నార్నె నితిన్, నయన్ సారిక జంటగా నటించిన ఆయ్.. ఈ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు, మీ జీ తెలుగులో!

Entertainment
Advertisement
హైదరాబాద్, 14 నవంబర్ 2024: వారం వారం సరికొత్త సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న జీ తెలుగు ఈ ఆదివారం మరో కొత్త సినిమాతో మీ ముందుకు రాబోతోంది. టాలీవుడ్ యంగ్ హీరో నార్నె నితిన్ ప్రధాన పాత్రలో నటించిన ఆయ్   సినిమాని ఈ వారం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా అందించేందుకు సిద్ధమైంది. థియేటర్లో సూపర్హిట్గా నిలిచిన ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకులను అలరించేందకు వచ్చేస్తోంది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ఆయ్ నవంబర్ 17, ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు మీ జీ తెలుగులో మాత్రమే!
ఈ సినిమా కథ గోదావరి నదిలోని పసలపుడిలంక నేపథ్యంలో సాగుతుంది. కార్తీక్(నార్నే నితిన్), సుబ్బు(కసిరెడ్డి రాజ్కుమార్), హరి( అంకిత్ కొయ్య) చిన్నపటినుంచు మంచి స్నేహితులు. వర్క్ ఫ్రమ్ హోం కోసం ఊరికి వచ్చిన కార్తీక్ పల్లవి(నయని సారిక) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతడిని ఇష్ట పడుతుంది. అదే అమ్మాయిని సుబ్బు కూడా ప్రేమిస్తాడు. మరి పల్లవి ఎవరిని ప్రేమిస్తుంది..? వారికి ఎదురైన అడ్డంకులను ఎలా పరిష్కరించారు? అనేది తెలియాలంటే జీ తెలుగులో ఈ ఆదివారం ప్రసారమయ్యే ఆయ్ సినిమా చూడాల్సిందే.
అంజి కె మణిపుత్ర దర్శకత్వంలో రూపొందిన ఆయ్ సినిమా రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్గా రిలీజై ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆకట్టుకునే లవ్ ట్రాక్తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ పంచులతో ఆద్యంతం అలరించి సూపర్ హిట్గా నిలిచింది. ఆసక్తికరమైన కథాంశం, ఊహించని ట్విస్ట్ లతో ప్రేక్షకులను మెప్పించిన ఆయ్ సినిమాని ఈ ఆదివారం జీ తెలుగు వేదికగా మీరూ తప్పకుండా చూడండి.
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్గా సూపర్ హిట్ మూవీ ఆయ్.. ఈ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు, మీ జీ తెలుగులో.. డోంట్ మిస్!
Advertisement

More Press News

Unveiling First Look of Arjun Sarja as VIRAAVI from Polimera 3

09 Nov, 22:38

సరోజ్ కుమార్ ‘ఛప్రి’ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

06 Nov, 23:25

జీ తెలుగు దీపావళి ప్రత్యేక కార్యక్రమాలు.. ‘కుటుంబం అవార్డ్స్ 2026 పార్ట్-2’, ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’లో మంత్రి నారా లోకేశ్!

05 Nov, 12:23

"మాయలేడి"తో కమర్షియల్‌ హిట్‌ వస్తుంది: రాకేష్‌ వర్రే

04 Nov, 23:18

NATS Touches Many Hearts In The USA And India

04 Nov, 23:06

వీవీ వినాయక్‌ అతిథిగా కిషోర్ మూవీ మేకర్స్ తొలి సినిమా ప్రారంభం

04 Nov, 16:46

కస్టమర్ల అభిమానమే మా లక్ష్యం: ఎస్ఎన్ఎస్ సీఎండీ శ్రీకాంత్ రెడ్డి

04 Nov, 12:52

నవంబరు 20న 'డానీ' విడుదల

03 Nov, 11:25

'అ' చిత్రంలో రాహుల్‌ 'ఈశ్వర్‌'లో ప్రభాస్‌లా కనిపిస్తున్నాడు: వంశీ నందిపాటి

03 Nov, 11:17

"మయూఖ" 25 రోజుల విజయ వేడుక!

03 Nov, 11:12

"కొరివి" గ్లింప్స్‌ రెస్పాన్స్‌ అన్యూహ్యం!

02 Nov, 10:04

అనిల్ రావిపూడి ‘జనవరి 12 విడుదల’లో పాడే అవకాశం దక్కించుకోనున్న ముగ్గురు 'సరిగమప' కంటెస్టెంట్స్

31 Oct, 19:33

‘ఓ నా సిద్ధయ్య’ పాటను ఆవిష్కరించిన సోనూసూద్

31 Oct, 16:28

Sai Rajesh’s Mynaa Movie Launched

30 Oct, 23:31

‘మైలురాయి’ టైటిల్ ఆసక్తికరంగా ఉంది: నాగబాబు

30 Oct, 23:25

FIEO, Central Bank of India Educate Entrepreneurs on Export Opportunities

30 Oct, 17:28
..More Press News