"రజాకార్" సినిమాను బాధ్యతతో చేశాం!

Entertainment
Advertisement
బాబీ సింహ, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా రజాకార్. గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. యాటా సత్యనారాయణ దరకత్వం వహించారు. గతేడాది థియేటర్స్ లో రిలీజైన  రజాకార్ సినిమా ఈ నెల 24వ తేదీ నుంచి ఆహా ఓటీటీలో వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ కు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో

నిర్మాత గూడూరు నారాయణ రెడ్డి మాట్లాడుతూ - సినిమాలను డబ్బు కోసం, ఎంటర్ టైన్ మెంట్ కోసం చేస్తుంటారు. కానీ మేము రజాకార్ సినిమాను ఒక బాధ్యతతో చేశాం. నిజాం పాలనలో రజాకార్లు సాగించిన అకృత్యాలను కళ్లకు కట్టినట్లు చూపించాలనే ప్రయత్నం చేశాం. రేపటి తరాలు రజాకార్ల అకృత్యాలను తెలుసుకోవాలి. మరోసారి అలాంటి వారు రాకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ సినిమా నిర్మించే క్రమంలో నాకు ఎన్నో బెదిరింపులు వచ్చాయి. నన్ను నా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరించారు. కానీ నేను భయపడలేదు. సినిమాను నిర్మించాను'' అన్నారు. 

నటి ఇంద్రజ మాట్లాడుతూ - రజాకార్ల అకృత్యాలకు ఈ సినిమా గొప్ప డాక్యుమెంటరీ. మన నేల చరిత్ర గురించి తెలుసుకోవడం ఇక్కడ బతికే ప్రతి ఒక్కరి బాధ్యత. మతాలకు అతీతంగా ఈ సినిమాను ప్రతి ఒక్కరూ ఆహాలో చూడాలి. ఎందుకంటే ఇది హిందూ, ముస్లిం మతాల మధ్య విభేదాలు సృష్టించే మూవీ కాదు. చరిత్రలో జరిగింది జరిగినట్లు తెరకెక్కించారు. ముస్లిం జర్నలిస్ట్ క్యారెక్టర్ మా సినిమాలో గొప్పగా ఉంటుంది. అలాగే ప్రజల కోసం ఎన్నో మంచి పనులు చేసిన ఆరో నిజాం ఘనతను కూడా చెప్పాం. నేను ఈ సినిమాలో వీరనారి చాకలి ఐలమ్మ క్యారెక్టర్ లో నటించాను. ఇలాంటి గొప్ప క్యారెక్టర్ లో నటించే అవకాశం కల్పించిన మా డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెబుతున్నా. చాకలి ఐల్మమ చేస్తున్నాని తెలిసినప్పుడు ఆమె చరిత్ర చదివి తెలుసుకున్నాను. ఆమె ఒక నిప్పురవ్వలా అప్పటి అకృత్యాలపై ఎదురుతిరిగారు. అన్నారు.


డైరెక్టర్ యాటా సత్యనారాయణ మాట్లాడుతూ - మా మూవీ. థియేట్రికల్ రిలీజ్ టైమ్ లో మంచి సమ్మర్, విద్యార్థులకు పరీక్షలు జరిగే టైమ్ కాబట్టి ఎక్కువమంది మా సినిమాను చూడలేకపోయారు. ఓటీటీలోకి మూవీని ఎప్పుడు తీసుకొస్తారు అని వందల ఫోన్ కాల్స్ వచ్చాయి. మాకు మూడు ఓటీటీల నుంచి ఆఫర్స్ వచ్చాయి. అయితే ఆహాలో మాత్రమే 25 నుంచి 30 లక్షల మంది తెలుగు ప్రేక్షకులు సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. మన చరిత్రను తెలుగు ప్రేక్షకులు తెలుసుకోవాలంటే ఆహా కరెక్ట్ ప్లాట్ ఫామ్ అని భావించి ఈ నెల 24న ప్రీమియర్ కు తీసుకొస్తున్నాం. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా మా మూవీ ఉంటుంది. తప్పకుండా మీరంతా ఆహాలో రజాకార్ సినిమా చూడాలని కోరుకుంటున్నా. మొదటి నుంచి ఆహా మాకు సపోర్ట్ గా ఉంది. ఫిలిం ఫెస్టివల్స్, హిందీ రిలీజ్ వల్ల ఓటీటీకి ఇవ్వడం ఆలస్యమైంది. తెలంగాణ చరిత్రకు సంబంధించి 20 మంది వీరుల కథలు నా దగ్గర సిద్ధంగా ఉన్నాయి. అవకాశాన్ని బట్టి ఆ వీరుల చరిత్రను సినిమాగా రూపొందిస్తా. నిడివి ప్రకారం ఆపరేషన్ పోలోను ఎంతవరకు చూపించగలమో అంతవరకు మా మూవీలో తెరకెక్కించాం. అన్నారు.
Advertisement
Razakarahaindrajatollywood

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News