. చాలా క్లీన్ ఫిల్మ్ తీశాం. లైలా మీకు నచ్చుతుంది. లైలా కోసం రెడీ అవ్వడానికి రెండేసి గంటలు పట్టేది. నిజంగా అమ్మాయిలకు హ్యాట్సప్ చెప్పాలి. ఫిబ్రవరి 1న రాయలసీయ మాస్ సాంగ్ ఓహో రత్తమ్మ రిలీజ్ చేస్తున్నాం. అది కూడా అదిరిపోయింది' అన్నారు. 

డైరెక్టర్ రామ్ నారాయణ్ మాట్లాడుతూ.. ఇలాంటి సబ్జెక్ట్  చేయడం ఒక ఛాలెంజ్. ఇలాంటి సబ్జెక్ట్ ని ఒప్పుకున్నందుకు సాహు గారికి చాలా థాంక్స్. ఈ కథ ఇద్దరు ముగ్గురు హీరోలు చెప్పాను. లేడి గెటప్ వేయడం అంత ఈజీ కాదు. సినిమా అంటే పిచ్చి వున్నాడే చేయాలి. అలాంటి పిచ్చి వున్న విశ్వక్ నాకు దొరికారు. తనకు లైఫ్ లాంగ్ రుణపడి వుంటాను. నా టీం అందరి టెక్నికల్ బ్రిలియన్స్ మీకు స్క్రీన్ పై కనిపిస్తుంది' అన్నారు.  

నిర్మాత సాహు గారపాటి మాట్లాడుతూ.. రామ్ కథ చెప్పిన తర్వాత కొందరు హీరోలకు అప్రోచ్ అయ్యాను. లేడి క్యారెక్టర్ ని చేయగలుగుతామా లేదా అనుకునే టైంలో విశ్వక్ ఇలాంటి క్యారెక్టర్ కోసం తను ఎదురుచూస్తున్నాని చెప్పి సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఇది మంచి క్యారెక్టర్ గా తన కెరీర్ లో నిలిచిపోతుంది. యూత్ ట్యాలెంట్ తో ఈ సినిమా కోసం పని చేశారు. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది' అన్నారు.
Advertisement
LailaVishwak SenIcchukundam Baby

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News