రోటి కపడా రొమాన్స్‌ చిత్రం అందరికి మంచి బ్రేక్‌ నివ్వాలి: హీరో తేజా సజ్జా

Entertainment
Advertisement
లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్.. సృజన్‌ కుమార్ బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’. హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ రెడ్డి దర్శకుడు. నవంబరు 22న ఈ చిత్రం  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రీరిలీజ్‌ వేడుకను శుక్రవారం హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. 

ఈ వేడుకలో చిత్రంలోని నటీనటులు, చిత్ర నిర్మాతలు, దర్శకుడుతో పాటు దర్శకులు  యదు వంశీ, పవన్‌ సాధినేని, హర్ష, రచయిత కోనవెంకట్‌, నిర్మాతలు కేఎల్‌ దామోదర్‌ ప్రసాద్‌, చదల వాడ శ్రీనివాసరావు, తుమ్మల పల్లి రామసత్య నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హనుమాన్‌ చిత్రంతో పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన సూపర్‌హీరో తేజా సజ్జా విచ్చేశారు. 

ఈ సందర్భంగా తేజా సజ్టా మాట్లాడుతూ '' ఈ వేదిక మీద వున్న నూతన టాలెంట్‌కు ఈ సినిమా ఎన్నో ఏళ్ల కల. ఈ చిత్రంతో నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ ఎంతో మంది నూతన నటీనటులను పరిచయం చేస్తున్నాడు. ఆయన్ని చూస్తే ఎంతో ఇన్‌స్పయిరింగ్‌గా వుంటుంది. ఆయన ఇప్పటి వరకు తీసిన 14 సినిమాల్లో ఎంతో మంది దర్శకులను, రచయితలను, నటీనటులను సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు. 

నేను కూడా కెరీర్‌ ప్రారంభంలో గోపీ గారి ఆఫీసుకు వెళ్లేవాడిని. కానీ ఆయనతో సినిమా కుదరలేదు. ఇక రోటి కపడా రొమాన్స్‌తో ఈ నవంబరు 22న చాలా మంది నూతన నటీనటులు పుట్టబోతున్నారు. తప్పకుండా ఈ చిత్రం విజయం సాధించి, అందరికి మంచి బ్రేక్‌ నివ్వాలి.  తప్పకుండా అందరూ థియేటర్‌లో ఈ సినిమా చూసి విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను' అన్నారు. 

దర్శకుడు విక్రమ్‌ రెడ్డి మాట్లాడుతూ '' చాలా కష్టపడి దర్శకుడి నా పేరు చూసుకుంటున్నాను. ఈ సినిమాను కూడా ఎంతో కష్టపడి చేశాను. నేటి యూత్‌కు కనెక్ట్‌ అయ్యే విధంగా ఈసినిమా ఉంటుంది. ఈ సినిమా అందరిని నవ్విస్తుంది..ఏడిపిస్తుంది.. బాధపెడుతుంది.. ఆలోచింపజేస్తుంది. కుటుంబంతో చూడదగ్గ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ , థియేట్రికల్‌ రైట్స్‌ ఇలా అన్ని హక్కులు విడుదలకు ముందే అమ్మేశారు. 

సినిమా చూసి నచ్చి అందరూ హక్కులు కొనుక్కున్నారు. దీంతో మాకు విజయంపై మరింత నమ్మకం పెరిగింది. ఈ సినిమా విజయం సాధించకపోతే నేను దర్శకుడిగా రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తున్నాను'' అన్నారు. చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ '' ఈ సినిమాలో అన్ని ఎమోషన్ష్‌ వుంటాయి. ముఖ్యంగా నేటి యూత్‌కు నచ్చే లవ్‌స్టోరీలో ఓ భిన్నమైన కోణాన్ని దర్శకుడు ఈ చిత్రంలో ఆవిష్కరించాడు. సినిమాను చాలా మందికి చూపించాం. అందరికి ఎంతో బాగా నచ్చింది. 

తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందే నమ్మకం వుంది'' అన్నారు. కోన వెంకట్‌ మాట్లాడుతూ'' ఈ ఒక్క సినిమాతో సినీ పరిశ్రమకు ఇంత మంది న్యూ టాలెంట్‌ పరిచయం కావడం మాలాంటి వారందరికి ఎంతో రిలీఫ్‌. న్యూ టాలెంట్‌ ఎవరికి కావాలన్న బెక్కం వేణు సినిమాలను చూసి నటీనటులను ఎంపిక చేసుకోవచ్చు. సాధారణంగా స్టార్స్‌తో చేసే ఫిలింస్‌ డబ్బునే ఇస్తాయి. ఇలాంటి కాన్సెప్ట్‌ ఓరియెంటెండ్‌ సినిమాలు టాలెంటెడ్‌ ఆర్టిస్టులను పరిచయం చేస్తాయి.ఇలాంటి సినిమాలు కంటెండ్‌ ఈజ్‌ కింగ్‌ అని ప్రూవ్‌ చేస్తుంటాయి. ఈ  సినిమా కూడా అదే కోవలోకి చేరాలని, ఈ చిత్రం టీమ్‌కు మంచి విజయం చేకూరాలని కోరుకుంటున్నాను'' అన్నారు.
Advertisement
Roti Kapda RomanceTeja sajjaRoti Kapda Romance pre releaseCinema

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News