జీ తెలుగు డబుల్ బొనాంజా: సరిగమప పార్టీ డిసెంబర్ 31న, చామంతి సీరియల్ జనవరి 1న ప్రారంభం!

Entertainment
Advertisement
హైదరాబాద్, 27 డిసెంబర్ 2024: అనునిత్యం వినోదం పంచే కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు మరిన్ని వినోదభరిత కార్యక్రమాలతో 2024 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూనే, నూతన సంవత్సరానికి ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమైంది. ఇటీవల ఖమ్మంలో ఘనంగా జరిగిన ‘సరిగమప పార్టీకి వేళాయెరా’ కార్యక్రమాన్ని డిసెంబర్ 31, రాత్రి 10 గంటలకు ప్రసారం చేయనుంది. ఆసక్తికరమైన మలుపులు, అదిరిపోయే ట్విస్ట్లతో సాగే సీరియల్స్ అందిస్తున్న జీ తెలుగు మరో ఆకట్టుకునే అంశంతో సాగే చామంతి సీరియల్ను నూతన సంవత్సర కానుకగా అందిస్తోంది. ‘సరిగమప పార్టీకి వేళాయెరా’ డిసెంబర్ 31, సరికొత్త సీరియల్ చామంతి జనవరి 1న(బుధవారం) ప్రతిరోజు రాత్రి 8:30 గంటలకు, మీ జీ తెలుగులో!

ఇటీవల ఖమ్మం వేదికగా జీ తెలుగు నిర్వహించిన న్యూ ఇయర్ స్పెషల్ ఈవెంట్ సరిగమప పార్టీకి వేళాయెరా కార్యక్రమాన్ని 2024 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ ప్రసారం చేస్తోంది. యాంకర్ రవి, లాస్య వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ కార్యక్రమంలో సరిగమప గాయనీగాయకులు జీ తెలుగు సీరియల్ నటీనటులతో పోటీపడ్డారు. మేఘసందేశం సీరియల్ నుంచి గగన్ (అభినవ్), భూమి (భూమిక), నిండు నూరేళ్ల సావాసం సీరియల్ నుంచి అమరేంద్ర (రిచర్డ్ జోస్), అరుంధతి (పల్లవి గౌడ), భాగమతి(నిసర్గ గౌడ), చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్ నుంచి మిత్ర (రఘు), లక్ష్మి (మహి గౌతమి) తదితరులు పాల్గొని అద్భుతమైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు.  హృదయాన్ని హత్తుకునే పాటలు, ఉల్లాసకరమైన ఆటలు, అద్భుతమైన ప్రదర్శనలతో కార్యక్రమం ఆద్యంతం కోలాహలంగా సాగింది. పాటల పోటీలు, కామెడీ స్కిట్లు, అందాల పోటీలు నిర్వహించడమే కాకుండా ఈ వేదికపై ప్రతిభావంతులైన దివ్యాంగులను ప్రోత్సహించింది జీ తెలుగు. 2024 సంవత్సరానికి ఘనమైన వీడ్కోలు పలుకుతూ అభిమానుల కోలాహలంతో సాగిన ఈ కార్యక్రమాన్ని మీరూ మిస్ కాకుండా చూసేయండి.

చలాకీ అమ్మాయి అయిన చామంతి(మేఘనా లోకేష్) తన కుటుంబంతో ఊరిలో జీవిస్తుంది. చామంతి కుటుంబం ఆ ఊరిలో జమీందారీ ఇంట్లో నమ్మకంగా పని చేస్తుంది. చామంతి తండ్రి - రామచంద్రయ్య (ప్రభాకర్), తల్లి మూగ. చామంతి అక్క రోజా వాయుపుత్ర ఎయిర్లైన్స్లో ఎయిర్ హోస్టెస్గా పనిచేస్తుంది. ఇక జమీందారీ కుటుంబ సహాయంతో ఎదిగిన వ్యక్తి వాయుపుత్ర ఎయిర్లైన్స్ ఎండీ హర్షవర్ధన్. అరుణ్, ప్రేమ్ హర్షవర్ధన్ వారసులు. పల్లెటూర్లో ఉండే చామంతి హైదరాబాద్ ఎలా చేరుకుంది? చామంతి, ప్రేమ్ మధ్య ప్రేమ ఎలా చిగురిస్తుంది? రోజా హర్షవర్ధన్ ఇంటికి ఎలా చేరుకుంటుంది? వంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవాలంటే జీ తెలుగులో ప్రసారమయ్యే చామంతి సీరియల్ చూడాల్సిందే. ప్రతిభావంతులైన నటీనటులు, ఆకట్టుకునే కథాంశంతో చామంతి సీరియల్ ప్రేక్షకులను అలరించనుంది. మేఘనా లోకేష్, ఆశిష్ చక్రవర్తి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సీరియల్లో బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్, మౌనిక, భార్గవ్ రామ్, ఐశ్వర్య, శశిధర్, శ్రియ రమేష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

జీ తెలుగు డబుల్ ధమాకా.. ఈ ఏడాదిని ముగిస్తూ ‘సరిగమప పార్టీకి వేళాయెరా’ డిసెంబర్ 31న, రాత్రి 10 గంటలకు. కొత్త సంవత్సర వేళ చక్కని కథతో వస్తున్న కొత్త సీరియల్ చామంతి జనవరి 1న ప్రారంభం, ప్రతిరోజు రాత్రి 8:30 గంటలకు.. తప్పక చూడండి!
Advertisement
Zee TeluguChamanthi

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News