'ఎస్‌ఐ యుగంధర్' సినిమా ప్రారంభం

Entertainment
Advertisement
ఆది సాయికుమార్‌ హీరోగా యశ్వంత్ దర్శకత్వంలో శ్రీ పినాక మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రదీప్ జూలూరు నిర్మిస్తున్న క్రైమ్-యాక్షన్ థ్రిల్లర్ 'SI యుగంధర్'. రాకేందు మౌళి మరో కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో మేఘలేఖ హీరోయిన్.ఈ రోజు పూజా కార్యక్రమంతో ఈ చిత్రం గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ముహూర్తపు సన్నివేశానికి హీరో సందీప్ కిషన్ క్లాప్ ఇచ్చారు. సాయి కుమార్ మేకర్స్ కి స్క్రిప్ట్ అందించారు.

ఈ సందర్భంగా మేకర్స్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని లాంచ్ చేశారు. ఆది సాయికుమార్‌ ను పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రజెంట్ చేసిన ఫస్ట్ లుక్ అదిరిపోయింది.ఈ చిత్రానికి ప్రణవ్ గిరిధరన్ మ్యూజిక్ అందిస్తున్నారు. డీవోపీ గా రవీంద్రనాథ్.టి పని చేస్తున్నారు. SJ శివ కిరణ్ ఎడిటర్, రాజేష్ లంక ఫైట్ మాస్టర్.

మూవీ లాంచింగ్ ఈవెంట్ లో సాయి కుమార్ మాట్లాడుతూ.. ముందుగా రామోజీరావు గారికి హ్యాపీ బర్త్ డే. వి మిస్ యు సార్. మీ బ్లెస్సింగ్స్ మా అందరికీ ఎప్పుడు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఆయన బర్త్డే రోజున ఈ సినిమాకి ఈటీవీ విన్ వారు అసోసియేట్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ కథని ఈటీవీ విన్ ఓన్ చేసుకోవడమే ఫస్ట్ సక్సెస్. టైటిల్ చాలా పవర్ ఫుల్ గా ఉంది. చాలా మంచి యంగ్ టీమ్ తో కలిసి పని చేస్తున్నారు. మంచి సినిమా చేస్తే ఆదరించడానికిఆడియన్స్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అలాంటి మంచి ప్రయత్నం ఇది. మనం చేసే పని త్రికరణ శుద్ధిగా చేస్తే విజయం దానంతట అదే వస్తుంది. ప్రేమకావాలి సినిమాతో ఆది జర్నీ మొదలైంది. 2025 ఆదికి ఒక మంచి కొత్త సంవత్సరం అవ్వాలని మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. సినిమా చాలా డిఫరెంట్ గా కనిపిస్తోంది. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సినిమా చాలా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను' అన్నారు.

హీరో ఆది సాయికుమార్ మాట్లాడుతూ.. ఒక యంగ్ టీమ్ తో కలిసి పని చేస్తున్నాం. చాలా కొత్తగా ప్రజెంట్ చేస్తారని నమ్మకం ఉంది. కంటెంట్ నమ్మి సినిమాని చేస్తున్నాం. ప్రదీప్ గారు చాలా పాషనెట్ ప్రొడ్యూసర్. ఈటీవీ వారికి థాంక్యూ. ఈ సినిమా కథ నచ్చి వాళ్ళు రైట్స్ తీసుకుని సినిమాని ముందుకు తీసుకొస్తున్నారు. 18 నుంచి షూట్ స్టార్ట్ కాబోతుంది. ఈసారి ఖచ్చితంగా హిట్ కొడుతున్నాం. లాంచింగ్ ఈవెంట్ కి వచ్చిన సందీప్ కి థాంక్యూ. తను ఎప్పుడు తోడుగా ఉంటాడు. మీ అందరి సపోర్టు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను' అన్నారు.

హీరోయిన్ మేఘలేఖ మాట్లాడుతూ.. దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు  అందరికీ పేరుపేరునా థాంక్యూ సో మచ్. ఆదితో వర్క్ చేయడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. త్వరలోనే థియేటర్స్ లో కలుద్దాం' అన్నారు

డైరెక్టర్ యశ్వంత్ మాట్లాడుతూ.. చాలా యూనిక్  థ్రిల్లర్ ఇది. చాలా బాగుంటుంది. ఆది గారికి ఈ కథ నచ్చింది వెంటనే మనం చేస్తున్నామని చెప్పారు. ఆయన చాలా సపోర్ట్ చేశారు.  నిర్మాతలకి థాంక్యూ సో మచ్. టీంలో అందరికీ థాంక్ యూ సో మచ్.

రాకేందు మౌళి మాట్లాడుతూ.. ఈ సినిమాలో నేను ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నాను. నేను కొన్నాళ్లుగా కేవలం రచన పైన దృష్టి పెట్టాను. బాగా నచ్చితే గాని ఏ పాత్రని చెయ్యట్లేదు. ఈ కథ నాకు చాలా నచ్చింది. అందుకే ఆ క్యారెక్టర్ చేయడానికి ఒప్పుకున్నాను. ఆది గారితో కలిసి ఫస్ట్ టైం వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ చాలా అద్భుతంగా ఈ కథని చెప్పారు. తప్పకుండా ఈ సినిమా చాలా మంచి విజయం సాధిస్తుంది . ఇలాంటి మంచి కథతో ముందుకు వస్తున్న నిర్మాతలకి కంగ్రాజులేషన్స్. చాలా మంచి థ్రిల్లర్ ఇది. తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది' అన్నారు.

ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయి కృష్ణ మాట్లాడుతూ.. ఈ కథ విన్నాము. చాలా యూనిక్ థ్రిల్లర్ అవుతుందని పించింది. అందుకే ఈ సినిమా రైట్స్ తీసుకున్నాము. డైరెక్టర్  స్క్రిప్ట్ ని చాలా అద్భుతంగా రాశారు. ఇదొక యూనిక్ థ్రిల్లర్ అవుతుంది. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్' అన్నారు

నిర్మాత ప్రదీప్ మాట్లాడుతూ.. ఇది చాలా డిఫరెంట్ స్టోరీ. ఈ కథ వినగానే మా మైండ్ లోకి ఆది గారు వచ్చారు. ఈ సినిమా ఒప్పుకున్నందుకు ఆయనకి థాంక్యూ సో మచ్. ఈటీవీ వారి  సపోర్ట్ కు థాంక్ యూ' అన్నారు.
Advertisement
Aadi saikumarCinemaSI Yugandhar

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News